సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో టీడీపీ కూటమి అరాచకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని లింగాలలో వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. డీఐజీ కోయ ప్రవీన్ ఆదేశాలతోనే వైఎస్సార్సీపీ నేతల ముందస్తు అరెస్టులు జరుగుతున్నట్టు సమాచారం. వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్‌గా బైండోవర్ కేసులతో పాటు ఇతర కేసులను నమోదు చేస్తున్నారు.
ఈ నెల 5న (గురువారం) జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఎన్నికల్లోనూ పోలింగ్ బూత్‌లను కబ్జా చేసేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. పోలింగ్ బూత్లకి వైఎస్సార్సీపీ ఏజంట్లు రాకుండా ఎన్నికలు ఏకపక్షం చేసుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. తాజాగా జరిగిన మున్సిపాల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి అడ్డదారులు తొక్కిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు







