Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు
ADVERTISEMENT 

ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు

Politics Sakshi User Sakshi Sakshi Time Mar 16, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Vijays-TVK.jpg

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ద్రవిడ పాలిటిక్స్‌లో ఇప్పుడు ‘దళపతి’ విజయ్ రూపంలో ఒక పెను తుపాను ముంచుకొస్తోంది. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘పారావీల్’ తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాలు రాజకీయ విశ్లేషకులనే కాదు, అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లోనూ రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) రాష్ట్రంలో మూడో ప్రధాన శక్తిగా అవతరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

నిర్ణయాత్మక శక్తిగా 13.6 శాతం ఓట్లు
పారావీల్ సీఈఓ కిరణ్ కొండేటి విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. విజయ్ పార్టీ ఏకంగా 13.6 శాతం ఓట్ల వాటాను కొల్లగొట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో సుమారు 70.2 లక్షల మంది ఓటర్ల నాడిని సంగ్రహించిన ఈ సర్వేలో తమిళనాట ముక్కోణపు పోటీ అనివార్యమని స్పష్టం అయ్యింది. అధికార డీఎంకే 41.5 శాతం, ఏఐఏడీఎంకే 36.2 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ, టీవీకే సాధిస్తున్న ఈ ఓట్ల శాతం షాకిచ్చేలా ఉంది. ఈ సర్వే ‍ప్రకారం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటును శాసించే ‘కింగ్ మేకర్’ స్థాయికి విజయ్‌ చేరుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నవతరం ఓటర్లంతా..
ఈ సర్వేలో వెల్లడైన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. యువత, తొలిసారి ఓటు వేస్తున్న నవతరం ఓటర్లంతా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. కేవలం సినిమా అభిమానులే కాకుండా, సాంప్రదాయ రాజకీయాలపై విరక్తి చెందిన విద్యావంతులు, మార్పును కోరుకుంటున్న యువత టీవీకేను తమ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని తేలింది. ముఖ్యంగా చెన్నై లాంటి పట్టణ ప్రాంతాల్లో విజయ్ మేనియా ఏ స్థాయిలో ఉందంటే, కొన్ని సెగ్మెంట్లలో ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీని వెనక్కి నెట్టి టీవీకే రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయమని తెలుస్తోంది.

పక్కా వ్యూహం.. క్షేత్రస్థాయి విశ్లేషణ
కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో కుల సమీకరణలు, ప్రాంతీయ సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకతను  లోతుగా విశ్లేషించారు. దీనిలో దక్షిణాది జిల్లాల నుంచి పశ్చిమ తమిళనాడు వరకు విజయ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తేలింది. సినిమా గ్లామర్‌ను పొలిటికల్ పవర్‌గా మార్చడంలో టీవీకే కేడర్ సక్సెస్ అవుతోందని ఈ సర్వే చెబుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల ప్రాధాన్యతలు మారుతుండటం, స్వింగ్ నియోజకవర్గాల్లో టీవీకే పుంజుకోవడం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

వార్ రూమ్ టెక్నాలజీతో..
ఎన్నికల కురుక్షేత్రంలో విజయ్ సరికొత్త సాంకేతికతను జోడించబోతున్నారు. పారావీల్ సంస్థ పరిచయం చేస్తున్న ‘వన్ క్యాండిడేట్ - వన్ వార్ రూమ్’ కాన్సెప్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతి అభ్యర్థికి క్షేత్రస్థాయి డేటా విశ్లేషణను అందిస్తూ, గెలుపు గుర్రాలను సిద్ధం చేసే ఈ వ్యూహం పాత తరం రాజకీయ నాయకులకు సవాల్ విసురుతోంది. సంప్రదాయ ప్రచార శైలిని పక్కన పెట్టి, డేటా ఆధారిత వ్యూహాలతో విజయ్ అడుగులు వేస్తుండటం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా నిలిచింది.

ద్రవిడ గడ్డపై సరికొత్త చరిత్ర?
కరుణానిధి, జయలలిత తదితర రాజకీయ దిగ్గజాల నిష్క్రమణ తర్వాత తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసే సత్తా విజయ్‌లో ఉందని ఈ సర్వే ఫలితాలు నిరూపిస్తున్నాయి. 13.6 శాతం ఓట్ల వాటా అంటే అది కేవలం సంఖ్య కాదు, తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయగల ఒక బలమైన శక్తి అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే ద్రవిడ కోటలో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
TVK Vijay
Political analysts
Five State Elections 2026
tamilnadu assembly election
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

సీఎం విజయ్ పుట్టినరోజు.. ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

సీఎం విజయ్ పుట్టినరోజు.. ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

‘జననాయగన్‌’ కోసం ఢిల్లీకి సీఎం విజయ్‌!

‘జననాయగన్‌’ కోసం ఢిల్లీకి సీఎం విజయ్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.