Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ADVERTISEMENT 

అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!

Politics Sakshi User Sakshi Sakshi Time Apr 2, 2025 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Chandrababu_IAs.jpg

ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా? ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా? వీరికన్నా ఐపీఎస్‌లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో అర్థమేమిటి? ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తామని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లా?. ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అందులో ఆయన  సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు. తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎక్కువ సార్లు ఇవి కాలక్షేపం సమావేశాలుగా మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాలలో ఉంది. 

.. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం. ప్రజెంటేషన్స్ ఇవ్వద్దని సూచించడం విశేషం. నిజానికి ఇలాంటి వాటిల్లో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు.  ఉపయోగం ఉన్నా.. లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినన్ని అంకెల ప్రజెంటేషన్లు మరెవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలే. పొంతన లేకుండా అంకెలు చెప్పేస్తూంటారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని కాదు కానీ ప్రజలను గందరగోళపరిచి తను రాజకీయంగా లబ్ది పొందడం లక్ష్యంగా ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది. 

👉మంచి జరిగితే తన ఖాతాలోకి, తప్పు జరిగితే అధికారుల అకౌంట్లలోకి జమ చేయడం ఆయన వైఖరి. కావచ్చు. కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు. ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుందట. నిజంగానే అక్కడ అభివృద్ది జరిగి ఆదాయం పెరిగిందా? లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విధంగా అంకెలు తయారు చేశారా? అనేది చెప్పలేం. చంద్రబాబు మాట్లాడితే వృద్ది రేటు అని అంటారు. అదేమిటో మామూలు ప్రజలకు అర్థం కాదు. కానీ పదే, పదే వాడడం ద్వారా ఏదో జరుగుతోందన్న  భావన కలిగించడం ఆయన లక్ష్యం. 

పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తేనే సంక్షేమం, అభివృద్ది చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు. అది నిజమే అనుకుందాం. కానీ ఇంత సీనియర్ అయిన చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా? ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డగోలుగా ఎలా ఇచ్చారు? అనే  ప్రశ్నకు ఏనాడైనా జవాబు ఇచ్చారా? కలెక్టర్లకు ఆ విషయం తెలియదా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు ఎన్ని కథలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా? ఇప్పుడు దాన్నంతా కలెక్టర్ల మీద తోసేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదా?.

👉ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, వండర్ పుల్ సర్, మిరాకిల్ సర్‌ అని వారు చెప్పవచ్చు. అనవచ్చు. కాని అర్థం చూస్తే అవేవో జరగడం సాధ్యం కాని అద్భుతాలు అన్నమాట. వాటిపై సీఎం కథలు చెబుతూ తమను అలా అంటారేమిటని కలెక్టర్లు  అనుకోకుండా ఉంటారా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సైతం గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తోచినన్ని అబద్దాలు చెప్పడం, చివరికి వివేక హత్య కేసు వంటివాటిని కూడా అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన  యత్నించారు. కలెక్టర్లు మెదడుకు పదును పెట్టాలని అంటున్నారు. ఎక్కువ సందర్భాలలో కలెక్టర్లకు  ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికే  టైమ్ చాలదు. అందులోను మారిన రాజకీయ వాతావరణంలో కూటమి నేతల పైరవీలను తట్టుకోవడమే కలెక్టర్లకు ఇతర అధికారులకు పెద్ద సవాల్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

👉ఆయా చోట్ల అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న  కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. వాటిపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు ఉంటున్నారు. లేకుంటే ఒక తెలుగుదేశం పత్రిక కొందరు ఐఎఎస్‌ల భార్యలు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని, ఆయా పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక కథనాన్ని ఇస్తే.. ఐఎఎస్ అధికారుల సంఘం కనీసం ఖండించినట్లు  లేదు. చంద్రబాబు కార్యాలయం దానిపై స్పందించలేదు. దీన్ని బట్టే ఐఎఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్(Red Book) పిచ్చిగోలకు భయపడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, ఎదురు కేసులు పెడుతూ, సస్పెన్షన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు ఎదురుగా కనిపిస్తున్నప్పడు వారు మాత్రం ఏమి చేస్తారు?. 

ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్లండి, సొంతంగా ఆలోచించండి, సమస్యలు పరిష్కరించి క్రెడిట్ రాజకీయ నేతలకు ఇవ్వండని చంద్రబాబు అంటున్నారు. అంటే గతంలో చెప్పిన రాజకీయ పాలనను పరోక్షంగా మరోసారి చెప్పడమే కదా! కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కలెక్టర్లను సొంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 

👉ఉదాహరణకు.. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కార్యాలయంలో తిష్టవేసి నిరసన చెబితే అధికారులు ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీలో సీఎం ఆఫీస్ వద్దే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దూషణలకు దిగినా అదేమిటని ప్రశ్నించ లేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఐఏఎస్‌లకన్నా ఐపీఎస్‌లు నచ్చారట. అవును..నిజమే.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబును, ఆయన కుమారుడు  లోకేష్‌ను సంతోషపెడుతున్నందున బహుశా వారే బాగా నచ్చారేమో!. 

