Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఆత్మ విశ్వాసమా.. బలహీనతా?.. ఒకేసారి 115 మందితో బీఆర్‌ఎస్‌ జాబితాపై చర్చ 
ADVERTISEMENT 

ఆత్మ విశ్వాసమా.. బలహీనతా?.. ఒకేసారి 115 మందితో బీఆర్‌ఎస్‌ జాబితాపై చర్చ 

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 24, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BRS_20PARTI.jpg

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలకుపైగా గడువున్నా.. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ముందస్తుగా ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముందుగా, ఒకేసారి అభ్యర్థులను వెల్లడించడంలో కేసీఆర్‌ ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని ఓవైపు హర్షం కనిపిస్తుండగా.. ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 40 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం బలహీనతేనని మరోవైపు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్పులు చేయడానికి అవకాశమున్నా మెజారిటీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే తిరిగి అవకాశం ఇవ్వడంపై పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.

దళితబంధులో 30శాతం ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ స్వయంగా సీఎం కేసీఆర్‌ చెప్పిన నేపథ్యంలో.. ఇప్పుడు అందరికీ టికెట్‌ కేటాయించడం ఏమిటనే సందేహాలు వస్తున్నాయి. గెలుపు గుర్రాలు కాని వారికి కూడా ఒత్తిళ్లు, లాబీయింగ్‌కు తలొగ్గి టికెట్లు కేటాయించి కేసీఆర్‌ బలహీనత చాటుకున్నారనే విమర్శలూ వస్తున్నాయి. 



సామాజిక సమతుల్యతపై.. 

బీఆర్‌ఎస్‌ టికెట్ల కేటాయింపులో సామాజిక సమతుల్యతను పాటించలేదని, మహిళలకు కనీసం పది సీట్లయినా కేటాయించకపోవడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో 54శాతానికిపైగా ఉన్న బలహీనవర్గాలకు కేవలం 20శాతం సీట్లు కేటాయించడం సరికాదని ఆయా సామాజిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఇదే సమయంలో 15శాతం కూడా లేని అగ్రవర్ణాలకు ఏకంగా 50శాతానికిపైగా సీట్లను కేటాయించడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. గతంలో బీసీలకు కేటాయించిన హుజూరాబాద్, కామారెడ్డి స్థానాలను సైతం ఈసారి అగ్రవర్ణాలకు కేటాయించడమేంటని మండిపడుతున్నాయి. వందల సంఖ్యలో ఉన్న బీసీ కులాల్లో కేవలం ఆరు కులాలకే ప్రాతినిధ్యం దక్కడం, ఇందులోనూ మున్నూరు కాపు మినహా మిగతా కులాలకు నామమాత్రంగానే టికెట్లు ఇవ్వడంపై పెదవి విరుస్తున్నాయి.

ఎస్సీ, ఎస్టీలను కేవలం రిజర్వుడు స్థానాలకే పరిమితం చేశారని విమర్శలు వస్తున్నాయి. ముస్లింలకు మూడు సీట్లు ఇచ్చినట్టు కనిపిస్తున్నా.. బోధన్‌ మినహా మిగతా రెండు స్థానాలను పార్టీకి ఏమాత్రం పట్టులేని హైదరాబాద్‌ పాతబస్తీలో కేటాయించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక టికెట్‌ తిరస్కరణకు గురైన వారిలో ఎస్టీలే ఎక్కువగా ఉండటంపైనా విమర్శలు వస్తున్నాయి. 

 

మహిళలకు కేటాయింపులు ఇంతేనా? 

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న బీఆర్‌ఎస్‌.. ప్రస్తుత జాబితాలో నాలుగు శాతమే సీట్లు కేటాయించిందని రాజకీయవర్గాలు, మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. 115 మంది జాబితాలో ఏడుగురే మహిళలకు చోటు కల్పించడం ఏ విధమైన పురోగతి అని మండిపడుతున్నాయి. చట్టసభల్లో 33శాతం సీట్లు కేటాయించాలంటూ బీఆర్‌ఎస్‌ ఢిల్లీలో ధర్నా, నిరసనలు నిర్వహించిందని గుర్తు చేస్తున్నాయి. 

 

అసంతృప్తిలో ‘బహుళ’నాయకత్వం! 

రాష్ట్ర ఏర్పాటు తర్వాత విపక్షాలకు చెందిన కొందరు ముఖ్య నేతలు బీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత 20 మందికిపైగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ గూటికి చేరుకోగా.. 2018 ఎన్నికల తర్వాత ఇలా 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. ఉద్యమ సమయంలో మొదలుకుని ఇప్పటిదాకా.. వివిధ పారీ్టల నుంచి వచ్చిన చేరిన నేతలతో 40కి పైగా నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వ సమస్య మొదలైంది.

చాలా మంది ఎమ్మెల్యే టికెట్లు ఆశించి వచ్చినవారు ఉన్నారు. కానీ 2018లో, ఇప్పుడు కూడా దాదాపుగా సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇవ్వడం.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేతల్లో నిరాశను మిగిలి్చంది. 40కిపైగా స్థానాల్లో టికెట్లు ఆశించిన నేతలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రయోజనాల పేరిట తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక 30మందికిపైగా నేతలు తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరినా బీఆర్‌ఎస్‌ పెద్దలు స్పందించకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. 

  

సర్వేల ఆధారంగానే టికెట్లేవి? 


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకు ప్రాధాన్యతనిస్తామని కేసీఆర్‌ చెప్పినా.. పనితీరు, సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని పలుమార్లు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని కూడా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి నుంచే ఎన్నికల సన్నద్ధతను ప్రారంభించి.. నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తున్నట్టు ప్రకటించారు.

పలుమార్లు పార్టీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్‌ స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలక నేతలు, కేడర్‌ను కలుపుకొనిపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల బంధుప్రీతి, అవినీతి, సొంత పార్టీ కేడర్‌పైనే వేధింపులు, పోలీసు కేసులు వంటి ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఇలాంటిది సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇవ్వడమంటే.. సర్వేలు, పనితీరును పక్కనపెట్టేసినట్టేనా అని బీఆర్‌ఎస్‌లోని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
BRS
Assembly election
KCR
Candidates
Assembly tickets
TS Assembly Top Stories
Hyderabad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.