Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. Congress Party: హస్తినలో పాలమూరు పంచాయితీ!
ADVERTISEMENT 

Congress Party: హస్తినలో పాలమూరు పంచాయితీ!

Politics Sakshi User Sakshi Sakshi Time Oct 12, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
congress_0.jpg

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరిధిలో అసెంబ్లీ టికెట్లపై పంచాయితీ ముదిరింది. దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేస్తున్న తమకే టికెట్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ వాదులు.. గెలుపు అవకాశాలున్న తమకే టికెట్లు కావాలంటూ వలస నేతలు ఎవరికి వారు గట్టిగా పట్టుబట్టడంతో ఈ వ్యవహారం ఢిల్లీలో హైకమాండ్‌ పెద్దలకు చేరింది. ఉమ్మడి పాలమూరు నేతలు దీనిపై వరుసగా ఫిర్యాదులు చేస్తుండటంపై పార్టీ పెద్దలు స్పందించినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై పునఃపరిశీలన చేయాలని ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు బృందాన్ని ఆదేశించినట్టు సమాచారం. 



పార్టీకి సేవ చేసినవారికి గుర్తింపేదీ? 

అభ్యర్థుల ఎంపికపై పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ ప్రతి భేటీలోనూ కాంగ్రెస్‌ వాదులు, వలసవాదులు అన్న పంచాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్యారాచూట్లకు టికెట్ల కేటాయింపుపై ఆచితూచి వ్యవహరించాలని సీనియర్‌ నేతలు ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. వారికే 60 శాతానికిపైగా సీట్లిస్తే తొలినుంచీ కాంగ్రెస్‌లో ఉన్నవారిలో నైరాశ్యం నెలకొంటుందని, పార్టీకి పనిచేసేవారు కరువవుతారని వారు స్పష్టం చేస్తున్నారు.

పార్టీ అధికారంలోకి వస్తే సరేగానీ, రానిపక్షంలో ప్యారాచూట్లంతా ఎగిరిపోవడం ఖాయమ ని.. అదే జరిగితే పార్టీ ప్రాథమిక నిర్మాణా నికే ముప్పు ఉంటుందని పేర్కొంటున్నారు. అయినా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ని సగానికిపైగా సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. 



ఏడింటిలో ఐదు వారికే అయితే.. 

♦ నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో ఐదింటిని ప్యారాచూట్‌ నేతలకే ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కల్వకుర్తిలో ఇటీవల పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్‌ ఫైనల్‌ కానుందని.. స్థానిక నేత చల్లా వంశీచంద్‌రెడ్డిని ఒప్పించాకే ఇక్కడ టికెట్‌ కేటాయింపుపై ముందుకు వెళ్తుండటంతో వివాదం లేదని చెప్తున్నాయి. 



♦  నాగర్‌కర్నూల్‌లో సీనియర్‌ నేత నాగం జనార్దనరెడ్డిని కాదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డికి టికెట్‌ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై నాగం వర్గం నేతలు ఇటీవలే గాం«దీభవన్‌లో గొడవ చేశారు కూడా. టికెట్‌ విషయంలో నాగం స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సహా ఇతర పెద్దలకు ఫిర్యాదు చేశా రు. బీఆర్‌ఎస్‌ అక్రమాలపై, ప్రాజెక్టుల్లో అవినీతిపై బలంగా పోరాడుతున్న తన ను పక్కనపెట్టే ప్రయత్నాలపై హైకమాండ్‌ వద్దే తేల్చుకోవాలని భావిస్తున్నారు. 



♦ వనపర్తిలో పార్టీ సీనియర్‌ నేత జి.చిన్నారెడ్డికి ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన మేఘారెడ్డికి టికెట్‌ ఇవ్వొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనితో చిన్నారెడ్డి ఢిల్లీ వెళ్లి కేసీ వేణుగోపాల్‌ సహా ఏఐసీసీ స్థాయిలో తనకు సన్నిహితంగా ఉండే పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఆయన స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులనూ కలిసినట్టు సమాచారం. 



♦  బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడంపై తొలి నుంచీ అసంతృప్తితో ఉన్న కొల్లాపూర్‌ నేత జగదీశ్వర్‌రావు సైతం ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌ పెద్దలను కలిశారు.  



♦ గద్వాలలో బీఆర్‌ఎస్‌ జెడ్పీచైర్మన్‌ సరితా తిరుపతయ్యకు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కిందన్న ప్రచారంతో రగిలిపోతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, ఓయూ విద్యార్థి నేత కురువ విజయకుమార్‌లు కూడా ఖర్గే, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, నజీర్‌ హుస్సేన్, జిగ్నేశ్‌ మేవానీ, ముకుల్‌వాస్నిక్‌లను కలిశారు. కేవలం మూడు నెలల ముందు పార్టీలో చేరిన సరితకు టికెట్‌ ఇవ్వొద్దని, తమలో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 



♦  మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని మక్తల్‌లో పదిహేను రోజుల కింద కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్తకోట సిద్ధార్థరెడ్డికి వ్యతిరేకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు వాకాటి శ్రీహరి ఢిల్లీలోనే మకాం వేశారు. 



♦ మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ నుంచి వచ్చిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ.. స్థానిక నేతలు ఒబేదుల్లా కొత్వాల్, సంజీవ్‌ ముదిరాజ్, ఎన్‌పీ వెంకటేశ్‌ తదితర నేతలు అభ్యంతరాలు చెప్తున్నారు. 



♦  ఇన్ని పంచాయితీల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పునః పరిశీలన చేయాలని సునీల్‌ కనుగోలు టీమ్‌కు హైకమాండ్‌ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. ఆయా స్థానాల్లో ఇతర అభ్యర్థుల బలాబలాలపై బేరీజు వేయాలని సూచించినట్టు సమాచారం.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Congress Party
tickets
palamuru village
selection of candidates
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.