Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు: జడ శ్రవణ్‌
ADVERTISEMENT 

నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు: జడ శ్రవణ్‌

Politics Sakshi User Sakshi Sakshi Time Jun 18, 2026 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Jada-Sravan-Kumar.jpg

సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ కేసుపై ప్రముఖ న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్‌ కుమార్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏదైనా కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సిన నిబంధన ఉందని అన్నారు. అయితే గాదె సాయికృష్ణ వ్యవహారంలో ఆ నిబంధనలు పాటించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే.. 
సాయికృష్ణ కేసులో కూటమి ప్రభుత్వ పనితీరు.. ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చ. భారతదేశ చరిత్రలో ఇంత హీనమైన, హేయమైన ఘటన ఎప్పుడూ లేదు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మూటకట్టి అటకపై పడేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఏ రాజ్యాంగం ప్రకారమైనా తప్పు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచాలి. రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండే కొందరు పోలీసులు చేసేదే లాకప్ డెత్. చట్టాలు అప్ గ్రేడ్ అయినట్లు పోలీసులు కూడా అప్ గ్రేడ్ అయినట్లున్నారు

ఏపీ హోంమంత్రికి ఓ కత్తెర మంత్రి. ఇన్ విజిబుల్ పోలీసింగ్ అని ఏదో ఒక్క అర్ధం చెబుతున్నారామె. నా పాతికేళ్ల న్యాయవృత్తిలో ఇలాంటి పదాలు నేనెప్పుడూ వినలేదు. లాకప్ డెత్ లు జరిగినపుడు పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు

సాయికృష్ణను చంపేసి బూడిద చేశారని అతని తల్లి ఆరోపిస్తోంది. తన కొడుకుని చూపించమని పోలీసులను సాయికృష్ణ తల్లి వేడుకుంది. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేవరకూ నేను అండగా ఉంటా. న్యాయపరంగా అవసరమైతే సాయం అందిస్తా. సాయికృష్ణకు జరిగిన అన్యాయం పై కులమతాలకు అతీతంగా అండగా నిలవాలి

హోంమంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. మే 9 నుంచి ఈరోజు వరకూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని బయటపెట్టాలి. స్టేషన్ మొత్తం సిసి కెమెరాలు ఉంటే.. సీఐ రూమ్‌లో సీసీ కెమెరాలు ఎందుకు లేవు. ఏపీలో ప్రతీ స్టేషన్‌లో ఇంటరాగేషన్ కోసం వ్యక్తిగత రూమ్ లు ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణలంక సీఐ వ్యక్తిగత రూమ్‌లో  కూడా ఇలాంటివే జరుగుతున్నాయి

సాయికృష్ణ మృతి కేసులో ఏ1 ముద్దాయి మంత్రి లోకేష్. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే ఏపీలో లా అండ్ ఆర్డర్ పాతరేశారు. ఏ2 ముద్దాయి సీఎం చంద్రబాబు. చంద్రబాబు కళ్లుండి చూడలేని దృతరాష్ట్రుడు. లోకేష్ దుర్యోధనుడి మాదిరి రెడ్ బుక్ పాలన చేస్తున్నాడు. ఈ కేసులో ఏ3 ముద్దాయి పవన్ కళ్యాణ్. పవన్ తనకు దేవుడిచ్చిన అన్న అని లోకేష్ అంటున్నాడు. పదేళ్లక్రితం ఇదే దేవుడిచ్చిన అన్నను పచ్చి బూతులు తిట్టించింది లోకేష్ కాదా?. కౌరవులకు ఉన్న ఏకైక సోదరి హోంమంత్రి అనిత*

తెనాలిలో ఎన్డీపీఎస్ కేసులో ముగ్గురు యువకులను నడిరోడ్డు పై పోలీసులు చితకబాదారు. తెనాలి ఘటన చూశాక న్యాయవాదులు, న్యాయ మూర్తులు నీళ్లులేని బావిలో దూకి చావాలి. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయవ్యవస్థ.. పోలీసులు కాదు. కాపీ కొట్టి పాసై టీచర్ అయిన హోంమంత్రి ఈ విషయం తెలుసుకోవాలి. సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పడానికి కాదు నీకు హోంమంత్రి పదవి ఇచ్చింది. హెరిటేజ్ మీద ఎవరైనా మాట్లాడగానే సీఎఫ్ఓ మాదిరి హోంమంత్రి తెరపైకి వస్తారు. ఎందుకు సాయికృష్ణ అంశం పై హోంమంత్రి మాట్లాడలేదు. ఎందుకు హోంమంత్రి సీఐపై మాట్లాడలేదు. జ‍డ్జీలను సైతం కొనేద్దామని భావన ఈ పోలీసులు, మంత్రులది.

