Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఓటమి భయం.. రంగంలోకి బాలకృష్ణ, వసుంధర!
ADVERTISEMENT

ఓటమి భయం.. రంగంలోకి బాలకృష్ణ, వసుంధర!

Politics Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2026 11:29 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
balakrishna-tdp-1f.jpg

కొళాయిల్లో ఎప్పుడూ రాని నీళ్లు.. మురుగుతో పొంగిపొర్లే కాల్వలు.. కనీస సౌకర్యాలు కనిపించవు.. ప్రజల గోడు ఎవరికీ వినిపించదు. నాలుగు దశాబ్దాలుగా టీడీపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోని పరిస్థితి ఇది. బాలకృష్ణ మూడు పర్యాయాలు ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లినా ఈ ప్రాంత అభివృద్ధిని మాత్రం పూర్తిగా విస్మరించారు. నిత్యం సినిమాల్లో బిజీగా ఉండే ఆయన.. పీఏలకు పాలన పగ్గాలు అప్పగించడంతో వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఫలితంగా జనం నరకం చూస్తున్నారు.  

హిందూపురం(చిలమత్తూరు): శ్రీసత్యసాయి జిల్లాలోనే అతిపెద్ద పట్టణంగా పేరుగాంచిన హిందూపురం మున్సిపాలిటీ పరిధి రోజు రోజుకూ విస్తరిస్తోంది. 52 వార్డులు, 2.26 లక్షల జనాభా ఉన్న పట్టణం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. స్థానికంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఉండకపోవడం, పీఏలకు అధికారాలు ఇవ్వడంతో దోపిడీలు, దౌర్జన్యాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఎమ్మెల్యే బాలకృష్ణ చుట్టపుచూపుగా వచ్చిపోతుండటంతో ఇక్కడి నేతలు, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై దోచుకుతింటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం తాగేందుకు నీళ్లు ఇవ్వలేని పాలకులపై జనం గుర్రుగా ఉండగా.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపురంలో ప్రచారం నిర్వహిస్తుండగా... తాజాగా బాలకృష్ణ కూడా ప్రచారం కోసం రావడం చర్చనీయాంశమైంది. 

నీరు కరువు.. మురుగు పరుగు.. 
పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి 10 రోజులకు ఒక్కసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజలు తమ అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. వచ్చే అరకొర నీటికీ ట్యాక్స్‌లు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇక మురుగు కాల్వలు సరిగా లేకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరు ఇళ్లలోకి, దుకాణాల్లోకి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మురుగునీరు కొట్నూరు, శ్రీకంఠపురం చెరువుల్లో చేరుతుండగా.. ఆ నీరంతా కలుషితమవుతోంది.  

అభివృద్ధి పనుల్లో భారీ దోపిడీ.. 
ఇక మున్సిపాలిటీ పరిధిలో రూ.92 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్లు, సీసీ రోడ్లు వంటివి నాసిరకంగా నిర్మించి భారీగా దోచేశారనే ఆరోపణలున్నాయి. అలాగే హిందూపురం ప్రజల నీటి అవసరాలు తీర్చే రూ.136 కోట్ల గొల్లపల్లి వాటర్‌ ప్రాజెక్ట్‌ పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం సమీపంలోనే వాటర్‌ ట్యాంకు నిర్మాణ పనులు జరుగుతుండగా, నాసిరకం స్టీల్‌ వాడి ట్యాంకు నిర్మాణం చేస్తున్నారు. ఇక మున్సిపాలిటీ పరిధిలోని కొట్నూరు రెవెన్యూ పొలంలో టీడీపీ నేతలు సర్వే నంబర్‌ 259–1లో రూ.కోట్లు విలువ చేసే మున్సిపల్‌ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా షెడ్లు నిర్మాణం చేపట్టి వాడుకుంటున్నారు.  

ఇదీ చదవండి: శ్రీలంక పౌరురాలికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ టికెట్టా?

దారితప్పిన శాంతిభద్రతలు.. 
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన తర్వాత  హిందూపురం అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు అధికం కాగా, శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. కూటమి నేతల సేవలో పోలీసు యంత్రాంగం తరిస్తుండటంతో సామాన్య ప్రజానీకం నరకం చూస్తున్నారు. నియోజకవర్గంలో వెలుగుచూసిన దొంగ నోట్ల వ్యవహారంలో టీడీపీ ముఖ్యనేత పాత్ర ఉండటం సంచలనం రేపింది. అయితే ఆ నోట్లను కూడా పోలీసులు టాయ్‌ నోట్లుగా చిత్రీకరించి దేశద్రోహం కేసు బదులు నామమాత్రపు కేసు పెట్టి మమ అనిపించారు. ఇక పట్టణంలో తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలను టార్గెట్‌ చేసిన దొంగలు.. వరుస చోరీలకు పాల్పడుతున్నారు. అయినా ఇంతవరకూ వారిని పట్టుకున్న దాఖల్లాల్లేవు. 

