Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

టెస్టుల్లో ‘తొలి’ ట్రిపుల్‌ సెంచరీ.. ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ కన్నుమూత

Sports Sakshi User Sakshi Sakshi Time May 11, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
auscric.jpg

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బాబ్‌ కౌపర్‌ (Bob Cowper) కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌లో తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో చాలా ఏళ్లుగా పోరాడుతున్న ఆయన శనివారం తనువు చాలించారు.

టెస్టుల్లో ‘తొలి’ ట్రిపుల్‌ సెంచరీ..
కాగా ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టుల్లో మొట్టమొదటి త్రిశతకం బాదిన క్రికెటర్‌గా కౌపర్‌ చరిత్రకెక్కారు. ఇంగ్లండ్‌తో 1966 నాటి మెల్‌బోర్న్‌ టెస్టులో కౌపర్‌ 307 పరుగులతో సత్తా చాటారు. తద్వారా ఈ మేర అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకోవడంతో పాటు.. ఆస్ట్రేలియా యాషెస్‌ సిరీస్‌ను నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

నాలుగేళ్లకే 
ఇక 1964- 1968 మధ్య తన కెరీర్‌లో మొత్తంగా 27 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బాబ్‌ కౌపర్‌.. 46.84 సగటుతో 2061 పరుగులు సాధించారు. ఇందులో ఐదు శతకాలు ఉన్నాయి. అంతేకాదు పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌గా రాణించి 36 వికెట్లు కూడా పడగొట్టారు. అయితే, కెరీర్‌ మొదలుపెట్టిన నాలుగేళ్లకే కౌపర్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

కేవలం 28 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు కౌపర్‌ వీడ్కోలు పలికారు. వ్యాపార రంగంలో రాణించే నిమిత్తం ఈ మేర తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక​ దేశీ క్రికెట్‌లో విక్టోరియా తరఫున బాబ్‌ కౌపర్‌.. 83 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు.

ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగానూ
అదే విధంగా.. ఆటగాడిగా రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత.. 1987 నుంచి 2001 వరకు ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగానూ కౌపర్‌ సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2023లో ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’ పురస్కారం అందుకున్నారు.

క్రికెట్‌ ఆస్ట్రేలియా సంతాపం
కాగా బాబ్‌ కౌపర్‌ మరణం పట్ల క్రికెట్‌ ఆస్ట్రేలియా సంతాపం ప్రకటించింది. ‘‘బాబ్‌ కౌపర్‌ మృతి చెందారన్న వార్త మమ్మల్ని విషాదంలోకి నెట్టివేసింది. ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఆయనొక గౌరవప్రదమైన వ్యక్తి.

అత్యద్భుతమైన బ్యాటర్‌. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో బాబ్‌ చేసిన ట్రిపుల్‌ సెంచరీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1960వ దశకంలో ఆస్ట్రేలియన్‌, విక్టోరియన్‌ జట్ల మీద ఆయన ఎంతగానో ప్రభావం చూపారు.

ఆటగాడిగానే కాకుండా ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ గానూ సేవలు అందించారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా తరఫున బాబ్‌ కుటుంబానికి, స్నేహితులు, సహచర ఆటగాళ్లకు మా ప్రగాఢ సానుభూతి’’ అని క్రికెట్‌ ఆ‍స్ట్రేలియా చైర్మన్‌ మైక్‌ బైర్డ్‌ ప్రకటన విడుదల చేశాడు. కాగా బాబ్‌ కౌపర్‌కు భార్య డేల్‌, కుమార్తెలు ఒలీవియా, సెరా ఉన్నారు.

చదవండి: క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 మంది రిటైర్డ్ ఔట్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Cricket Australia
Australian cricketer
melbourne
triple century
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

AUS vs BAN: ఆసీస్‌ గడ్డపై ‘మనోడి’ చరిత్ర

AUS vs BAN: ఆసీస్‌ గడ్డపై ‘మనోడి’ చరిత్ర

ఓ పెంపుడు కుక్క కథ..

ఓ పెంపుడు కుక్క కథ..

అయ్యో పాపం.. ఒక్క పరుగుతో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌

అయ్యో పాపం.. ఒక్క పరుగుతో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌

ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్‌

ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్‌

ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ కొడుకుకు ప్రతిష్టాత్మక అవార్డు

ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ కొడుకుకు ప్రతిష్టాత్మక అవార్డు

బాధితుడా? కృతజ్ఞత లేనివాడా?.. ఆ స్పీచ్‌ నిజంగానే అవసరమా?

బాధితుడా? కృతజ్ఞత లేనివాడా?.. ఆ స్పీచ్‌ నిజంగానే అవసరమా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.