Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకున్నాడు.. ఇరగదీశాడు..!

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 6, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ww.jpg

బిగ్‌బాష్‌ లీగ్‌ 2024-25లో ఇవాళ (జనవరి 6) సిడ్నీ థండర్‌, బ్రిస్బేన్‌ హీట్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన థండర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (36 బంతుల్లో 50; 7 ఫోర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. డేనియల్‌ క్రిస్టియన్‌ (Daniel Christian) (15 బంతుల్లో 23 నాటౌట్‌; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 

41 Year Old Dan Christian who was the coach before, now becomes part of the BBL - smashed a 92M six. 🤯pic.twitter.com/zXGCj3wwtS

— Mufaddal Vohra (@mufaddal_vohra) January 6, 2025

ఒలివర్‌ డేవిస్‌ 12 బంతుల్లో 10 (ఫోర్‌), మాథ్యూ గిల్కెస్‌ 10 బంతుల్లో 20 (4 ఫోర్లు), సామ్‌ బిల్లంగ్స్‌ 9 బంతుల్లో 10 (ఫోర్‌), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ 9 బంతుల్లో 11 (సిక్స్‌), హగ్‌ వెబ్జెన్‌ 8 బంతుల్లో 11 (సిక్స్‌), క్రిస్‌ గ్రీన్‌ 7 బంతుల్లో 5, టామ్‌ ఆండ్రూస్‌ 6 బంతుల్లో 13 (ఫోర్‌, సిక్స్‌), లోకీ ఫెర్గూసన్‌ 9 బంతుల్లో 7 నాటౌట్‌ (ఫోర్‌) పరుగులు చేశారు. బ్రిస్బేన్‌ హీట్‌ బౌలర్లలో స్పెన్సర్‌ జాన్సన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నెసర్‌, కున్నేమన్‌ తలో 2, జేవియర్‌ బార్ట్‌లెట్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

మ్యాక్స్‌ బ్రయాంట్‌ సునామీ ఇన్నింగ్స్‌
174 పరుగుల లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్‌ హీట్‌ సఫలమయ్యింది. ఆ జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌ బ్రాయాంట్‌ (35 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్‌ ఆడి బ్రిస్బేన్‌ను గెలిపించారు. మ్యాట్‌ రెన్షా (33 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్రిస్బేన్‌ను విజయతీరాలకు చేర్చాడు. బ్రిస్బేన్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ వుడ్‌ 2, కొలిన్‌ మున్రో 23, నాథన్‌ మెక్‌స్వీని 7, టామ్‌ అల్సోప్‌ 9, మైఖేల్‌ నెసర్‌ 7 (నాటౌట్‌) పరుగులు చేశారు. సిడ్నీ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. వెస్‌ అగర్‌, డేనియల్‌ క్రిస్టియన్‌, టామ్‌ ఆండ్రూస్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

41 years & still got it...pic.twitter.com/W7P5yoCTVq

— CricTracker (@Cricketracker) January 6, 2025

నాలుగో స్థానానికి ఎగబాకిన బ్రిస్బేన్‌
ఈ గెలుపుతో బ్రిస్బేన్‌ హీట్‌ (7 పాయింట్లు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టేబుల్‌లో సిడ్నీ సిక్సర్స్‌ (9 పాయింట్లు) టాప్‌లో ఉండగా.. సిడ్నీ థండర్‌ (8), హోబర్ట్‌ హరికేన్స్‌ (8) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పెర్త్‌ స్కార్చర్స్‌ (6), మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ (4), అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ (4), మెల్‌బోర్న్‌ స్టార్స్‌ (4) ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి.

మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన క్రిస్టియన్‌
సిడ్నీ థండర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ డేనియల్‌ క్రిస్టియన్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. క్రిస్టియన్‌ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో సత్తా చాటడు. తొలుత బ్యాట్‌తో ఇరగదీసిన క్రిస్టియన్‌ అనంతరం బంతితో రాణించాడు. బ్యాటింగ్‌లో 15 బంతులు ఎదుర్కొన్న క్రిస్టియన్‌ 2 భారీ సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం బౌలింగ్‌లో క్రిస్టియన్‌ కీలకమైన నాథన్‌ మెక్‌స్వీని వికెట్‌ తీశాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు వేసిన క్రిస్టియన్‌ 6.20 సగటున 25 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. 41 ఏళ్ల క్రిస్టియన్‌ సిడ్నీ థండర్‌కు చెందిన కీలక ఆటగాళ్లు గాయపడటంతో తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని పక్కన పెట్టి బరిలోకి దిగాడు. క్రిస్టియన్‌ చివరిగా 2022-23 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్‌ తరఫున బరిలో నిలిచాడు.

గాయాలపాలైన సామ్స్‌, బాన్‌క్రాఫ్ట్‌
థండర్‌ ఆటగాళ్లు డేనియల్‌ సామ్స్‌, కెమరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ కొద్ది రోజుల కిందట మైదానంలో తీవ్రంగా గాయపడ్డారు. క్యాచ్‌ పట్టబోయి సామ్స్‌, బాన్‌క్రాఫ్ట్‌ ఒకరినొకరు ప్రమాదకర రీతిలో గుద్దుకున్నాడు. సామ్స్‌ను మైదానం నుంచి స్ట్రెచర్‌పై మోసుకుపోయి ఆసుపత్రిలో అడ్మిట్‌ చేయగా.. బాన్‌క్రాఫ్ట్‌ ముక్కు పగిలి రక్త కారడంతో పాటు భుజానికి ఫ్రాక్చర్‌ అయ్యింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Daniel Christian
Big Bash League
australia
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆస్ట్రేలియాపై గెలుపు.. నాకౌట్‌కు యూఎస్‌ఏ

ఆస్ట్రేలియాపై గెలుపు.. నాకౌట్‌కు యూఎస్‌ఏ

ఎస్‌ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌ అయ్యాడు!

ఎస్‌ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌ అయ్యాడు!

మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్‌

మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్‌

మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

24 ఏళ్ల త‌ర్వాత బ‌రిలోకి.. ట‌ర్కీకి షాక్ ఇచ్చిన ఆసీస్‌!

24 ఏళ్ల త‌ర్వాత బ‌రిలోకి.. ట‌ర్కీకి షాక్ ఇచ్చిన ఆసీస్‌!

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.