Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ‘మీరు జెండాలు జత కడితే.. జగన్ జనంతో జతకట్టారు’
ADVERTISEMENT 

‘మీరు జెండాలు జత కడితే.. జగన్ జనంతో జతకట్టారు’

Politics Sakshi User Sakshi Sakshi Time Dec 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Rachamallu-Sivaprasad-Reddy.jpg

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : దేశంలో ఒకే ఒక్కడు వైఎస్ జగన్ అని.. తన జెండా, తన ఎజెండాతో మాత్రమే ఎన్నికలకు వెళ్లిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని  ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గుర్తింపు పొందిన 6 జాతీయ పార్టీలు కూడా ఏదో ఒక సందర్భంలో పొత్తులు పెట్టుకున్నాయని.. ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీ మరో జెండాతో జతకడుతుందో అప్పుడే సొంత బలం లేదని తేలిపోతుంది. వారి పాలనలో ఆలోచనలు కూడా అరువు తెచ్చుకున్నట్లు ఉంటాయి’’ అని రాచమల్లు వ్యాఖ్యానించారు.

‘‘మన రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది.. ఈ మూడు పార్టీలకు విడిగా వైఎస్సార్సీపీనీ ఓడించే బలం ఉందా..?. వారికి సొంతగా గెలిచే బలం లేదు కాబట్టే మూడు పార్టీలు జత కట్టాయి. మీరు జెండాలు జత కడితే.. జగన్ జనంతో జతకట్టారు. మీరు మూడు పార్టీలు కలిసి ప్రజలకు ఏమైనా మేలు చేశారా...?. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. కేవలం చంద్రబాబు ఇచే ప్యాకేజీతో నోరు మూసుకున్నాడు. నువ్వు జగన్ చేతిలో రేఖలు తుడుపుతావా..?. ఓ పక్క టీడీపీ, మరో పక్క బీజేపీ లేకపోతే నీ మనుగడే లేదు. నువ్వు జగన్‌ను ఏమి చేయగలవు..?’’ అంటూ రాచమల్లు నిలదీశారు.

‘‘ఈ దేశంలో చంద్రబాబు అంత అవకాశవాది ఎవరూ లేరు. ఆయన జత కట్టని పార్టీ లేదు.. ఆయనకు కేవలం అధికార దాహం మాత్రమే ఉంది. బీజేపీ పెద్ద ముత్తయిదువు పాత్ర.. ఏమీ చేయలేదు కానీ పేరుకు ఉంటుంది. 2 శాతం, 30 శాతం ఓట్లు ఉన్న వీళ్లు 40 శాతం ఓట్లున్న జగన్‌ను ఏమీ చేయలేరు. అందుకే జగన్ ఓడిపోయాడు కానీ.. చావలేదు అని వాళ్లే అంటున్నారు. వీళ్లెవరికీ జగన్‌ను ఢీకొట్టే పరిస్థితి లేదని వాళ్లకే తెలుసు. మీ మేనిఫెస్టోను ఆనాడు బీజేపీ ముట్టుకోలేదు. కానీ జగన్ మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నారు’’ అని రాచమల్లు గుర్తు చేశారు.

‘వీళ్ళంతా రాజకీయంగా అవిటి వాళ్ళు.. ఒకరి ఊతం లేనితే మరొకరు లేరు. ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని సంక్షేమం ఒక్క వైఎస్ జగన్ మాత్రమే చేశాడు. జగన్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఒక్కడు కాబట్టే.. సొంత ఆలోచనతో అనేక సంస్కరణలు చేపట్టాడు. జగన్ పొత్తుకు పోలేదంటే నైతిక విలువలు ఉన్నాయని అర్థం.. తన పాలనని నమ్ముకున్నాడు. ఓటమిని ఆహ్వానించాడు. కష్టాలను ఆహ్వానించాడు కానీ తలొగ్గలేదు. అలాంటి విలువలు కలిగిన జగన్ మా నాయకుడు అయినందుకు గర్వపడుతున్నా. నా శ్వాస ఆగిపోయేంత వరకు జగన్ తోనే నా ప్రయాణం

..2029 వస్తుందంటే మీ దడ పుడుతోంది..జనంలో జనం బలమెంతో మీకు తెలుసు. అందుకే మీరు గెలిచినా మీకు ఆదరణ లేదు.. జగన్ ఒడినా ఆదరణ ఉంది. జిల్లాల విభజనలో పరిపాలన సౌలభ్యం, ప్రజల అభిప్రాయం అవసరం. తమ ఓట్లకు, సీట్లకు అనుకూలంగా జిల్లాల విభజన చేయడం సరికాదు. ప్రభుత్వాలు మారగానే జిల్లాలు మారిస్తే ఇక హేతుబద్ధత ఎలా ఉంటుంది..?. మళ్ళీ జగన్ ప్రభుత్వం రాగానే అన్నమయ్య జిల్లా రాకుండా ఉంటుందా?. చివరికి అన్నమయ్య పేరుపై ఉన్న జిల్లాను కూడా ఇలా చేయడం సరికాదు’’ అని రాచమల్లు  శివప్రసాద్ రెడ్డి హితవు పలికారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
YSRCP
rachamallu sivaprasad reddy
Chandrababu Naidu
TDP
ysr district
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

 ‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’

‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’

‘ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే’

‘ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే’

కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ హర్షం

కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ హర్షం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.