Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. కేఈ శ్యాంబాబుకు సొంతిల్లు లేదట!
ADVERTISEMENT 

కేఈ శ్యాంబాబుకు సొంతిల్లు లేదట!

Politics Sakshi User Sakshi Sakshi Time Apr 26, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
3552.jpg

కర్నూలు(సెంట్రల్‌): పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ కుటుంబానికి అమరావతిలో రూ.5.54 కోట్ల విలువ చేసే 38,002 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పటికీ సొంత ఇల్లు లేదని అఫిడవిట్‌లో చూపారు. తండ్రి డిప్యూటీ సీఎంగా పనిచేసినా కుమారుడికి మాత్రం సొంతిల్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల ఆయన పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయగా..తాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట కృష్ణగిరి, కంబాలపాడులలో రూ.19.40 లక్షల విలువ చేసే 12.33 ఎకరాల పొలం, రూ.31.79 లక్షల విలువ చేసే ఫార్చునర్‌ కారు ఉన్నట్లు చూపారు. భార్యకు రూ.32 లక్షల విలువ చేసే 46.58 తులాల బంగారు, రూ.15 లక్షల విలువ చేసే 16.50 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట రూ. 3,23,18,090 చరాస్తులు, భార్యకు రూ..1,32,14,007 చరాస్తులు ఉన్నట్లు చూపారు. ఆయన  కుటుంబ సభ్యులు,  బంధువుల దగ్గర రూ.1,19,76,800 అప్పు తీసుకున్నట్లు, తన భార్యకు రూ.19.50 లక్షల అప్పు ఇచ్చినట్లు చెప్పారు.  తనపై ఒక్క కేసు కూడా లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు 
మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్‌.రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు ఉన్నాయి. అంతేగాక అతను, అతని భార్య ఎన్‌.యశోదమ్మకు దాదాపు 31 ఎకరాల పొలాలు ఉన్నాయి. మాధవరంలో ముగ్గురి భాగస్తుల్లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ అతనిపేరిట ఉంది. అతని ఎలాంటి కేసులు లేవని ఎన్నికల ఆఫిడవిట్‌లో పొందుపరచారు. ఆయనకు రూ.3.92 లక్షల విలువ చేసే 5.6 తులాల బంగారు అభరణాలు, భార్య ఎన్‌. యశోదమ్మకు రూ.9.10 లక్షల విలువ చేసే 13 తులాల బంగారం అభరణాలు ఉన్నట్లు తెలిపారు. అంతేకాక ఆయన పేరిట రూ.40.70 లక్షల  చరాస్తి, భార్యకు రూ.26.26 లక్షల చరాస్తితోపాటు రూ.33 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన పేరిట స్థిరాస్తులు మాత్రం రూ.2.94 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. కుమారుడు రాకే‹Ùరెడ్డి పేరిట 35 లక్షల స్థిరాస్తి, రూ.20 లక్షల చరాస్తి ఉన్నట్లు చూపారు. రాఘవేంద్రారెడ్డికి రూ.1.68 కోట్ల అప్పులు, భార్యకు రూ.21 లక్షల అప్పు ఉన్నట్లు ప్రకటించారు.  

వై.బాలనాగిరెడ్డికి వ్యవసాయ భూములే ఆస్తులు 
మంత్రాలయం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై.బాలనాగిరెడ్డి, ఆయన భార్య జయమ్మకు కలిపి 44.06 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇందులో బాలనాగిరెడ్డి పేరిట 37.45 ఎకరాలు, భార్య పేరిట 6.61 ఎకరాల పొలం ఉంది. ఆయనకు పేరిట ఒకకారు, భార్య పేరిట మరొక కారు ఉంది. ఆయన  రూ.12 లక్షల విలువ చేసే 400 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల విలువ చేసే 10 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య పేరిట రూ.4.85 లక్షల విలువ చేసే 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల విలువ చేసే 5 కేజీల వెండి ఉంది. కాగా, బాలనాగిరెడ్డిపై 2012లో కోసిగి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు విచారణలో ఉంది.  

ఇంతియాజ్‌కు సొంత వాహనం లేదు 
సెర్ప్‌ సీఈఓ, సీసీఎల్‌ఏ అదనపు కార్యదర్శిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఏఎండీ ఇంతియాజ్‌కు సొంత వాహనం లేదు. బుధవారం ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫునన కర్నూలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఆవిడవిట్‌లో తనకున్న ఆస్తి వివరాలను ప్రకటించారు. తన చరాస్తిగా రూ.41.36 లక్షలు,  భార్య సమీనకు చరాస్తిగా రూ.18.42 లక్షలు మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో వారికి విలువైన వాహనాలుగాని, ఖరీదైనా వజ్రాలు, బంగారు, వెండి, అభరణాలేవి లేవు. స్థిరాస్తుల్లో ఆయన భార్య సమీనకు కర్నూలులోని ఎన్‌ఆర్‌ పేటలో 378 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇల్లు ఉంది. అలాగే ఆయనకు రాజధాని క్యాపిటల్‌ సిటీలోని ఐనవోలులో 4500 చదరపు అడుగుల కాళీ స్థలం, ఆయన భార్య సమీనకు కల్లూరులో 2800 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. స్థిరాస్తి విలువలో ఇంతియాజ్‌కు రూ.30 లక్షలు, ఆయన భార్యకు రూ.30 లక్షలు ఉన్నాయి. మొత్తంగా ఆయనకు చరాస్థిరాస్తులు కలిపి రూ. 71,36,560, ఆయన భార్య సమీనకు 68, 42,603 లక్షల రూపాయలు ఉన్నాయి.  ఆయనపై ఎలాంటి కేసులు లేవు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TDP
KE Shyam Babu
KE Krishnamurthy
AP Politics
kurnool
AP Assembly Elections 2024
pattikonda
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.