Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. నేనే మంత్రి..!?
ADVERTISEMENT 

నేనే మంత్రి..!?

Politics Sakshi User Sakshi Sakshi Time Jun 7, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nene.jpg

ఆశల పల్లకీలో నేతలు

సార్వత్రిక పోరులో అత్యధిక స్థానాల్లో కూటమి విజయం

2004 తర్వాత టీడీపీకి తొలిసారి అత్యధిక అసెంబ్లీ స్థానాలు

కూటమి అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై చర్చ

రేసులో కోట్ల, బీసీ, టీజీ, భూమా, ఫరూక్‌

తమ నాయకుడికే అవకాశమని కేడర్‌లో ధీమా

సార్వత్రిక పోరు ముగిసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే కూటమి నేతగా నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందనే చర్చ కర్నూలు, నంద్యాల జిల్లాలో మొదలైంది. 2004 తర్వాత అత్యధిక స్థానాల్లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడంతో మంత్రి పదవి ఆశించేవారి సంఖ్య కూడా పెరిగింది.

నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లాకో మంత్రి పదవి ఇస్తారా? లేదా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఒకే మంత్రి పదవి ఇస్తారా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. సీనియర్‌ నేతలకు మంత్రి పదవి దక్కుతుందని అధిక శాతం నేతలు భావిస్తున్నా, సామాజిక సమీకరణల నేపథ్యంలో తమకూ అవకాశం దక్కుతుందని తొలిసారి అసెంబ్లీకి వెళ్లే నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రెండు ఎంపీలతో పాటు 12 అసెంబ్లీలు కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఆదోనిలో బీజేపీ అభ్యర్థి పార్థసారథి ఎమ్మెల్యేగా గెలుపొందితే, తక్కిన 11 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆలూరు, మంత్రాలయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా విరూపాక్షి, బాలనాగిరెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థుల్లో మంత్రి వర్గంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.

సార్వత్రిక పోరులో ప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మ టిక్కెట్లు ఆశించారు. అయితే ఆమెకు టిక్కెట్‌ ఇవ్వలేమని, డోన్‌ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని.. గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారనే చర్చ కోట్ల వర్గంలో నడుస్తోంది. దీంతో ప్రకాశ్‌రెడ్డికి కచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే ఆశాభావం ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది. కోట్ల అసెంబ్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో ఆదోని నుంచి పోటీ చేసి మీనాక్షినాయుడు చేతిలో ఓడిపోయారు. అయితే కర్నూలు ఎంపీగా ఆయన పలుసార్లు ప్రాతినిథ్యం వహించారు. కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.

నంద్యాల జిల్లా నుంచి రేసులో ముగ్గురు..
నంద్యాల జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. 2014లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన బీసీ, 2019లో ఓటమి చెందారు. తిరిగి 2024లో విజయం సాధించారు. నంద్యాల జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ కూడా కేబినెట్‌ బెర్త్‌పై ఆశపెట్టుకున్నారు. ఇదే జిల్లాలో భూమా అఖిలప్రియ కూడా మంత్రివర్గంలో చోటుపై ధీమాగా ఉన్నారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన అఖిలప్రియ ఆపై తన తండ్రి భూమా నాగిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

నాగిరెడ్డి మృతి తర్వాత అఖిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. పర్యాటక శాఖ మంత్రిగా చేసిన అఖిల ఈ దఫా కూడా మహిళల కోటాలో తనకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. అలాగే నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్‌ కూడా మంత్రి వర్గంలో చోటుపై ఆశలపల్లకిలో ఉన్నారు. 1999లో మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉంది. మైనార్టీ నేత కావడం, రాయలసీమలో మదనపల్లి, నంద్యాల మాత్రమే మైనారీ్టలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇద్దరూ గెలుపొందినా వీరిలో ఫరూక్‌ సీనియర్‌ కావడంతో మైనార్టీ కోటాలో కచ్చితంగా చోటు దక్కుతుందనే ఆశతో ఉన్నారు.

పార్థసారథిని అదృష్టం వరించేనా? 
కర్నూలు జిల్లాలో తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఆదోని నుంచి పార్థసారథి గెలుపొందారు. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈయనకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. కర్నూలు, అనంతపురంలో బలమైన సామాజికవర్గంగా వాల్మీకులు, కురబలు ఉన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, గుంతకల్లులో కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం ఉన్నారు. వీరిద్దరికీ మంత్రి పదవుల అనుభవం ఉంది. అయితే అనంతపురం జిల్లాలో పోటీ ఎక్కువగా ఉంది.

కురబ, వాల్మీకులకు చెరో మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవితకు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాలవ, గుమ్మనూరు, పార్థసారథిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఒక బీసీకి అనంతపురంలో ఇస్తే, మరో బీసీకి ఇచ్చే అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఈక్రమంలో వాల్మీకి వర్గం నుంచి పార్థసారథిని మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

పైగా ఇతను బీజేపీ నేత కావడంతో.. ఆ పారీ్టకి కూడా కనీసం 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండటంతో పార్థసారథికి అదృష్టం వరించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా కర్నూలు, నంద్యాల జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కూటమి అభ్యర్థుల్లో దాదాపు సగం మంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎవరికి అమాత్యయోగం ఉందో వేచిచూడాలి.

టీజీ, కేఈలు కూడా మంత్రివర్గంపై ఆశలు..
సీనియర్‌ నేతలతో పాటు తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్న కర్నూలు, పత్తికొండ ఎమ్మెల్యేలు టీజీ భరత్, కేఈ శ్యాంబాబు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. టీజీ భరత్‌ ఆర్యవైశ్యుల కోటాలో తనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా తనను గెలిపించాలని, ఈ దఫా తాను మంత్రిని కాబోతున్నానని పలువురు ప్రముఖులతో బాహాటంగానే చెప్పారు.

భరత్‌ గెలుపొందిన తర్వాత టీజీ వర్గం కూడా కేబినెట్‌ బెర్త్‌ దక్కుతుందని చర్చించుకుంటున్నారు. అలాగే కేఈ శ్యాంబాబు కూడా కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతీ కేబినెట్‌లోనూ కేఈ కుటుంబం ఉంది. కేఈ ప్రభాకర్, కేఈ కృష్ణమూర్తి మంత్రులుగా చేశారు. 2014లో డిప్యూటీ సీఎంగా కూడా కేఈ కృష్ణమూర్తి కొనసాగారు. బీసీ కోటాలో తనకు చోటు దక్కుతుందని శ్యాంబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి చదవండి: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh Politics
AP Politics
kurnool
tg bharath
TDP
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.