Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

పొడిచేశావ్‌ కట్టప్పా!.. ఎందుకిలా చేశావు!.. పాపం మన కెప్టెన్‌!

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 1, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
catch.jpg

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు రుతురాజ్‌ గైక్వాడ్‌. సౌతాఫ్రికాతో వన్డేలకు ఈ మహారాష్ట్ర ఆటగాడిని ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం.. రాంచిలో తుదిజట్టులోనూ ఆడే అవకాశం ఇచ్చింది.

ఎట్టకేలకు ఓ అవకాశం
ఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్‌లో రుతు (Ruturaj Gaikwad) సత్తా చాటిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో 129 బంతుల్లో 117 పరుగులు సాధించిన రుతురాజ్‌.. రెండో మ్యాచ్‌లో అజేయ అర్ధ శతకం (68)తో సత్తా చాటాడు. 

ఈ క్రమంలోనే జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది. కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) గాయం వల్ల దూరం కావడం వల్ల రుతుకు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.

అయితే, ప్రస్తుత భారత వన్డే జట్టు కూర్పు దృష్ట్యా తుదిజట్టులో రుతురాజ్‌కు చోటు దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా రిషభ్‌ పంత్‌కు మొండిచేయి చూపిన నాయకత్వ బృందం రుతుకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో స్థానం కల్పించింది. ఈ క్రమంలో మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో ఈ కుడిచేతి వాటం ఆటగాడు బ్యాటింగ్‌కు వచ్చాడు.

ఊహించని రీతిలో షాక్‌
నెమ్మదిగానే తన ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన రుతురాజ్‌కు ఊహించని రీతిలో షాక్‌ తగిలింది. భారత ఇన్నింగ్స్‌లో 27వ ఓవర్‌ను సఫారీ పేసర్‌ ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ వేశాడు. అతడి బౌలింగ్‌లో మూడో బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో రుతు గాల్లోకి లేపాడు. 

అంతే.. ఇన్‌సైడ్‌ సర్కిల్‌ లోపల ఇంతలో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ నుంచి పాదరసంలా దూసుకవచ్చిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ నమ్మశక్యం కాని రీతిలో... ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు.

కోహ్లి సైతం.. నోరెళ్లబెట్టాడు
బ్రెవిస్‌ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకోవడంతో రుతు కథ ముగిసిపోయింది. మొత్తంగా 14 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి అతడు నిష్క్రమించాడు. నిజానికి బ్రెవిస్‌ ఆ క్యాచ్‌ అలా పడతాడని ఎవరూ ఊహించలేదు. అంతెందుకు రుతుకు తోడుగా మరో ఎండ్‌లో ఉన్న  దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సైతం.. ఆ క్యాచ్‌ చూసి నోరెళ్లబెట్టాడు.

అలా బ్రెవిస్‌ అద్భుత ఫీల్డింగ్‌ కారణంగా రుతు రీఎంట్రీలో దురదృష్టవశాత్తూ పెద్దగా స్కోరు చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో బ్రెవిస్‌ సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ హైలైట్‌ కాగా.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) చేసిన పోస్టు వైరల్‌గా మారింది. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్‌ చేసిన సీఎస్‌కే.. ‘‘ఎందుకిలా చేశావు డీబీ? ఎందుకు?’’ అంటూ క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చింది.

Why, Brevis… why?
Ruturaj was settling in so beautifully, playing with such calm and class —
and then you flew in the air and snatched that catch out of nowhere.

Brevis, you just broke the hearts of countless Rutu fans today. 💔
pic.twitter.com/qEfyTuhfHC

— Mahi Patel (@Mahi_Patel_07) November 30, 2025

 

పొడిచేశావు కదా కట్టప్పా
తమ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో తమకూ బాధ మిగిల్చాడనే ఉద్దేశంతో సీఎస్‌కే ఈ మేరకు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇందుకు బదులుగా.. ‘‘పాపం.. రుతును పొడిచేశావు కదా కట్టప్పా’’ అంటూ నెటిజన్లు బాహుబలి స్టైల్‌ మీమ్స్‌తో ఇద్దరినీ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా బేబీ ఏబీడీగా పేరొందిన బ్రెవిస్‌.. ఐపీఎల్‌లో రుతు కెప్టెన్సీలో సీఎస్‌కేకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈసారి 2026 వేలానికి ముందు బ్రెవిస్‌ను సీఎస్‌కే అట్టిపెట్టుకుంది కూడా!

భారత్‌ భారీ స్కోరు
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్‌ భారీ స్కోరు సాధించింది. రోహిత్‌ శర్మ (57), కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (60),  రవీంద్ర జడేజా (32) రాణించగా.. కోహ్లి (120 బంతుల్లో 135) శతక్కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.

కష్టాల్లో సౌతాఫ్రికా
లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 134 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (7), ర్యాన్‌ రికెల్టన్‌ (0), క్వింటన్‌ డికాక్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. టోనీ డి జోర్జి (39), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (37) ఓ మోస్తరుగా రాణించారు. ఇలాంటి దశలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ మాథ్యూ బ్రీట్జ్కే అర్ద శతకం పూర్తి చేసుకుని సఫారీల ఆశాకిరణంగా నిలిచాడు.

అన్నట్లు హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో బ్రెవిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను రుతురాజ్‌ పట్టడం విశేషం. కాగా భారత పేసర్లు హర్షిత్‌ రాణా మూడు, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక వికెట్‌ తీయగా.. కుల్దీప్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 25 ఓవర్ల ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. విజయానికి 188 పరుగుల దూరంలో నిలిచింది. మరోవైపు.. భారత్‌ గెలుపునకు ఐదు వికెట్లు కావాలి!!

చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్‌ను దాటేసి తొలి ప్లేయర్‌గా.. 7000వ సెంచరీ
ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌!

Need a breakthrough? Call Harshit Rana! 📞

A fine catch by Ruturaj as the dangerman Dewald Brevis departs 👏#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/w4PAuCIgUR

— Star Sports (@StarSportsIndia) November 30, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India Vs South Africa
ODI series
Dewald Brevis
Ruturaj Gaikwad
Chennai Super Kings
viral tweet
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్‌

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌

జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం

జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం

బుమ్రా పునరాగమనం

బుమ్రా పునరాగమనం

సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బ్యాటింగ్‌ భారత్‌దే! యువ ప్లేయర్‌ డెబ్యూ

సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బ్యాటింగ్‌ భారత్‌దే! యువ ప్లేయర్‌ డెబ్యూ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.