Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. Shashi Tharoor: స్వరం మార్చిన కాంగ్రెస్‌ ఎంపీ!
ADVERTISEMENT 

Shashi Tharoor: స్వరం మార్చిన కాంగ్రెస్‌ ఎంపీ!

Politics Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Shashi-Tharoor-Congress-Rif.jpg

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ పార్టీలో విభేదాలపై స్వరం తగ్గించారు. గురువారం నీలంబూర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరగ్గా.. ఆ ఎన్నిక ప్రచారానికి థరూర్‌ దూరంగా ఉండడంపై మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన పార్టీ నుంచి పిలుపు లేకపోవడం వల్లే దూరంగా ఉన్నానని చెబుతూనే.. అయినా అదేమీ పెద్ద విషయం కాదన్న రీతిలో మాట్లాడారు.

దౌత్య సంబంధమైన మిషన్‌ కోసం నేను విదేశాలు వెళ్లాను. తిరిగి వచ్చాక కూడా అధిష్టానం నుంచి నాకు ఫోన్‌ రాలేదు. కనీసం ప్రచారం చేయాలని కూడా నాకు సూచించలేదు. ఎన్నికల ప్రచారానికి పార్టీ నన్ను ఆహ్వానించలేదు. అయినా ఫర్వాలేదు. కొన్ని విషయాల్లో పార్టీ అధిష్టానంతో విభేదాలు ఏర్పడడం సహజమే అని అన్నారాయన.

నేను ఇవాళే కేరళకు వచ్చాను. ఇవాళ ఓటింగ్‌ రోజు(నీలంబూర్‌ ఉప ఎన్నికకు). మా పార్టీ అభ్యర్తి మంచి వ్యక్తి. ఆయనకు ఓటేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని గురువారం ఉదయం ఎయిర్‌పోర్టులో మీడియాతో ఆయన వ్యాఖ్యానించారు.

అయితే పార్టీతో విభేదాల నేపథ్యంతోనే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారా? అనే మీడియా ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు. గత నాలుగు ఎన్నికలుగా తిరువనంతపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తలు నా వెంటే ఉన్నారు. నా గెలుపు కోసం వాళ్లు తీవ్రంగా శ్రమించారు. రాజకీయాల్లో అధిష్టానంతో కొన్ని అంశాల్లో విభేదాలు తలెత్తడం సహజమే. అయితే అవి అంతర్గతంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోగలిగినవే. వాటి ఇప్పుడు చర్చించడం అప్రస్తుతం. సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. ఇలాంటివి సహజమే. కాంగ్రెస్‌ పార్టీ విలువలకు నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటాను’’ అని థరూర్‌ స్పష్టం చేశారు.  

Shashi Tharoor left out of Nilambur Congress rally | Kerala politics takes a turn #BusinessToday #ShashiTharoor #Congress #CongressVsBJP #KeralaPolitics #RahulGandhi pic.twitter.com/Hn6Rcr2mo4

— Business Today (@business_today) June 19, 2025

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి పాక్‌ ఉగ్ర​ స్థావరాలను, ఎయిర్‌బేస్‌లను భారత సైన్యం నాశనం చేసింది. ఆపై దౌత్యపరమైన యుద్ధాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే.. అఖిలపక్ష ఎంపీల బృందాన్ని పలు దేశాలకు పంపింది. కాంగ్రెస్‌ ప్రమేయం లేకుండా శశిథరూర్‌ను ఆ బృందంలోకి ఎంపిక చేసి కేంద్రంలోని బీజేపీ ఆశ్చర్యపరిచింది.

ఈ క్రమంలో.. విదేశీ పర్యటనల్లో పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎండగడుతూనే.. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిపిందంటూ థరూర్‌ ఆకాశానికెత్తారు. ఈ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో జరిగిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ను కూడా థరూర్‌ ప్రస్తావించి ఉంటే బాగుండేదని, మరీ బీజేపీ ఏజెంట్‌లా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కొందరు కీలక నేతలు సైతం థరూర్‌ లక్ష్మణరేఖ దాటారంటూ వ్యాఖ్యానించారు. అయితే తాను సందర్భానుసారం ఆ వ్యాఖ్యలు చేసినట్లు గుర్తిస్తే మంచిదంటూ కాంగ్రెస్‌ నేతలకు చురకలంటించారాయన. ఈ క్రమంలో ఆయనకు పార్టీకి మధ్య దూరం పెరుగుతోందని అంతా భావించారు. అయితే తిరిగి స్వదేశానికి చేరుకున్న ఆయన.. ఆ విభేదాలు నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోగలిగనవే అని వ్యాఖ్యానించడం కొసమెరుపు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
shashi tharoor
Congress Party
differences
Operation Sindoor
National News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు!

టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు!

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.