Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఎల్బీ స్టేడియం లేదా ఓఆర్‌ఆర్‌ సమీపంలో
ADVERTISEMENT 

ఎల్బీ స్టేడియం లేదా ఓఆర్‌ఆర్‌ సమీపంలో

Politics Sakshi User Sakshi Sakshi Time Sep 6, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gandhibhavan.jpg

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నిర్వహణకు ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో అనుమతి లభించదనే అంచనాలతో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యామ్నాయా లను పరిశీలిస్తోంది. పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహణకు అనుమతివ్వాలని ఈనెల 2వ తేదీనే దరఖాస్తు చేసినప్పటికీ బీజేపీ నేతలు అమిత్‌షా సభ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియం లేదంటే ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పరి సరాల్లోని ఖాళీ స్థలం ఎంచుకుని అక్కడ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.

తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీ చేత ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటించాలనే వ్యూహంతో పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కానీ, అక్కడ ఇప్పటివరకు అనుమతి లభించని కారణంగా మరో స్థలం వెతికే పనిలో కాంగ్రెస్‌ నేతలు పడ్డారు. సభ ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.



సీడబ్ల్యూసీకి సిద్ధం

మరోవైపు, ఈనెల 16,17 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేసింది. ఈ సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కూడా టీపీసీసీ నిర్ణయించింది. గతంలో తిరుపతిలో నిర్వహించిన ప్లీనరీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సీడబ్ల్యూసీ సమావేశాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు గాను పకడ్బందీగా ముందుకెళుతోంది.

ఇందుకోసం మంగళవారం సాయంత్రం గాంధీభవన్‌లో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్, పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, ఇన్‌చార్జి ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్, రాష్ట్ర నాయకులు మధుయాష్కీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించేందుకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధం చేయనున్నారు. 



నేడు కీలక భేటీ

ఇక, టికెట్ల ఖరారులో భాగంగా రాష్ట్రస్థాయిలో జరిగే కసరత్తుకు నేడు తెరపడనుంది. బుధవారం గాంధీభవన్‌ వేదికగా పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌తో పాటు సభ్యులు సిద్ధిఖీ, మేవానీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. వీరంతా సమావేశమై పీఈసీ సమావేశంలో వచ్చిన నివేదికలను పరిశీలించి రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన అభ్యర్థుల తుది జాబితాను ఢిల్లీకి పంపనున్నారు.

అయితే, స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి ఈనెల 7వ తేదీనే పంపనున్నట్టు తెలుస్తోంది. అనంతరం సీఈసీ సమావేశమై అధికారికంగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనుంది. మొత్తంమీద గత 20 రోజులుగా పార్టీ అభ్యర్థిత్వాల కోసం జరుగుతున్న కాంగ్రెస్‌ కసరత్తు బుధవారం నాటితో రాష్ట్ర స్థాయిలో ముగియనుంది. మరోవైపు బీసీ డిక్లరేషన్‌ కమిటీ సమావేశం కూడా నేడు జరగనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న ఈ సమా వేశంలో బీసీ డిక్లరేషన్‌లో పొందుపర్చాల్సిన హామీలను ఖరారు చేయనున్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
CWC
Parade Grounds
Congress Party
ORR
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

పరేడ్‌ గ్రౌండ్స్‌లో యోగా డే వేడుకలు.. ప్రముఖుల ఆసనాలు (ఫొటోలు)

పరేడ్‌ గ్రౌండ్స్‌లో యోగా డే వేడుకలు.. ప్రముఖుల ఆసనాలు (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.