Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ‘ఈ అక్ర‌మాల‌కు ఎస్‌ఈసీ సైతం బాధ్యత వ‌హించాల్సిందే’
ADVERTISEMENT

‘ఈ అక్ర‌మాల‌కు ఎస్‌ఈసీ సైతం బాధ్యత వ‌హించాల్సిందే’

Politics Sakshi User Sakshi Sakshi Time Nov 5, 2026 07:45 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
YSRCP-MLC-Lella-Appireddy-Slams-SEC.jpg

విజ‌య‌వాడ‌:  ఎస్‌ఈసీ పక్షపాత వైఖరి వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఓడిపోతోందని, కట్టలు కట్టలుగా ఫిర్యాదులు, ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు ఆధారాలు సమర్పించినా ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమ‌ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో అధికార కూట‌మి పార్టీల అక్ర‌మాల‌ను ఆధారాల‌తో స‌హా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కి వివ‌రించిన అనంత‌రం అక్క‌డే పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాల్లో టీడీపీకి చెందిన చోటామోటా నాయకులు యథేచ్ఛగా తిరుగుతూ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నార‌ని, అందుకే కౌంటింగ్‌ కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను భద్రపరచాలని మరోసారి ఎస్‌ఈసీని కోరిన‌ట్టు చెప్పారు. ఆ ఫుటేజ్‌ ఆధారంగా అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులను, అధికారులను న్యాయస్థానాల్లో బాధ్యులుగా నిలబెడతామ‌ని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. ఆయ‌న వెంట  మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు నారాయ‌ణ‌మూర్తి,  పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిల‌తోపాటు పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.

ప‌రిషత్ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జాస్వామ్యం ఖూనీ
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గత మున్సిపల్‌ ఎన్నికల తరహాలోనే కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం, హౌస్‌ అరెస్టులు చేయడం, పార్టీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు పంపించడం వంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులను ఉపయోగించుకుని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల కౌంటింగ్‌లో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచిన చోట రీకౌంటింగ్‌ పేరుతో ఫలితాలను తారుమారు చేసి టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించిన దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.ఎస్‌ఈసీని కలిసి ఫిర్యాదులు చేసినా, ఆధారాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలైనా ప్రశాంతంగా నిర్వహించాలని కోరినా పట్టించుకోలేదు.

ఈ అక్ర‌మాల‌పై ఎస్ఈసీ చ‌ర్య‌లు తీసుకోవాలి
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల నిర్వహణలో వాటిని తుంగలో తొక్కారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వీడియో షూటింగ్‌, వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాలని, అభ్యర్థులకు రక్షణ కల్పించాలని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు చేయలేదు. రాష్ట్రంలో మొత్తం 31,500 పోలింగ్‌ బూత్‌లు ఉంటే కేవలం 16 వేల బూత్‌లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మిగిలిన 15 వేల పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం వీడియో షూటింగ్‌ కూడా సక్రమంగా జరగలేదు. 

కుప్పంలో సీసీ కెమెరాలు లేకుండా ఏజెంట్లను బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడిన పరిస్థితులు కనిపించాయి. పులివెందులలో పెట్రోల్‌ బాంబులతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, ఏజెంట్లను పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడం, కీలక నేతలను హౌస్‌ అరెస్టులు చేయడం కొనసాగింది. శిల్పా రవి, చక్రపాణిరెడ్డి, కోడూరు శ్రీనివాసులు, మేరుగ నాగార్జున, శైలజానాథ్‌ వంటి వైఎస్సార్‌సీపీ నాయకులను నిర్బంధించారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్యే శంకర్‌ వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు దిగుతుంటే, టెక్కలిలో అచ్చెన్నాయుడు ఏజెంట్లకు ఫోన్లు చేసి పిలిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. 

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలతో పాటు పల్నాడు జిల్లాలోనూ ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్నారు. పల్నాడు జిల్లాలో ఉదయం 10.30 గంటలకే పోలింగ్‌ అయిపోయిందంటూ ఓటర్లను వెనక్కి పంపిన ఘటనలు జరిగాయి. పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఉర‌వ‌కొండ‌లోని కూడేరు మండలంలో సీఐ ద‌గ్గరుండి దాడులు చేయించాడు. పోలీసు, రెవెన్యూ అధికారుల అండతో జరుగుతున్న ఈ అక్రమాలన్నింటికీ బాధ్యులు ఎవరో తేల్చాల్సిందే.

క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా ఫిర్యాదులు, ఆధారాలు స‌మ‌ర్పించాం
నిన్నటి కౌంటింగ్‌లోనూ వైఎస్సార్‌సీపీ గెలిచిన చైర్‌పర్సన్‌, కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థుల విజయాలను ప్రకటించకుండా టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో ఫలితాలను తారుమారు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో టీడీపీకి చెందిన చోటామోటా నాయకులు యథేచ్ఛగా తిరుగుతూ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారు. అందుకే కౌంటింగ్‌ కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను భద్రపరచాలని మరోసారి ఎస్‌ఈసీని కోరాం. ఆ ఫుటేజ్‌ ఆధారంగా అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులను, అధికారులను న్యాయస్థానాల్లో బాధ్యులుగా నిలబెడతాం. 

ఇప్పటివరకు కట్టలు కట్టలుగా ఫిర్యాదులు, ఆధారాలు సమర్పించినా ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఎస్‌ఈసీ పక్షపాత వైఖరి వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఓడిపోతోంది. ఎన్నికల్లో ప్రజలు ఓడిపోతున్నారు, ప్రజాస్వామ్యం ఓడిపోతోంది, అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్న కూటమి నేతలకు మాత్రం అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇకపై అక్రమ నిర్బంధాలకు, రిగ్గింగ్‌లకు, కౌంటింగ్‌ అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎస్‌ఈసీని కూడా న్యాయపోరాటంలో బాధ్యురాలిగా నిలబెడతాం. తప్పు చేసిన పోలీసు, రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులందరిపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఇదీ చదవండి: మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
lella appireddy
ap local body elections 2026
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

‘కూటమి అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదు’

‘కూటమి అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదు’

‘కూటమికి నేరుగా గెలిచే దమ్ములేదు’

‘కూటమికి నేరుగా గెలిచే దమ్ములేదు’

బ్రతికున్నా మమ్మల్ని చంపేశారు! పులివెందుల ప్రజలు సంచలన కామెంట్స్

బ్రతికున్నా మమ్మల్ని చంపేశారు! పులివెందుల ప్రజలు సంచలన కామెంట్స్

తుఫాను బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్

తుఫాను బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్

పచ్చమూకల దాడి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మునిరత్నం పరిస్థితి విషమం!

పచ్చమూకల దాడి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మునిరత్నం పరిస్థితి విషమం!

మరిన్ని వార్తలు

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

‘కూటమి అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదు’

‘కూటమి అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదు’

‘కూటమికి నేరుగా గెలిచే దమ్ములేదు’

‘కూటమికి నేరుగా గెలిచే దమ్ములేదు’

అప్పట్లో ప్రతిపక్షానికి ఒక్కటే.. ఇప్పుడు 16..!

అప్పట్లో ప్రతిపక్షానికి ఒక్కటే.. ఇప్పుడు 16..!

ఖాకీ చొక్కా తీసేసి రా చూసుకుందాం.. టీడీపీ ఎమ్మెల్యే..

ఖాకీ చొక్కా తీసేసి రా చూసుకుందాం.. టీడీపీ ఎమ్మెల్యే..

వారెవ్వా.. 104.27 శాతం పోలింగ్‌

వారెవ్వా.. 104.27 శాతం పోలింగ్‌

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft