Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే!
ADVERTISEMENT

వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే!

Politics Sakshi User Sakshi Sakshi Time May 6, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
chandra-babu.jpg

ఏపీ రాజకీయాల సరళి మారి పోబోతున్నట్టుగా కనిపిస్తోంది. పొత్తులు పెట్టుకోక పోతే ఓడటం ఖాయం అన్న నిర్ధారణకు వచ్చిన టీడీపీ, జనసేనతో పొత్తులకు దిగుతు న్నది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో 42 స్థానాలకు గాను  కాంగ్రెస్‌ పార్టీ 22 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ కేవలం 16 సీట్లే గెలుచుకుంది. 1998లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లోనూ టీడీపీకి పరాభవం తప్పలేదు.

కాంగ్రెస్‌ పార్టీ 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే, టీడీపీ కేవలం 12 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానా లను గెలుచుకొని ఏపీలో తన పట్టు నిలబెట్టుకొంది. టీడీపీతో పొత్తు పెట్టుకోక ముందు కూడా ఏపీలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉందన్నది లోక్‌సభ ఎన్నికల్లోనే రుజువయ్యింది.

1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజ యాలతో చంద్రబాబు కన్ను బీజేపీపై పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏపీలో సొంతంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడం, నాటి ప్రధాని వాజ్‌ పేయిపై ప్రజల్లో సానుకూలత వంటి అంశాలను తనకు అనుకూలంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. అందుకే 1999లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టి అనూహ్య విజయాలను టీడీపీ పొందింది.

అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ బీజేపీ–టీడీపీ జోడీ అద్భుత విజయాలను అందుకొంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ 180 అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే, బీజేపీ 12 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందింది. లోక్‌ సభ ఎన్నికల్లో టీడీపీ 29 స్థానాల్లో విజయం సాధిస్తే, కాంగ్రెస్‌ 5 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఏపీలో 7 లోక్‌ సభ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. టీడీపీకి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీలో అధి కారం లభించడంతోపాటుగా ఎంపీ స్థానాలను గణనీ యంగా గెలుచుకోగలిగింది. అయితే ఆ తర్వాత చంద్ర బాబు, ఢిల్లీ పెద్దలతో సాగించిన రాజకీయం మనందరం చూశాం.

ఇక 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే వెళ్లి చంద్రబాబు తాను మునగడమే కాకుండా బీజేపీనీ దెబ్బతీశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ 5 ఎంపీ స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్‌ పార్టీ 29 స్థానాల్లో విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ 5 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. ఒక్కమాటలో చెప్పాలంటే 1999 ఎన్నికల ఫలితాలు 2004లో రివర్స్‌ అయ్యాయి. అలిపిరి దాడిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవడం కోసం చంద్రబాబు ఆడిన రాజకీయ జూదంలో బీజేపీ బలిపశువయ్యింది.

2009 ఎన్నికల్లో బీజేపీకి హ్యాండిచ్చి ‘మహా కూటమి’కట్టి.. బాబు ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో కలిసినా ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. వైఎస్సార్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ దెబ్బకు చంద్రబాబు మరోసారి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోవడం, ఏపీకి మాత్రమే టీడీపీ పరిమితమైన పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు, బీజేపీతో జట్టుకట్టి ఏపీలో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. అంతే కాదు... తెలంగాణలోనూ ఆ పార్టీ మంచి ఫలితాలను రాబట్టింది. ఏపీలో టీడీపీ 102 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తెలంగాణలోనూ టీడీపీ 15 చోట్ల విజయం సాధిస్తే, బీజేపీ కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏపీలో అధికారాన్ని అందుకున్న చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత ఎన్డీఏకు గుడ్‌ బై చెప్పి, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి తెలంగాణలో చిత్తు చిత్తయ్యారు. ఇక ఏపీలో ఎలాంటి ఫలితం వచ్చిందో మనందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల్లో జనసేనాని పవన్‌ మద్దతివ్వడంతోపాటు, మోదీ పాపులారిటీ  కూడా టీడీపీ విజయా నికి దోహదపడ్డాయి. కానీ 2019లో సొంతంగా బరి లోకి దిగిన చంద్రబాబు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్ని కల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నారు.

చదవండి: ఓటమిలో టీడీపీ రికార్డు.. 50 నియోజకవర్గాల్లో హ్యాట్రిక్‌ పరాజయం!

ఇక జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సైతం ఒక్కో ఎన్ని కలో ఒక్కో రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ–బీజేపీకి మద్దతి చ్చిన పవన్‌ కల్యాణ్, 2019 ఎన్నికల్లో బీఎస్పీ, లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో చిత్తయ్యారు. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటులోనే ఆ పార్టీ విజయం సాధించింది. తాను బరిలో నిలిచిన రెండు చోట్లా పవన్‌ కల్యాణ్‌ ఓటమి పాలయ్యారు.

ఎన్నిక్లలో ఓటమి తర్వాత బీజేపీతో జట్టు కట్టిన పవన్, మళ్లీ ఎన్నికలు రాబోతుండడంతో చంద్రబాబుపై ప్రేమ ఒలకబోస్తు న్నారు. ఒక్క ప్రజాశాంతి పార్టీతో తప్పించి, రాష్ట్రంలోని అన్ని పార్టీలతో జనసేన పొత్తులు కుదుర్చుకుందన్నది గతం స్పష్టం చేస్తోంది. ఓవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే... పవన్‌ తాజాగా చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలో ఏపీలో  వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తోంది బీజేపీ.



పురిఘళ్ల రఘురామ్‌ 

వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TDP
Janasena
alliance
Chandrababu Naidu
janasena chief
Pawan Kalyan
Guest Column
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.