Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Sakshi Special
  3. డిగ్రీ.. పదో తరగతి
ADVERTISEMENT 

డిగ్రీ.. పదో తరగతి

Sakshi Special Sakshi User Sakshi Sakshi Time May 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ssc.jpg

దరఖాస్తుదారుల్లో వీళ్లే ఎక్కువ పీఎం ఇంటర్న్‌షిప్‌ 

రెండో రౌండ్‌లో పరిస్థితి

4 రాష్ట్రాల నుంచే 42 శాతం దరఖాస్తులు

మొత్తం 1.19 లక్షల అవకాశాలు

ఆఫర్‌ చేస్తున్న 327 కంపెనీలు

పీఎం ఇంటర్న్‌షిప్‌.. దేశంలోని టాప్‌ – 500 కంపెనీల్లో యువత శిక్షణ పొంది, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు సాధించేందుకు అద్భుతమైన వేదిక. మొదటి రౌండ్‌ మొత్తం పూర్తయిపోయి, రెండో రౌండ్‌ కూడా సగం పూర్తయింది. ఈ దశలో టాప్‌ – 4 రాష్ట్రాలలోనే సుమారు 50 వేల అవకాశాలు ఉన్నాయి. మొత్తం అవకాశాల్లో ఇవి దాదాపు 42 శాతం. అంటే.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినవీ, పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఎక్కువ అవకాశాలు అందిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణల్లో గ్రాడ్యుయేషన్‌ అభ్యర్థుల తరవాత అత్యధిక ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసింది పది పాసైనవారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గ్రాడ్యుయేషన్‌ తరవాత.. ఐటీఐ వాళ్లు ఎక్కువగా ఉన్నారు.  దేశంలోని 21–24 ఏళ్ల మధ్య ఉండే యువత ఉద్యోగ సాధనకు అవసరమయ్యే పూర్తిస్థాయి నైపుణ్యాలను.. అత్యుత్తమ కంపెనీల ద్వారా యువతకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం (పీఎంఐఎస్‌) తీసుకొచి్చంది. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి చదువులు పూర్తిచేసిన విద్యార్థులకు శిక్షణతోపాటు, నెలకు రూ.5,000 చొప్పున స్టైపెండ్‌ కూడా ఈ పథకం ద్వారా అందిస్తారు. దీంతోపాటు కంపెనీలో చేరేముందు వన్‌టైమ్‌ గ్రాంట్‌ కింద రూ.6,000 కూడా చెల్లిస్తారు. ఏడాదిలో 6 నెలలు క్లాస్‌ రూమ్‌లో, 6 నెలలు క్షేత్రస్థాయిలో శిక్షణ ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారు దీనికి అర్హులు.

మొదటి రౌండ్‌లో.. 
ఈ ఏడాది మార్చిలో రాజ్యసభలో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ చెప్పిన సమాధానం ప్రకారం.. 2024 అక్టోబర్‌లో ప్రారంభమైన పీఎంఐఎస్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ మొదటి రౌండ్‌లో... చివరికి 28,141 మంది ఆఫర్లు తీసుకుని ఆయా సంస్థల్లో శిక్షణకు హాజరయ్యారు. ఇందులో ఏపీ నుంచి 1,970, తెలంగాణ నుంచి 1,380 మంది ఉన్నారు. యూపీ నుంచి అత్యధికంగా 4,656 మంది, బిహార్‌ నుంచి 2,418 మంది స్వీకరించారు. మొదటి రౌండ్‌లో మొత్తం 1.27 లక్షల ఆఫర్లు రాగా.. వాటికోసం 6.21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంపెనీలు 82,077 మందిని ఎంపిక చేసుకుని ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ చేశాయి.  

గ్రాడ్యుయేషన్‌... ఐటీఐ 
ఈసారి ఇంటర్న్‌షిప్‌లకు వచి్చన దరఖాస్తుల్లో ప్రధాన రాష్ట్రాల్లో గ్రాడ్యుయేషన్‌ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఆ తరవాత పదో తరగతి అభ్యర్థులు ముందంజలో ఉండటం విశేషం. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలలో ఇదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గ్రాడ్యుయేషన్‌ తరవాత ఐటీఐ వాళ్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మే 20 నాటికి 4,710 దరఖాస్తులు వస్తే.. అందులో గ్రాడ్యుయేషన్‌ చేసినవాళ్లు 1,717 మంది కాగా, ఐటీఐ అభ్యర్థులు 1,040 మంది. అలాగే తెలంగాణలో 5,252 రాగా.. గ్రాడ్యుయేషన్‌ అభ్యర్థులు దాదాపు సగం అంటే.. 2,611 మంది ఉండటం విశేషం.  

రెండో రౌండ్‌లో.. 
రెండో రౌండ్‌లో కంపెనీల సంఖ్య పెరిగింది. మొదటి దశలో 280 వస్తే ఇప్పుడు 327 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇవి సుమారు 1.19 లక్షల ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు అందిస్తున్నాయి. దేశంలోని 36 రాష్ట్రాల్లోని 735 జిల్లాల్లో యువతకు.. 25 రంగాల్లో నైపుణ్యం పొందే అవకాశం లభించింది. ఈసారి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని యువత పోటీపడ్డారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక.. ఈ నాలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అత్యధిక ఇంటర్న్‌షిప్‌లు ఆఫర్‌ చేస్తున్న ప్రధాన రంగాలు.. చమురు, సహజవాయువు, ఇంధనం; పర్యాటకం, ఆతిథ్యం; బ్యాంకింగ్, ఆర్థిక సేవలు.. అత్యధిక ఇంటర్న్‌షిప్‌లు అందిస్తున్న టాప్‌ –3 రంగాలు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Graduation
internship
Applications
ssc
companies
Telangana
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.