Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. మేము టీఎంసీని వీడలేదు: 20 మంది రెబల్‌ ఎంపీలు
ADVERTISEMENT 

మేము టీఎంసీని వీడలేదు: 20 మంది రెబల్‌ ఎంపీలు

Politics Sakshi User Sakshi Sakshi Time Jun 16, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Rebel-Trinamool-Congress-MPs-on-control-of-the-party-symbol.jpg

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్‌ ఎంపీలు సోమవారం పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు పోరాడతామని ప్రకటించారు. తాము టీఎంసీని వీడలేదని, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 20 మంది అసమ్మతి ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనమవుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం మాత్రం మాట మార్చారు.

అరూప్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. “మేము టీఎంసీని వీడలేదు. టీఎంసీలోనే ఉన్నాం. పార్టీని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎందుకు దెబ్బతిన్నదన్న చర్చ జరగడం లేదు. పార్టీ గుర్తు కోసం మేము పోరాడతాం. మా వద్ద 20 మంది సభ్యులు ఉన్నారు. గుర్తు కోసం ఎందుకు పోరాడకూడదు?” అని తెలిపారు.

రాజకీయ, న్యాయ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలు ఇచ్చారు. ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలికిందని చక్రవర్తి అన్నారు. “కొత్త ఆట మొదలైంది. ఖేలా హోబే” అని ఆయన అన్నారు. ఈ పరిణామం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 20 మంది రెబల్‌ టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తాము ఎన్‌సీపీఐలో విలీనమవుతున్నట్టు ప్రకటించినప్పటికీ అరూప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ సమావేశంలో ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు కోరారు. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ నుంచి శాసనసభ్యుల స్థాయిలో తమ విభజనను అధికారికంగా ప్రకటించినట్టైంది.

కోర్టును ఆశ్రయిస్తాం 
ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన సుదీప్ బంద్యోపాధ్యాయ్ తిరుగుబాటు వర్గంలో చేరారు. తమదే నిజమైన టీఎంసీ అని నిరూపించేందుకు, పార్టీ జంట పువ్వుల ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. ఈ తిరుగుబాటుపై టీఎంసీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. పార్టీ వాదన ప్రకారం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఈ చర్య చెల్లదు. రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీ ముందుగా విలీనం కావాలి లేదా విడిపోవాలి. ఆ తర్వాతే శాసనసభ్యులు అనర్హత నిబంధనల నుంచి మినహాయింపు కోరగలరని చెప్పారు.

ఎక్స్‌లో చేసిన పోస్టులో ఘోష్ స్పందిస్తూ.. “2/3 వంతుల మెజారిటీ, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంపై భారీ స్థాయిలో తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. పదో షెడ్యూల్, సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చాయి. పార్లమెంట్ వెలుపల ఉన్న రాజకీయ పార్టీనే ముందుగా విడిపోవాలి లేదా విలీనం కావాలి. పార్లమెంట్‌లో కూర్చున్న పార్టీ ప్రతినిధులు కాదు. ఈ షరతు నెరవేరిన తర్వాతే 2/3 మంది విడిపోయినా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు” అని తెలిపారు.

సీనియర్ టీఎంసీ నేత సౌగత రాయ్ కూడా తిరుగుబాటు నేతలపై విమర్శలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు వారు ద్రోహం చేశారని ఆరోపించారు. “ఇప్పుడు మమతా బెనర్జీ అధ్యక్షురాలిగా ఉన్న అఖిల భారత తృణమూల్ కాంగ్రెసే అసలైన పార్టీ అని స్పష్టమైంది. ఎన్నికల గుర్తు రెండు పువ్వులు. భారతీయ జనతా పార్టీని ఓడించడమే దాని లక్ష్యం” అని ఆయన చెప్పారు.

“టీఎంసీ గుర్తుపై ఎన్నికైన 20 మంది ఎంపీలు తమ ఓటర్లకు ద్రోహం చేస్తూ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పెద్దగా గుర్తింపు లేని పార్టీలో చేరారు. చట్టవిరుద్ధంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10(4) నిబంధనల నుంచి తప్పించుకోవడానికే వారు ఇలా చేశారు. ప్రజలు ఈ వార్తను గమనిస్తున్నారు” అని రాయ్ అన్నారు.

మమతా బెనర్జీపైన కూడా చక్రవర్తి నేరుగా విమర్శలు చేశారు. విభజన తర్వాత ఆమె ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. “మమతా బెనర్జీ భయపడుతున్నారు. పార్టీ సమావేశం కూడా నిర్వహించలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు సొంత నియోజకవర్గంలో కూడా సమావేశం నిర్వహించలేకపోయారు” అని ఆయన చెప్పారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
tmc
mamata benarjee
West Bengal
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

15 ఏళ్ల జాతీయస్థాయి క్రీడాకారిణి అదృశ్యం

15 ఏళ్ల జాతీయస్థాయి క్రీడాకారిణి అదృశ్యం

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు!

టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు!

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

రెబెల్స్‌ చీఫ్‌గా అరూప్‌ 

రెబెల్స్‌ చీఫ్‌గా అరూప్‌ 

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.