Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ‘జగన్‌కు మంచి పేరు వస్తుందనే ఇలా చేస్తున్నారు’
ADVERTISEMENT 

‘జగన్‌కు మంచి పేరు వస్తుందనే ఇలా చేస్తున్నారు’

Politics Sakshi User Sakshi Sakshi Time Nov 27, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
botsa1.jpg

సాక్షి, తాడేపల్లి: ప్రజా ఆరోగ్యం కోసం వైఎస్‌ జగన్ ఎంతో తపించి మెడికల్‌ కాలేజీల తీసుకొస్తే.. వాటిని చంద్రబాబు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ బృందం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. 

అనంతరం తాడేపల్లి పార్టీ కేంద్రకార్యాలయంలో బొత్స ఈ అంశంపై మాట్లాడారు. కోవిడ్‌ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాం. పేదలకు మేలు జరగాలనే వైఎస్‌ జగన్‌ మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చారు. వైద్య రంగాన్ని వైఎస్‌ జగన్‌ అభివృద్ధి చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం వైద్య రంగానికి నిధులు కేటాయించారు. 

ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. చంద్రబాబు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో కాలేజీలను పెట్టాలని చూస్తున్నారు. ఐదు కాలేజీలు మా హయాంలో పూర్తయ్యాయి. మిగతావి క్రమబద్దంగా పనులు జరుగుతున్నాయి. జగన్‌కు మంచి పేరు రాకూడదనే ప్రైవేటీకరణకు వెళ్తున్నారు. అవి పూర్తయితే జగన్ కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది.. 

..మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం. అన్ని‌ ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు మద్దతు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్‌ కాలేజీలు ప్రైవేట్‌ వాళ్ల చేతుల్లో ఉండకూడదు. అన్ని విషయాలు గవర్నర్‌కు వివరించాం. దీనిపై ఒక కమిటీని‌ పంపించి ర్యాండమ్ చెకింగ్ చేయమని కోరాం. ప్రైవేట్‌ వాళ్లు ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు?. లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి?. పేద పిల్లలు వైద్య విద్యని ఎలా చదవగలరు?. పీపీపీని వెనక్కు తీసుకునే వరకు మా‌ పోరాటం ఆగదు’’ అని బొత్స స్పష్టం చేశారు. 

ఇంకా బొత్స ఏమన్నారంటే.. 👉జగన్ హయాంలో రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందేలా చేశారు. చంద్రబాబుకు కోపం ఉంటే మాపై తీర్చుకోవాలి. అంతేగానీ పేదల మీద అంత కోపం ఎందుకు?. ఓటు వేసి గెలిపించిన పాపానికి అదే పేదల మీద కక్ష తీర్చుకోవటం న్యాయమేనా?. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. 

👉జగన్ హయాంలో ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. ట్యాబులు ఇస్తే విద్యార్థులు గేమ్ లు ఆడుకున్నారని మాక్ అసెంబ్లీలో చెప్పించారు. ఇలా పిల్లలతో చెప్పించటానికి కాస్తన్నా సిగ్గు ఉండాలి. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఇంగిత జ్ఞానం లేదు. ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటే స్పీకర్ తీసుకోవచ్చు. అంతేగానీ బాధ్యతలేని వ్యక్తి లాగా మాట్లాడటం సరికాదు

Botsa : జగన్ కు మంచి పేరు వస్తుందనే బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు

👉రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. ఏ వ్యవస్థ మీదా పర్యవేక్షణ లేదు. ఎల్లోమీడియాలో ఆహాఓహో అనిపించుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. రైతులు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతుంటే అసలే మాత్రం పట్టించుకోవటం లేదు. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి పట్టటంలేదు. ఆస్పత్రులలో సరైన వైద్యం అందటం లేదు. ఇలాంటి వాటి గురించి కూడా చంద్రబాబు పట్టించుకోవటం లేదు

👉రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు?. రాజ్యాంగంలో ప్రతిపక్షాన్ని పిలవవద్దని ఉందా?. ప్రతిపక్షం గురించి పట్టించుకోని ప్రభుత్వానికి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు

👉పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడితే ఒప్పా?. ఇంకొకరు మాట్లాడితే తప్పా?. పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. మరి ఆ తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు?. ఒక డీఎస్పీ అవినీతిపరుడుని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? అని బొత్స నిలదీశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
botsa satyanarayana
abdul nazeer
Medical Colleges Privatization
Chandrababu Naidu
YSRCP
AP Politics
YS Jagan Mohan Reddy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.