సాయికృష్ణ చనిపోయిన రోజునే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి తెలుసు. సీఎం, హోంమంత్రి మనల్ని కాపాడతాడని సీఐకి సీపీ భరోసా ఇచ్చారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని తక్షణమే సస్పెండ్ చేయాలి. సీపీతో పాటు ఆరోజే హోంమంతికి కూడా ఈ విషయం తెలుసు. వారం రోజుల తర్వాత సీఎం,డిప్యూటీ సీఎంకు కూడా తెలుసు.. 

హోంమంత్రిని తక్షణమే బర్త్ రఫ్ చేయాలి. రాజశేఖర్ బాబు ఇక్కడ ఉండగా విచారణ సజావుగా సాగదు. కాబట్టి సీపీగా రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలి. క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి అద్భుతంగా అబద్ధాలు ఆడుతున్నారు. పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని చెబుతున్నారు. ఇలా లాకప్ డెత్ లు చేయడమేనా పోలీస్ వ్యవస్థ అద్భుత పనితీరు?. 

రెండు కేసులున్న వ్యక్తిని లాకప్ డెత్ చేస్తే.. 40 కేసులున్న చంద్రబాబును ఏ స్టేషన్‌కు పంపిస్తారు?. వందల కోట్లు దోచుకున్నాడని ఆరోపణలున్న లోకేష్ ను ఏ స్టేషన్ కు పంపిస్తారు?. హోంమంత్రి మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కొంచెమైనా నీ శాఖ పై పెడితే బాగుంటుంది

ఈ రెండేళ్లలో ఆడపిల్లల పై ఏపీలో జరిగిన నేరాల సంఖ్య 44,586. శిక్షలు పడింది కేవలం 541 కేసుల్లో మాత్రమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం నాలుగు కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన డేటా 10 క్లాస్ ఫెయిల్ అయిన మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చాడా?. హోం శాఖ నిర్వహిస్తున్న హోంమంత్రికి.. డీజీపీకి సిగ్గుండాలి

సీఎం సొంత జిల్లాలో కేవలం 10 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. డిప్యూటీ సీఎం జిల్లాలో శిక్షపడింది  14 కేసుల్లో మాత్రమే. రాష్ట్రంలో 46 వేల మంది ఆడిపిల్లలకు అన్యాయం జరిగితే ఏనాడైనా వారి ఇంటికి వెళ్లారా డిప్యూటీ సీఎం?. ఉపముఖ్యమంత్రిగా ఉండి మీరు 
ఏంపీకారు?. పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు ఇదేనా

గతంతో పోల్చుకుంటే 24 శాతం ఆడపిల్లల పై నేరాలు పెరిగాయి. పోలీస్ డిపార్ట్ మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాలని అడగడానికి సిగ్గుందా?. సాయికృష్ణ మృతదేహాన్ని కాని..అతని బూడిదను కానీ ఇచ్చి అప్పుడు క్రెడిట్ తీసుకోండి. సాయికృష్ణ తల్లి కన్నీళ్లకు సమాధానం చెప్పి క్రెడిట్ తీసుకోండి. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ బ్రతికేహక్కుంది. మోకీళ్లు తీసేస్తా ... అరచేతిలో రేఖలు చెరిపేస్తానని డిప్యూటీసీఎం చెబుతుంటే పోలీసులకు ఏం ఇండికేషన్ ఇచ్చినట్లు?. 

సిగ్గులేకుండా సోషల్ మీడియాలో సాయికృష్ణ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. సాయికృష్ణ తల్లి కడుపుకోతతో బాధపడుతోంది. ఆ తల్లికి దళితసోదరులంతా అండగా నిలవాలి. కాపుల ఓట్లు వేయించుకుని పవన్  కాపులను గాలికి వదిలేశారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు అని జడ శ్రవణ్‌ మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? అనే అంశం ఏపీలో తీవ్ర చర్చకు దారితీసింది. విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా పోలీసు శాఖ నుండి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Saikrishna
lock up death
Jada Sravan Kumar
AP Politics
Krishna lanka police station
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.