Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. వాదనలు అనవసరం!
ADVERTISEMENT 

వాదనలు అనవసరం!

Politics Sakshi User Sakshi Sakshi Time Jul 7, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
babu_0.jpg

ఏపీ సీఎస్, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్, భట్టి స్పష్టీకరణ

వివాదాల పరిష్కారం కోసమే సమావేశమయ్యాం

కూర్చుని పరిష్కరించుకుందాం.. కమిటీలు వేసుకుందామని సూచన

ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పరస్పరం గౌరవించుకునేలా ప్రొటోకాల్‌ అమలుకు నిర్ణయం

ఆస్తుల పంపకాలు, విద్యుత్‌ బకాయిలను ప్రస్తావించిన ఏపీ సీఎస్‌

టీటీడీలో, కోస్తా తీర ప్రాంతంలో వాటాల అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ సీఎస్‌

తిరిగి వెళ్లే సమయంలో చంద్రబాబు, రేవంత్‌ మధ్య ముచ్చట్లు

సాక్షి, హైదరాబాద్‌: ‘విభజన’ సమస్యలకు సంబంధించి వాదనలు అనవసరమని.. వివాదాల పరి ష్కారం కోసమే సమావేశం ఏర్పాటు చేసుకున్నా మని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్, అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేసినట్టు తెలిసింది. వాదనలతో కాకుండా చర్చలతోనే పెండింగ్‌ సమస్యలను పరిష్కరించుకుందామని పేర్కొన్నట్టు సమాచారం. విభజన సమస్యల పరిష్కారం ఎజెండాగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, మంత్రులు, అధికారులు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు తొలుత మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం తాను లేఖ రాసిన వెంటనే సానుకూలంగా స్పందించి సమావేశం ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ముందుకు రావడం పట్ల రేవంత్‌రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

కూర్చుని పరిష్కరించుకుందాం..
ఎజెండాలో భాగంగా తొలుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను వివరించారు. 9, 10వ షెడ్యూళ్లలోని అంశాలు, తెలంగాణ పరిధిలో ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల ఆస్తుల పంపకాలు, విద్యుత్‌ బకాయిలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజన అంశాన్ని ప్రస్తావించగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. వివాదాల పరిష్కారం కోసమే సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాదనలు అనవసరమని స్పష్టం చేశారు. ఏదైనా కూర్చొని పరిష్కరించుకోవాలని రేవంత్‌తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఉద్యోగుల విభజన, ఏడు విలీన మండలాలు, భద్రాచలం పరిధిలోని 5 గ్రామాల అంశం, టీటీడీలో, కోస్తా తీర ప్రాంతంలో వాటాలు, ఏపీలోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపకాలు మొదలైన అంశాలను ప్రస్తావించారు. చివరగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ సీఎస్‌ల ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ, మంత్రుల ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పరస్పరం గౌరవించుకునే విధంగా ప్రొటోకాల్‌ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు.


సాదర స్వాగతంతో.. మనసారా నవ్వుకుంటూ..
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజాభవన్‌కు చేరుకోగా.. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సాదరంగా స్వాగతం పలికారు. సమావేశ మందిరంలోకి వెళ్లిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబును సీఎం రేవంత్‌ శాలువాతో సత్కరించి.. కాళోజీ రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. నంది జ్ఞాపికను అందజేశారు. తర్వాత చంద్రబాబు సీఎం రేవంత్‌కు శాలువా కప్పి సత్కరించి, వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన విందులో హైదరాబాదీ దమ్‌ బిర్యానీతోపాటు ఆమ్లెట్లు, చేపల కూర వంటి వంటకాలను వడ్డించారు. తిరిగి వెళ్లే సమయంలో రేవంత్, చంద్రబాబు ముచ్చట్లాడుకుంటూ కనిపించారు. ఏదో అంశం ప్రస్తావనకు రాగా నవ్వుకుంటూ బయటికి వచ్చారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Chandrababu Naidu
Revanth Reddy
Telangana
Andhra Pradesh
Pending issues
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.