Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. బ్రో.. ఇది పెద్ద కుంభకోణం
ADVERTISEMENT 

బ్రో.. ఇది పెద్ద కుంభకోణం

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 1, 2023 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Ambati-rambabu3.jpg

సాక్షి, అమరావతి: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బ్రో కాదు.. మ్రో (మ్యారేజస్‌.. రిలేషన్స్‌.. అఫెండర్‌) అంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యంగోక్తులు విసిరారు. బ్రో సినిమా అట్టర్‌ ఫ్లాప్‌.. అతి పెద్ద డిజాస్టర్‌ అయ్యిందని.. కలెక్షన్లు పెంచుకోవడం కోసమే తనపై వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరో నిర్మాత డబ్బులు పెడితే..  దానిలో తన శత్రువుల పేర్లు పెట్టి దూషించి, పైశాచిక ఆనందం పొందాలనుకోవడం వల్లే బ్రో సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే రాంగోపాల్‌ వర్మలా రాజకీయ వ్యంగ్య చిత్రం తీసుకోవాలని.. కావాలంటే ఆ సినిమాకు సంబరాల రాంబాబు అని పేరు పెట్టుకోవాలని పవన్‌కు సూచించారు. తన పేరు పెట్టుకున్నందుకు డబ్బులు కూడా అడగనని తేల్చిచెప్పారు. ముసుగులో గుద్దులాటలో కమర్షియల్‌ సినిమా పేరుతో తనను కించపరిచేలా ఓ పాత్ర పెట్టి పవన్‌ కళ్యాణ్‌ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే.. 

పవన్‌ కళ్యాణ్‌ రెమ్యునరేషన్‌ కూడా వెనక్కి రాదు..

వినోదయా సీతం అనే తమిళ ఓటీటీ చిత్రాన్ని తీసుకుని తెలుగులో బ్రో పేరుతో భారీ బడ్జెట్‌తో ఒక చిత్రాన్ని విశ్వప్రసాద్‌ నిర్మించారు.  దీనిలో పవన్‌ కళ్యాణ్, సాయి ధర్మతేజ్‌ నటించగా సముద్రఖని దర్శకత్వం చేశారు. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ మాటలు రాశారు. 

సినిమాల గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితిని ఆ సినిమా తీసిన వాళ్లు కల్పించారు. ఈ సినిమాలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి...ఆ పాత్రను పవన్‌ కళ్యాణ్‌ దూషించి, కించపరిచేలా సృష్టించారని నేను భావిస్తున్నాను. అంతటితో ఆగకుండా దానిలో నటించిన నటులు మళ్లీ మళ్లీ మాట్లాడుతున్నారు. 

కలెక్షన్లు తగ్గిపోతున్నాయి కాబట్టి.. దానిని వివాదం చేయడం ద్వారా కలెక్షన్లు పెంచుకోడానికి ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతంగా ఉందని, సూపర్‌ హిట్‌ అని ప్రచారం చేసుకుంటున్నారు. సక్సెస్‌ మీట్లు కూడా పెడుతున్నారు కానీ, వాస్తవంగా ఈ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. అదొక అతి పెద్ద డిజాస్టర్‌ సినిమా. దాని కలెక్షన్లు చూస్తే సోమవారం వరకూ రూ. 55.26 కోట్ల షేర్‌ కలెక్ట్‌ చేసింది. సోమవారమైతే రూ.2.40 కోట్లు మాత్రమే కలెక్ట్‌ చేసింది. 

ఈ సినిమా అట్టర్‌ ఫ్లాఫ్‌ కావడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి సినిమాను సినిమాగా తీయాలి. ఎవరో నిర్మాత డబ్బులు పెడితే..  దానిలో తన శత్రువుల పేర్లు పెట్టి దూషించి పైశాచిక ఆనందం పొందాలనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది. అటువంటిది కమర్షియల్‌గా హిట్‌ కాదు...ప్రజలకు చేరదు. త్రివిక్రమ్, పవన్‌ కళ్యాణ్‌ కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్‌ చేసి దానికి మాటలు రాసి దానిలో నన్ను ఇమిడ్చి ఒక ఆనందాన్ని పొందాలనే ప్రయత్నం చేశారు. 

ఈ సినిమాకు  మొత్తం కలెక్షన్లు రూ.60 నుంచి రూ.70 కోట్లు వస్తాయనుకుంటుంటే హీరో పవన్‌ కల్యాణ్‌ రెమ్యునరేషన్‌ రూ.50 కోట్లు పైనే ఉంది. చివరికి పవన్‌ కల్యాణ్‌ రెమ్యునరేషన్‌ కూడా వచ్చే పరిస్థితులు లేకుండా ఈ చిత్రం ఆడుతోంది. 

వారాహి అమ్మ వారి శాపం..

పవన్‌ కల్యాణ్‌ చిత్రాలు ఇక ఆడవు. ఒక సారి వెనక్కి వెళ్లి చూసుకోండి. వారాహి అనే అమ్మవారి పేరును తన వాహనానికి  నామకరణం చేసి.. దానిపై నుంచి పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడైతే అవాకులు, చవాకులు పేలాడో అప్పుడే చెప్పా.. పవన్‌కు అమ్మ వారి శాపం తగిలిందని. పవన్‌ సినిమాలు ఇక ఆడవు అని. రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు.. తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుందని. 

