Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. బలైపొవాలంటే.. బాబే 'కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌'!
ADVERTISEMENT 

బలైపొవాలంటే.. బాబే 'కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌'!

Politics Sakshi User Sakshi Sakshi Time Apr 9, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Babu-Choudary.jpg

చంద్రబాబా.. మజాకా

హనుమంతరాయ చౌదరి రాజకీయ ప్రస్థానానికి ఫుల్‌స్టాప్‌

అంతా నాదే అనుకున్న వైకుంఠంకు చరమగీతం

బాబు రాజకీయ క్రీడలో జితేందర్‌గౌడ్‌ పరాజయం

బీసీ నేత నిమ్మలకు నమ్మక ద్రోహం  

చంద్రబాబు రాజకీయ క్రీడలో బలైన నేతలు ఎందరో ఉన్నారు. ఆయన చరిత్ర చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం.. జెండా మోసిన వారిని కాదని డబ్బున్న వారికి టికెట్లు ఇవ్వడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ప్రతి ఎన్నికల సమయంలో తన స్వార్థ బుద్ధిని చాటుకున్న ఆయన.. ఈ ఎన్నికల్లోనూ తన నైజాన్ని చాటారు. జిల్లాకు చెందిన సీనియర్లకు శఠగోపం పెట్టారు. గత ఐదేళ్లూ వాడుకుని అర్ధంతరంగా తమను బలిపీఠం ఎక్కించడంతో వారంతా నైరాశ్యంలో మునిగిపోయారు. చివరి నిమిషం వరకూ టికెట్‌ ఆశచూపి ఆఖరున రూ.కోట్లకు పడగలెత్తిన వారికి పెద్దపీట వేయడంతో నాయకులు ఒక్కసారిగా కుదేలై పోయారు. బాబును నమ్ముకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని వాపోతున్నారు.

ఏళ్ల తరబడి పనిచేసినా ఫలితమేది? 

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి రెండున్నర దశాబ్దాలుగా పార్టీకి కష్టపడి పనిచేశారు. గడిచిన రెండున్నరేళ్లుగా ఆయన కుమారుడు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేసినా ఆయన్ను దూరం పెట్టి కాంట్రాక్టర్‌ అమిలినేనికి సీటు ఇవ్వడంతో ఉన్నం రాజకీయ నిరుద్యోగి అయ్యారు. మరో నేత ఉమామహేశ్వరనాయుడుకూ మొండి చేయి చూపడంతో ఆయన చంద్రబాబును నమ్ముకోవడం సరికాదని, ఇక్కడ భవిష్యత్తు లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

జితేందర్‌ గౌడ్‌కూ మొండిచేయి

గుంతకల్లు నియోజకవర్గంలో గుమ్మనూరు జయరామ్‌కు టికెట్‌ ఇవ్వడం జిల్లా మొత్తం బాబు నైజాన్ని చాటింది. మొన్నటివరకూ తిట్టిపోసిన గుమ్మనూరుకు టికెట్‌ ఇచ్చారు. దీంతో బాబు ఎంతటి మోసానికైనా సమర్థుడే అంటూ మాజీ ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు రాజకీయ క్రీడలో జితేందర్‌గౌడ్‌ పరాజయం పాలయ్యారని నియోజకవర్గం ప్రజలు భావిస్తున్నారు. గుమ్మనూరు చేరిక జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపిస్తోందని టీడీపీ కేడర్‌ భావిస్తోంది.

వైకుంఠం శకం ముగిసినట్టే..

రెండు దశాబ్దాలుగా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ నేత ప్రభాకర్‌ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని భావిస్తున్నారు. పార్టీ అంతా నాదే అని భావించే ఆయనకు మొండిచేయి చూపి దగ్గుబాటి ప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చారు. ప్రసాద్‌ రాక వెనుక భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు చర్చ జరుగుతోంది. దీంతో ప్రభాకర్‌ చౌదరి రాజకీయ శకం    ముగిసినట్టేనని, చేసేదేమీ లేదని ఆయన వర్గం భావిస్తోంది.

నిమ్మలకు నమ్మక ద్రోహం..

ఓట్లకోసం కులం కావాలి.. డబ్బు కోసం కొత్త నేతలు కావాలి.. ఇదీ చంద్రబాబు తీరు. బీసీ వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్ప పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో రెండు దఫాలు నిమ్మల ఎంపీగా చేశారు. అలాంటి వ్యక్తికి ఈ సారికి టికెట్‌ ఇవ్వలేదు. దీంతో చేనేత వర్గానికి చెందిన ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇక రాజకీయ శకం ముగిసినట్టేనని తెలుస్తోంది. చంద్రబాబుపై ఆయన కత్తులు నూరుతున్నారు.

త్రుటిలో తప్పించుకున్న ఆ ఇద్దరు..

మరో ఇద్దరు సీనియర్‌ నేతలు బాబు వెన్నుపోటునుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ఇద్దరే బీకే పార్థసార«థి, పల్లె రఘునాథరెడ్డి. చివరి వరకూ ఇద్దరికీ టికెట్లు లేవు. చివరన ఇక తప్పని స్థితిలో బీకే పార్థసారథికి హిందూపురం ఎంపీ సీటు ఇవ్వగా.. పల్లె రఘునాథరెడ్డి కోడలికి పుట్టపర్తి టికెట్‌ ఇచ్చారు. అయితే, ఈ ఇద్దరూ చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా చంద్రబాబు వలలో నుంచి బయటపడ్డారని పార్టీలోని నాయకులే అంటుండడం గమనార్హం.

ఇవి చదవండి: మళ్లీ పలికిన బాబు చిలక

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
AP Politics
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Sri Satya Sai Assembly Constituencies
AP Assembly Elections 2024
AP Elections 2024
Janasena
TDP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.