Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. టీడీపీలో తిరుగుబావుటా 
ADVERTISEMENT 

టీడీపీలో తిరుగుబావుటా 

Politics Sakshi User Sakshi Sakshi Time Mar 3, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tirupati.jpg

బాబు నమ్మించి గొంతుకోశారని డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం ధ్వజం  

పెనుకొండలో బీకే పార్థసారథి ఇంటి వద్ద నాయకుల ఘెరావ్‌  

అనకాపల్లి ఎంపీ టికెట్‌ స్థానికులకే ఇవ్వాలని ఆడారి డిమాండ్‌  

రాజమండ్రి రూరల్‌ సీటు ప్రకటనపై వేచి చూస్తానన్న గోరంట్ల  

డోన్‌/పెనుకొండ/అనకాపల్లి/రాజమహేంద్రవరం రూరల్‌: టికెట్ల ప్రకటనపై టీడీపీలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. అసంతృప్త నేతలు తిరుగుబా­వుటా ఎగరవేస్తున్నారు. చంద్రబాబు తీరు­పై ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోశారని టీడీపీ నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

గత శుక్రవారం టీడీపీ డోన్‌ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వర్గీయులు డోన్‌లో పోటాపోటీ బలప్రద­ర్శన నిర్వహించగా, సీటు దక్కని ధర్మవరం సుబ్బారెడ్డి శనివారం భవిష్యత్‌ కార్యచరణ పేరుతో వేలాదిమందితో ప్రదర్శన నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ మూడేళ్ల పాటు పార్టీ బలోపేతానికి కష్టపడ్డానని వివరించారు. 40 ఏళ్లుగా కోట్ల, కేఈ వర్గా లకు విధేయునిగా ఉన్నానే తప్ప వారికి ఏనాడూ వెన్నుపోటు పొడవలేదని పేర్కొన్నారు.

ఆ రెండు కుటుంబాలు పార్టీ ఇన్‌చార్జిగా ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే బాబు తనకు బాధ్యత అప్పగించారని గుర్తుచేశారు. ఇప్పు­డు మూడేళ్ల తర్వాత తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్రెడ్డిని ప్రకటించడం దారుణమ న్నారు.  బాబు తన గొంతు కోశారని కన్నీటి పర్యంతమయ్యారు. తన రెక్కల కష్టంతో పార్టీని బతికించానని, ఇప్పుడు ఎవరో వచ్చి ఫలాలు పొందాలనుకుంటే తాను చూస్తూ ఊరుకోబోనన్నారు.   



బీకే ఇంటి వద్ద ఉద్రిక్తత 

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ మాజీ ఎమ్మె ల్యే బీకే పార్థసారథి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. బీకేకు టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ఆయన వర్గీయులు పార్టీపరిశీలకుడితోపాటు ఇతర నేతలను ఘెరావ్‌ చే శారు. పార్థసారథికి సర్దిచెప్పేందుకు శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ పరిశీలకుడు కోవెలపూడి రవీంద్ర, మరికొందరు నాయకులు పెనుకొండలోని బీకే ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీకే మద్దతుదారులు తమ నేతకే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ టికెట్‌ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని వారు సర్దిచెప్పబోగా.. ఎంపీ టికెట్‌కు ఒప్పుకోబోమని, ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి తీరాలని పట్టుబట్టారు. 



రవీంద్రతోపాటు ఇతర నాయకులను చుట్టుముట్టారు. దీంతో రవీంద్ర, ఇతర నాయకులు వెనుదిరిగేందుకు యత్నించారు. అయినా వదలని బీకే వర్గీయులు వారి వెంట పడ్డారు. వాహనాలను చుట్టుముట్టి ముందుకు వెళ్లనీయకుండా ఘెరావ్‌ చేశారు. లోకేష్, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రవీంద్ర, ఇతరులు అక్కడి నుంచి జారుకున్నారు.  



దిలీప్‌చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని అంగీకరించబోం 

టీడీపీ అనకాపల్లి ఎంపీ టికెట్‌ను స్థానికులకే ఇవ్వాలని, బైరా దిలీప్‌ చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించబోమని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, çసమైక్య ఉద్యమ నేత ఆడారి కిషోర్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధిష్టానం స్థానికులకే టికెట్‌ ఇవ్వాలి, లేకుంటే తాను తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు.

చంద్రబాబు, లోకేష్‌ సభలకు, పాదయాత్రలకు వారు ఇక్కడికి వచ్చినప్పుడు తన సొంత డబ్బులతో మూడు బస్సులు తిప్పానని, ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ సమావేశాలకూ బస్సులు తిప్పుతున్నానని చెప్పా­రు. ఆరు నెలల క్రితం చంద్రబాబుతో అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌ కోసం చర్చించానని, ఈసారి టికెట్‌ తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు శొంఠ్యాన అప్పలరాజు, దాడి అప్పలనాయుడు, ఎ.నాగేశ్వరరావు పాల్గొన్నారు.   



ప్రకటించే వరకూ వేచి చూస్తా: గోరంట్ల  

టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తేనే రాష్ట్రం మ­ళ్లీ బాగు పడుతుందని ప్రజలు భావిస్తున్నారని టీడీ­పీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నా­రు. నగరంలోని తన నివాసంలో శనివారం ఏర్పా­టు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడా­రు.

2019లో ఏం జరిగింది, ఇప్పుడు తన బలమేమిటనే విషయాలను పవన్‌ కళ్యాణ్‌ జెండా సభలో వివరించారని, పవన్‌ తన పార్టీని నెమ్మదిగా బలో­పేతం చేసుకుందామని చెప్పారని, ముద్రగడ, జోగయ్యల గురించి తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ సీటుపై అధినేతలు ప్రకటించే వరకూ వేచి చూస్తానని చెప్పారు. చంద్రబాబు, పవన్‌లను విడదీసేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
tickets
TDP
subbareddy
Parthasarathy
AP Politics
AP 175
AP Elections 2024
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు

అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.