Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. రక్తపాతం సృష్టిస్తున్నారు
ADVERTISEMENT 

రక్తపాతం సృష్టిస్తున్నారు

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 11, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
YS-Avinash-Reddy.jpg

పులివెందులలో టీడీపీ వేషాలు, అరాచకాలను ప్రజలు గమనించాలి  

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి  

పులివెందుల: ప్రశాంతంగా ఉన్న పులివెందులలో రక్తపాతం సృష్టిస్తున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల్పుల రాముపై హత్యాయత్నం చేసి అతడితోపాటు మరో 50 మందిపై రివర్స్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారంటే పోలీసువ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తే భవిష్యత్‌ అరాచకమేనని చెప్పారు.

పులివెందుల బ్రాండ్, ఖ్యాతిని మండల ప్రజలు నిలబెట్టాలని కోరారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వాస్తవాలను గ్రహించాలన్నారు. పదిరోజులుగా పులివెందులలో జరుగుతున్న సంఘటనలను పరిశీలించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం విచ్చలవిడిగా అధికార దురి్వనియోగానికి పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 5న ఇండిపెండెంట్‌ అభ్యర్థి సురేష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు అమరేశ్వరెడ్డిలతోపాటు 30 మందిపై రాడ్లు, రాళ్లతో దాడిచేశారన్నారు. మరుసటిరోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాములపై హత్యాయత్నం చేశారని తెలిపారు. దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న కూటమి నాయకులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్ట్‌ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ధనుంజయ అనే వ్యక్తిపై రాము, హేమాద్రి దాడిచేసి దుర్భాషలాడినట్లు కట్టుకథలు సృష్టించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి 307 సెక్షన్‌ యాక్ట్‌ పెట్టారని చెప్పారు. పులివెందుల మండలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయ­కులు, కార్యకర్తలందరిపై కేసులు నమోదు చేసి, పార్టీని బలహీనపర్చడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఊరి పక్కనే ఉన్న పోలింగ్‌ కేంద్రంలో కాకుండా నాలుగు కిలోమీటర్లు వెళ్లి నల్లపురెడ్డిపల్లెలో ఓట్లు వేయాల్సిన పరిస్థితి కల్పించారని నల్లగొండువారిపల్లి ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. టీడీపీ నాయకుల చర్యలతో పోలింగ్‌ శాతం తగ్గిపోయే అవకాశం ఉందన్నారు.  

వైఎస్సార్‌సీపీని గెలిపించాలి  
ఈ ప్రాంతం ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోను, తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోను అభివృద్ధి చెందిందని చెప్పారు. వైఎస్సార్‌ తెచ్చిన కృష్ణాజలాలను జగనన్న పొలాల్లోకి పారించారని తెలిపారు. ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదని విమర్శించారు. గ్రామాల్లో అల్లర్లు, అలజడులు సృష్టించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారికి పోలీసులు సహకరిస్తున్నారని చెప్పారు.


టీడీపీ నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపులకు ఏమాత్రం బెదరకుండా వైఎస్సార్‌సీపీ గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు కృషిచేస్తున్నారని తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అవసరమైతే మహిళలు ఏజెంట్లుగా కూర్చొని ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రజలు టీడీపీ నాయకుల దాడులను సహించరని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
ys avinash reddy
YSRCP
Pulivendula
ZPTC
byelections
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.