Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు..: బీవీ రాఘవులు
ADVERTISEMENT 

లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు..: బీవీ రాఘవులు

Politics Sakshi User Sakshi Sakshi Time Sep 23, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
raghavulu.jpg

కల్తీ జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్య తీసుకోవాలి

ఆ అంశాన్ని కులమతాలకు ఆపాదించి లౌకికతత్వాన్ని దెబ్బతీయకూడదు

ఏకత్వం పేరుతో దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం

ఏచూరి సంతాప సభలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు 

సనాతన ధర్మం గురించి ఆ పెద్దమనిషికి తెలుసా? అంటూ పవన్‌పై పరోక్ష వ్యాఖ్యలు  

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు తేలితే దోషులను పట్టుకుని శిక్షించాలిగానీ, దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. లడ్డూలో వాడే శనగపిండి, పంచదార ఏ కల్తీ అయినా మనకు పుణ్యం తీసుకురావని, పాపమే తెస్తాయన్నారు. ఈ అంశాన్ని కులమతాలకు అంటగట్టకుండా లౌకికత­త్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నేతలపై ఉందని హితవు పలికారు. 

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య (ఎంబీ)భవన్‌లో ఆదివారం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ.. సనాతన ధర్మం బోర్డు పెట్టాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడని, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో అయన్ని చెప్పమనండి అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రాఘవులు ప్రశ్నించారు. 

సనాతన ధర్మం గురించి సీతారాం ఏచూరి పెద్ద పుస్తకమే రాశారని, సనాతన ధర్మంలో కీలకం కుల వ్యవస్థ అని, కులంపై అభిమానం ఉన్నవాళ్లు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతారన్నారు. కుల వ్యవస్థ శ్రమకు, సాటి మనిషికి గౌరవం ఇవ్వదన్నారు. అలాగే, కుల వ్యవస్థను తీసేస్తే సనాతన ధర్మం ఉండదని, అది ఆధునిక ధర్మం అవుతుందన్నారు. 

ఈ దేశం ప్రపంచ దేశాల సరసన నిలబడాలంటే కుల, మత వ్యవస్థను తొలగించాలని  రాఘవులు తేల్చిచెప్పారు. కేంద్రంలోని బీజేపీ వంటి మతతత్వ శక్తుల కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటివి ప్రమాదంలో పడిపోయాయని, ఈ తరుణంలో సీతారాం ఏచూరి వంటి నాయకులు లేకపోవడం దేశానికి పెద్ద లోటన్నారు.

ఒకే దేశం.. ఒకే ఎన్నికతో అనర్థాలు..
తాజాగా.. కేంద్ర మంత్రివర్గం ఒకే దేశం, ఒకే ఎన్నికకు ఆమోదం తెలిపిందని, ఈ నినాదం బాగుందని అనుకోవద్దని, దీనివల్ల ఏకత్వం మాటెలా ఉన్నా దేశంలో ప్రాంతాల వారీ తగదాలకు, విభజనకు దారితీస్తుందని రాఘవులు ఆందోళన వ్యక్తంచేశారు. అధ్యక్ష తరహా పాలనను గతంలో ప్రతిపాదించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఒకే ఎన్నిక అంటోందన్నారు. 

140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదం ఉండాలని, మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదని రాఘవులు అభిప్రాయపడ్డారు.  ఇక కామన్‌ సివిల్‌కోడ్‌ గురించి మనమంతా మాట్లాడుకుంటుంటే సాక్షాత్తు ప్రధానమంత్రే కమ్యూనల్‌ సివిల్‌కోడ్‌ తెస్తామని చెబుతున్నాడని.. ఇది ఏకత్వం కాదని, ఈ దేశం ఐక్యతను దెబ్బతీసే చర్యలని రాఘవులు విమర్శించారు.

సిద్ధాంతానికి కట్టుబడ్డ ఏచూరి..
మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలకు కట్టుబడి దేశంలో పీడిత తాడిత వర్గాల కోసం ఆహర్నిశలు పోరాడిన యోధుడు సీతారాం ఏచూరి మన తెలుగు వాడు కావడం గర్వకారణమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి ‘రాజీనామా చేయండి’ అని డిమాండ్‌ చేసిన ధైర్యశాలి సీతారాం అన్నారు. 1984లో ఎన్టీఆర్‌ను గద్దె దింపినప్పుడు, ఆయన్ను మళ్లీ సీఎం పీఠం ఎక్కించడానికి రాష్ట్రంలోను, ఢిల్లీలోను సీతారాం చేసిన కృషి ఎనలేనిదన్నారు.

ఉత్తమ పార్లమెంటేరియన్‌ మన ఏచూరి : అంబటి
మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేదల కోసం పోరాడే శక్తి అని, అటువంటి పార్టీలో నిబద్ధతతో రాటుదేలి రాణించడమే కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీతారాం ఏచూరి మన తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. భారత పార్లమెంట్‌లో ఆయన పెట్టిన సవరణలు ఆమోదించేలా పోరాడిన సీతారాం ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారన్నారు. 

సీతారాం మరణం భారత రాజకీయాలకు తీరనిలోటని, ఆయనకు ఘనంగా నివాళి అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు వచ్చానని అన్నారు. జీవితాన్నే ఉద్యమానికి అంకితం చేసిన సీతారాంకు తమ నాయకుడు జగన్‌ తరఫున, తన తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నానని రాంబాబు పేర్కొన్నారు. 

సభలో ఇంకా మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ కూడా మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని సీతారాం చిత్రపటానికి అంజలి ఘటించారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
CPM
BV Raghavulu
tirumala
Srivari Laddu
sitaram yechury
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.