Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. చంద్రబాబు, పురందేశ్వరి స్కెచ్‌.. ‘కళా’ కుటుంబంలో కుంపటి
ADVERTISEMENT 

చంద్రబాబు, పురందేశ్వరి స్కెచ్‌.. ‘కళా’ కుటుంబంలో కుంపటి

Politics Sakshi User Sakshi Sakshi Time Mar 26, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Kimidi-Kala-Venkata-Rao.jpg

టీడీపీ నేత కిమిడి కళావెంకటరావు ఇంట చంద్రబాబు చిచ్చు

పురందేశ్వరితో కలిసి ఆడిన ఆటలో పావుగా కళా

ఎచ్చెర్లలో ‘తమ’ నాయకుడికి టికెట్‌ కోసం పురందేశ్వరి, బాబు స్కెచ్‌

ఎచ్చెర్లలో వెంకటరావు పనికిరాడంటూ ముద్ర

గంటా వద్దన్న చీపురుపల్లి టికెట్‌ కళాకు ఆఫర్‌

సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కుటుంబంలో చంద్రబాబు చిచ్చు రగిల్చారు. సొంత పార్టీ అధ్య­క్షుడు చంద్రబాబు, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడుతున్న రాజ­­కీ­య ఆటలో కళా వెంకటరావు పావుగా మా­రారు. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గం నుంచి ఉత్తరాంధ్రలో వేగంగా ఎదిగిన ఆయన ఇప్పుడు టికెట్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు­చూడాల్సిన దుస్థితి.

గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని వెంకటరావుకు చంద్రబాబు ఆఫర్‌ ఇస్తూనే, మరోవైపు అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కళా సోదరుడి కుమారుడైన కిమిడి నాగార్జున ఆశలపై నీళ్లు చల్లారు. విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా, మళ్లీ చీపురుపల్లిలో పార్టీని బతికించేందుకు ఐదేళ్లుగా కృషి చేస్తే తుదకు కరివేపాకులా తీసిపారేస్తున్నారంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరం లోక్‌సభ ఆశ చూపించి

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కళా వెంకట­రావు ఎచ్చెర్ల నియోజకవర్గాన్నే నమ్ముకు­న్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. సహచర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నారా లోకేశ్‌కు సన్నిహితుడిగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు. అయితే, ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పనికిరాడంటూ టీడీపీ అధిష్ఠానమే ఇప్పుడు ముద్ర వేస్తోంది.

ఇందుకు ఐవీఆర్‌ఎస్‌ సర్వే కారణం చూపిస్తోంది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తారంటూ లీకులు ఇచ్చింది. అక్కడ వెంకటరావు సోదరుడు, ప్రస్తుత నియోజక­వర్గ పార్టీ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున టికెట్‌ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు చీపు­రు­పల్లికి వెంకటరావును పేరును తేవడంతో కిమిడి కుటుంబంలో అగ్గిరాజుకుంది. తీవ్ర అసంతృప్తికి లోనైన నాగార్జున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నెల కిందటి వరకు నాగార్జున, మూడు రోజుల కిందటి వరకు గంటా శ్రీనివాస­రావు, తాజాగా కళా వెంకటరావు.. ఇలా రోజుకో పేరును టీడీపీ అధిష్టానం తెరమీదకు తెస్తుండడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. దీన్ని చక్కదిద్దడానికి  కళా వెంకటరావు పేరు విజయనగరం ఎంపీ అభ్య­ర్థిగా పరిశీలిస్తున్నట్టు తాజాగా లీకులు ఇస్తున్నారు.

ఫలించిన పురందేశ్వరి స్కెచ్‌

నడికుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) ఇటీవలి వరకూ ఎచ్చెర్లలో గ్రామస్థాయి నాయకుడు. చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతో 2014–19 మధ్య కాస్త హవా చూపించారు. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంపై కన్నేసిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొని, పురందేశ్వరి పంచన చేరారు. ఆమె చలువతో విజయ­నగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవీ దక్కించుకు­న్నారు. ఇక్కడ బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి పావనిని తప్పించి మరీ ఈశ్వరరావుని జిల్లా అధ్యక్షుడిని చేశారు.

ప్రస్తుత ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్‌ నేరుగా ఎన్‌ఈఆర్‌కు ప్రకటించకుండా నెమ్మదిగా స్కెచ్‌ అమలుచేశారు. తొలుత శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కోటాలో చూపించారు. అక్కడ గుండ లక్ష్మీదేవి కుటుంబం ఆందోళన చేయడంతో అది టీడీపీకే ఇచ్చేసి పొరుగున ఉన్న ఎచ్చెర్ల బీజేపీ కోటాలో వేసేశారు. తద్వారా ఎచ్చెర్ల టికెట్‌ తనదేనని ధీమాగా ఉన్న కిమిడి కళావెంకటరావు ఆశలపై నీళ్లు చల్లేశారు. ఇప్పుడు ఎన్‌ఈఆర్‌ను రంగంలోకి తెస్తున్నారు.

బాబు పితలాటకంతో నాగార్జున బలి 

చంద్రబాబు, పురందేశ్వరి పెట్టిన పితలాటకంతో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున బలవుతున్నారు. ఆయన తల్లి కిమిడి మృణాళిని 2014లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న నాగార్జున రాజకీయాలపై ఆసక్తితో ఇక్కడకు వచ్చి టీడీపీలో చేరారు. 2019లో ఓడిపోయారు. అయినప్పటికీ నాగార్జునకు భవిష్యత్‌ ఉందని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి నాగార్జున పనికిరాడంటూ చంద్రబాబు ముద్ర వేసేశారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
purandeswari
Kimidi Kala Venkata Rao
TDP
AP Politics
AP Elections 2024
Vijayanagam
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.