నలుగురు.. నాలుగు దిక్కులు.. 
బాలకృష్ణ చుట్టం చూపుగా వచ్చి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి వెళ్లిపోతుంటారు. ఆయన పీఏలు నలుగురు ఉండగా, నలుగురు నాలుగు దిక్కులు గా ఏర్పడి స్వప్రయోజనాలపైనే దృష్టిపెట్టి పట్టణ అభివృద్ధిని, సౌకర్యాల కల్పనను గాలికి వదిలేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణాతో పాటు భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తూ భారీగా దోచేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అధికారం అండతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  అందుకే వారి అవినీతి గురించి నోరు విప్పేందుకు కూడా ‘పురం’వాసులు భయపడిపోతున్నారు. 

లోటు బడ్జెట్‌లో మున్సిపాలిటీ.. 
హిందూపురం మున్సిపాలిటీకి ప్రాపర్టీ ట్యాక్స్‌ కేవలం రూ.16 కోట్లు మాత్రమే వస్తోంది. వచ్చిన ఆదాయంలో 80 శాతం గొల్లపల్లి నుంచి నీటి సరఫరాకే ఖర్చు చేస్తున్నారు. మిగిలిన మొత్తంతోనే అభివృద్ధి పనులు, సిబ్బందికి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి.  

జిల్లా సర్వజనాసుపత్రిలో సమస్యలు.. 
హిందూపురంలోని జిల్లా ఆస్పత్రికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. కానీ ఇక్కడ రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 2024 ఫిబ్రవరిలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ హయాంలో శంకుస్థాపన చేశారు. గత నెలలో టీడీపీ ఆర్భాటంగా క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో పరికరాలు, సిబ్బంది, వైద్యుల నియామకాన్ని చేపట్టలేదు.

ఓటమి భయంతోనే ప్రచారానికి బాలకృష్ణ 
హిందూపురంలో రెండున్నరేళ్లుగా అరాచకశక్తులు రాజ్యమేలుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఉండగానే వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్జన్యం ఎక్కడైనా ఉంటుందా..? అక్రమ మైనింగ్, ఇసుక, మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. అభివృద్ధి మాటున టీడీపీ నేతలు జేబులు   నింపుకున్నారు. టీడీపీ నేతలకు ఓట్లు అడిగే అర్హతే లేదు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని టీడీపీ ఎన్నికల్లో ఓటమి చెందడం ఖాయం. అందుకే సినిమాలకే పరిమితమైన ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారానికి వస్తున్నారు.  
– టీఎన్‌ దీపిక, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, హిందూపురం 

తాగునీటికీ కరువు 
మా ప్రాంతంలో పది రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి. రోజువారీ అవసరాలకు ఆ నీళ్లు సరిపోవడం లేదు. అందుకే ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొంటున్నాం. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో దోమలు వ్యాప్తి అధికంగా ఉంది. వర్షాలు పడితే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది.  
– శారద, హిందూపురం   

రోడ్లపైనే మురుగు 
హిందూపురం మున్సిపాలిటీని అధ్వానంగా మార్చారు. అభివృద్ధి పనుల పేరుతో దోచుకుతిన్నారు. డ్రైన్లు లేక మురుగునీరు రోడ్లుపైనే ప్రవహిస్తోంది. మున్సిపల్‌ వర్కర్లు కొరత ఎక్కువగా ఉంది. ఉన్నవారితోనే ఎక్కువ పని చేయిస్తున్నారు. వర్షాలు వస్తే ఇళ్లలోకి, దుకాణాల్లోకి నీరు చేరుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 
– సురేష్‌ కుమార్, రైల్వే రోడ్డు, హిందూపురం  

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
TDP
ap local body elections 2026
Local bodies elections
Andhra Pradesh
AP Politics
Nandamuri Balakrishna
Election Campaign
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

 పరిషత్ లో ఫ్యాన్ జోరు YSRCP  గెలుపులు

పరిషత్ లో ఫ్యాన్ జోరు YSRCP గెలుపులు

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

ఏలూరులో YSRCP విజయోత్సవ సంబరాలు

ఏలూరులో YSRCP విజయోత్సవ సంబరాలు

ధర్మాన ప్రసాద్ రావు, గుండ లక్ష్మీదేవి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

ధర్మాన ప్రసాద్ రావు, గుండ లక్ష్మీదేవి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

చంద్రబాబుకు భారీ షాక్... 500 మందితో YSRCP లో చేరిన చేరిన టీడీపీ నేత

చంద్రబాబుకు భారీ షాక్... 500 మందితో YSRCP లో చేరిన చేరిన టీడీపీ నేత

మరిన్ని వార్తలు

పచ్చమూకల దాష్టీకాలకు ఎదురొడ్డి గెలుపు

పచ్చమూకల దాష్టీకాలకు ఎదురొడ్డి గెలుపు

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

పరిషత్‌ ఎన్నికల్లో మంత్రికి షాక్‌

పరిషత్‌ ఎన్నికల్లో మంత్రికి షాక్‌

గెలిచావు రమ్మన్నారు.. తర్వాత ఓడిపోయావన్నారు

గెలిచావు రమ్మన్నారు.. తర్వాత ఓడిపోయావన్నారు

నా ఓటమి చీమకుర్తి సీఐకి అంకితం

నా ఓటమి చీమకుర్తి సీఐకి అంకితం

‘టార్చ్‌లైట్‌’ ఎలా వచ్చింది...

‘టార్చ్‌లైట్‌’ ఎలా వచ్చింది...

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft