Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. Telangana: బస్సు రూట్‌లో కాంగ్రెస్‌
ADVERTISEMENT 

Telangana: బస్సు రూట్‌లో కాంగ్రెస్‌

Politics Sakshi User Sakshi Sakshi Time Jul 20, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
revanth.jpg

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా కలసికట్టుగా ముందుకెళ్లాలని, అంతా ఐక్యంగా ఉన్నామని ప్రజలకు తెలియజెప్పేందుకు రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర చేపట్టాలని టీపీసీసీ కీలక నేతలు నిర్ణయించారు. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో చర్చించాకే నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక నేతలు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.



కోమటిరెడ్డి ఆహ్వానం మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ కో–చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్య నేతలు ఎం.కోదండరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, బి.మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్, త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు ఈ లంచ్‌ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రాష్ట్ర పార్టీలోని అంతర్గత పరిణామాలపై చర్చించారు. 



దూకుడుగా వెళ్లాల్సిందే.. 

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్, బీజేపీలపై రాజకీయ దాడులు చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పక్షాన సఫలీకృతం అవుతున్నామని.. ఇక మీద ఈ దూకుడు మరింత పెంచాలని భేటీలో నేతలు నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా నేతలంతా కలసి పనిచేస్తున్నారన్న భావన కలిగించాలని, ఇందుకోసం ఐక్యంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. యాత్రలో ఎవరెవరు పాల్గొనాలి? ఎప్పట్నుంచి ఎప్పటి వరకు, ఏ రూట్లో యాత్ర నిర్వహించాలన్న దానిపై ఈనెల 22న లేదా 23న పీఏసీ సమావేశం నిర్వహించి ఖరారు చేయాలని అభిప్రాయానికి వచ్చారు. 



అన్ని నియోజకవర్గాల్లో సర్వే.. 

ఎన్నికల కోసం అభ్యర్థుల ఖరారు అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేయించాలని నేతలు నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీలు, అభ్యర్థుల బలాబలాలతోపాటు ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గం ఎంత మేర ప్రభావం చూపుతుందన్న అంశాలపై పక్కా అవగాహనకు వచ్చేలా సర్వే ఉండాలని.. త్వరగా దానిని ప్రారంభించాలని తీర్మానించారు.



ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, కాంగ్రెస్‌ హామీలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా ప్రచారం చేయాలని.. ప్రధానమైన అంశాలను ఎంచుకుని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అభిప్రాయానికి వచ్చారు. ఇక కొత్తగా పార్టీ చేరే వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యే టికెట్లపై ఆశలు పెట్టుకుని వస్తున్నారని.. బేషరతుగా పార్టీలో చేరాలనుకున్న వారికే అవకాశం ఇవ్వాలని, ఎన్నికల సమయంలో సమర్థులకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు.



మరోవైపు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరే సందర్భంగా చేపట్టే బహిరంగసభ కోసం ఈనెల 30వ తేదీలోపు తేదీని ఖరారు చేసేలా ఢిల్లీ పెద్దలతో మాట్లాడాలని, ప్రియాంకా గాంధీ సమయం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఠాక్రే, రేవంత్‌ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. 



బీఆర్‌ఎస్‌ నుంచి బీసీని సీఎం అభ్యర్థి ప్రకటిస్తారా? 

– ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్‌ 

– బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్‌ మాత్రమేనని వ్యాఖ్య 


రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీనేనని, బీసీల గురించి తమకు బీఆర్‌ఎస్‌ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీని పీసీసీ చీఫ్‌ చేసిందని, బీఆర్‌ఎస్‌కు దమ్ముంటే బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్‌ చేశారు. బుధవారం తన నివాసంలో కీలక నేతలతో భేటీ అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు.



మంత్రి తలసాని విమర్శలకు రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారే తప్ప బీసీలను కించపర్చేలా మాట్లాడలేదని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని చాటేందుకే ఈ భేటీ నిర్వహించామని చెప్పారు. మీటింగ్‌లో చర్చించిన అంశాలన్నీ బయటికి వెల్లడిస్తే నాలుగు నెలల తర్వాత ఖాళీ కావాల్సిన ప్రగతిభవన్‌ ఇప్పుడే ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Congress Party
Revanth Reddy
Bhatti Vikramarka Mallu
Manik Rao thackeray
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

‘ఆనాడు మీరు నాటిన మొక్క ఇప్పుడు ఇలా’

‘ఆనాడు మీరు నాటిన మొక్క ఇప్పుడు ఇలా’

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

మెట్రోపై సానుకూలం

మెట్రోపై సానుకూలం

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.