Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు మను, సురుచి, ఇషా

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
manu.jpg

మొత్తం 8 మంది భారత షూటర్లు అర్హత 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు భారత్‌ నుంచి 8 మంది షూటర్లు అర్హత సాధించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 4 నుంచి 9 వరకు ఖతర్‌ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మన దేశం నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ పతక విజేత మనూ భాకర్‌తో పాటు మరో ఏడుగురు షూటర్లు బరిలోకి దిగనున్నారు. 12 వ్యక్తిగత ఒలింపిక్‌ ఈవెంట్‌లలో ఈ ఏడాది అత్యుత్తమ షూటర్‌ను నిర్ణయించేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. వీటిలో ఐదింట భారత షూటర్లు పోటీపడుతున్నారు. 

స్టార్‌ షూటర్‌ మనూ భాకర్‌ రెండు విభాగాల్లో వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ఎంపికైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌తో పాటు, 25 మీటర్ల విభాగంలో మను పోటీపడనుంది. ఇక ఈ సీజన్‌లో చక్కటి గురితో మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న టీనేజర్‌ సురుచి సింగ్‌ కూడా భారత్‌ నుంచి బరిలోకి దిగనుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో బ్యూనస్‌ ఎయిర్స్, లిమా, మ్యూనిక్‌లలో సురుచి పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల నింగ్బో ప్రపంచకప్‌లో స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ సైతం ఈ టోర్నీలో పాల్గొననుంది. 

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో ఇషా పోటీపడనుంది. ప్రపంచ మాజీ చాంపియన్‌ రుద్రాంక్ష్  పాటిల్, అర్జున్‌ బబూతా పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగానికి ఎంపికయ్యారు. రుద్రాంక్ష్  బ్యూనస్‌ ఎయిర్స్‌ వరల్డ్‌కప్‌లో స్వర్ణంతో మెరవగా... ఒలింపియన్‌ అర్జున్‌ లిమా ప్రపంచకప్‌లో రజతం గెలుచుకున్నాడు. ఆసియా చాంపియన్, ప్రపంచ రికార్డు హోల్డర్‌ సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా... మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో, ఒలింపియన్‌ విజయ్‌వీర్‌ సిద్ధూ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌లో పోటీ పడనున్నారు. సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా బ్యూనస్‌ ఎయిర్స్‌ ప్రపంచకప్‌లో స్వర్ణం గెలవగా... అదే పోటీలో విజయ్‌వీర్‌ పసిడి నెగ్గాడు.

మహిళల 25 మీటర్ల విభాగంలో సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌ బ్రార్‌ కూడా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అవకాశం దక్కించుకుంది. లిమా ప్రపంచకప్‌లో రజతం నెగ్గడం ద్వారా సిమ్రన్‌కు ఈ చాన్స్‌ దక్కింది. వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి వరుసగా 5000 యూరోలు (రూ. 5 లక్షల 20 వేలు), 4000 యూరోలు (రూ. 4 లక్షల 16 వేలు), 2000 యూరోలు (రూ. 2 లక్షల 8 వేలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. ఈ ఏడాది జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ వేర్వేరు విభాగాల్లో కలిసి భారత షూటర్లు 22 పతకాలు సాధించింది. అందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
International Shooting Sport Federation
world cup final
India
shooters
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.