👉ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అప్పుల విషయంలో ఎన్ని అసత్యాలు చెప్పారో అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చాక సైతం అవే అబద్దాలను కొనసాగిస్తున్నారు. సంపద సృష్టిస్తానని, అప్పులు చేయనని చెప్పేవారు. కాని ఇప్పుడు ఏమంటున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలుకు కొంతమేర అప్పులు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్లు, ఐఏఎస్‌లు దీనిని గమనించలేన‍ంత అమాయకులా?. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తిడుతుంటే దానికి కలెక్టర్లు ఎలా జవాబుదారి అవుతారు?. ఎన్నికల సమయంలో చెప్పిన  హామీల అమలుకు నిధులు కేటాయించి, వాటిని విడుదల చేస్తే, అప్పుడు అమలు చేయకపోతే కలెక్టర్లు బాధ్యులవుతారు  తప్ప, నిధులు ఇవ్వకుండా సీఎం అది చేయండి.. ఇది చేయండి అని చెబితే వారు కూడా ఎస్ సార్ అంటూ వినయం నటించక తప్పదు  కదా!. 

గతంలో జగన్ టైమ్‌లో హామీలు, స్కీమ్‌ల వారీగా సమీక్షలు చేసేవారు ఎన్నికల మానిఫెస్టోని వారి ముందు పెట్టి ఏ మేరకు అమలు చేయగలిగాం.. ఎంత ఖర్చు అయింది? ఎంత డబ్బు అవసరం అన్నదానిపై చర్చించి విడుదల చేసేవారు. అలా సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికను అధికారులకు ఇచ్చి అమలు చేయాలని చెప్పే సాహసం చంద్రబాబు  చేయగలరా?. మాట్లాడితే అధికారుల ఆలోచన తీరు మారాలని చెబుతారు?. అదేమిటో చెప్పరు! పడికట్టు పదాలు వాడి ప్రసంగం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. తల్లికి వందనం కింద మే నెలలో డబ్బులు ఇస్తామని అంటున్నారు. అది ఇప్పుడు గడచిపోయిన సంవత్సరానికా? లేక వచ్చే సంవత్సరానికా అని జనం అడిగితే  అధికారులు ఏమి చెప్పాలి? పైగా స్కూళ్లు తెరవక ముందే పిల్లలందరికి డబ్బులు ఇస్తామని అనడంలో మతలబు ఏమిటి? జూన్ లో కొత్తగా నమోదయ్యే  పిల్లలకు కూడా ఇస్తారా? ఇవ్వరా? ఇలాంటి వాటిపై కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఇదే సమస్య అన్నదాత సుఖీభవ స్కీముకు కూడా వస్తుంది కదా?. 

👉అమరావతి నిర్మాణంపై కూడా పాత అసత్యాలే మళ్లీ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకపక్క బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు పెట్టి, రూ.31 వేల కోట్ల వరకు అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నా, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నట్లుగా ఉంది.  కలెక్టర్లు.. అధికార దర్పం వద్దని చంద్రబాబు  అన్నారట. అంటే ఏమిటి? మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చినా, టీడీపీ ఐడీ కార్డులు  పెట్టుకుని వచ్చినా, వారికి ఎదురేగి స్వాగతం పలకాలని సూచించడమా? లేక వైఎస్సార్‌సీపీ అభిమానులు ఎవరైనా తమ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారికి ఏమీ చేయవద్దని చెప్పడమా? ఆయన  మనసులోని మాటను గుర్తెరిగి అధికారులు వ్యవహరిస్తే సరిపోతుందా? ఏపీలో మాట ఇచ్చినట్లే మంచి పాలన జరుగుతోందని చంద్రబాబు అన్నట్లుగా ఎల్లో మీడియా బానర్ కథనాలు ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు అధికారులకు తెలియకుండా ఉంటాయా? నిజమే..

అధికారులు క్షేత్ర స్థాయిలో బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకమై  వారి సమస్యలు తీర్చాలి. అంతవరకు చంద్రబాబు అయినా, మరెవరైనా చెప్పడం తప్పు కాదు. కాని తాము ఇచ్చిన  హామీలన్నిటికి ఐఏఎస్‌ అధికారులు జవాబుదారులు  అయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను వారిపైకి నెట్టివేస్తే, అర్థం చేసుకోలేని అమాయకులుగా అధికారులు ఉండరు కదా! కాకపోతే  ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు చేసే అవమానాలను మౌనంగా భరించక తప్పదేమో!


:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Chandrababu Naidu
IAS officers association
warn
bureaucrat
Kutami Prabhutvam
AP Politics
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.