ఇక ఆయన సినిమాలు కూడా ఆడవు అని నిర్మాతలు తెలుసుకుంటే మంచిది. నిర్మాత విశ్వప్రసాద్‌ పెట్టుబడి పెట్టేటప్పుడు ఇది పొలిటికల్‌ మూవీనా అనేది చూసుకుని ఉండాలి. పొలిటికల్‌ మూవీలు కూడా అనేకం వచ్చాయి. కానీ ఒక సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్‌ చేసి తన కక్ష తీర్చుకోవాలని తాపత్రయ పడుతున్నప్పుడు నిర్మాతలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది.  సినిమా ఫ్లాఫ్‌ కాలేదు.. సక్సెస్‌ అయ్యిందంటే కలెక్షన్లు ఎంతో లెక్కలు చెప్పండి.

విశ్వప్రసాద్‌ ద్వారా పవన్‌కు ప్యాకేజీ..

బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉన్నాయి. చంద్రబాబు ముఠా అమెరికాలో డబ్బులు వసూలు చేసి విశ్వప్రసాద్‌కి ఇస్తే... ఆ డబ్బును పవన్‌ కళ్యాణ్‌కు ప్యాకేజీ అందించారు. ఈ విషయంలో చంద్రబాబు సక్సెస్‌ అయ్యారు. 

పవన్‌ కల్యాణ్‌ రెమ్యునరేషన్‌ రూ.66 కోట్లు తీసుకున్నారా..? లేక రూ.80 కోట్లు తీసుకున్నారా..? ఆయన తీసుకున్న పూర్తి నగదును ఇన్‌కం టాక్స్‌ వారికి చూపించారా.. లేదా..? నీతి, నిజాయితీ పరుడునని, చట్ట ప్రకారం నడుచుకునే సైనికుడిని అని పదే పదే చెప్పే పవన్‌ కల్యాణ్‌ దీనిలో ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారు..? అనేది చెప్పాలి. దీనికి ఎంత కలెక్షన్లు వచ్చాయి.. ఈ చిత్రం ఫ్లాఫ్‌ కావడానికి కారణాలేమిటి అని చిత్రసీమలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశం.

రోజుకు రెండు కోట్లు రూపాయలు తీసుకున్నాడు. 40 రోజులు చేశాడని ఒకరు.. 23 రోజులు చేశాడని మరొకరు అన్నారు. 40 రోజులైతే రూ.80 కోట్లు తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. విశ్వప్రసాద్‌ బ్లాక్‌ మనీని వైట్‌గా చేసి సినిమా ద్వారా పవన్‌ కల్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో ఇచ్చారు. ఇది ఒక స్కామ్‌. రాజకీయాల్లో ఉండి సినిమాలు తీయోచ్చు కానీ...సినిమాల్లో ఉండి రాజకీయాలు చేస్తూ సినిమాలు వదలకపోతే రెండూ నాశనం అవుతాయి. 

ఎన్టీఆర్‌ వంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక ఒకటీ రెండు సినిమాలు తీశారేమో కానీ సినిమాలను అయితే వదిలేశారు. చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నాళ్లు సినిమాలు తీయలేదు. పవన్‌కు సినిమాలు కావాలి..రాజకీయాలు కావాలని... రెండింటికీ న్యాయం చేయలేని ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నాడనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. 

మహిళలు మెచ్చుకునేలా పవన్‌కు గుణపాఠం

మేం కూడా ఒక సినిమా తీయాలి అనుకుంటున్నాం. ఆ కథా వస్తువేమిటో ఈ సందర్భంగా వివరిస్తున్నాను. ఒక మంచి కుటుంబ నేపథ్యం.. ఒక చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ అన్నదమ్ములు ఒక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీలు అవుతారు. ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి యుక్త వయసు వచ్చి..చదువు సరిగ్గా అబ్బక...బజార్ల వెంట చిల్లరగా తిరిగితూ ఏం చేయాలో అర్ధం కాకపోతే అతన్ని అన్నయ్యల వద్ద పెట్టారు. నేను అన్నయ్యల వద్ద ఉండను.. అన్నల్లో కలిసిపోతాను..రౌడీయిజం చేస్తాను.. అక్కడా ఇక్కడా గోకుతాను అనేవాడు. ఇక లాభం లేదని తన అన్నలు తమ సినిమా రంగంలోకే అతన్ని తీసుకొస్తారు. 

అనూహ్యంగా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి అన్నయ్యల కంటే పెద్ద సెలబ్రిటీగా అతను మారిపోతాడు. ఎక్కడికెళ్లినా ఊగిపోతూ ఉపన్యాసాలు చెప్పడంతో అమాయక జనం ఈలలు వేస్తుంటారు. దేశం, సమాజం, మానవత్వం, సాంప్రదాయాల గురించి అద్భుతంగా వల్లెవేస్తుంటాడు. ఇది బయటకు కనిపించే కథ. 

మేడిపండు చందంగా అతని నిత్య జీవితంలోకి వస్తే అతనికి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి పట్టుమని రెండేళ్లు కూడా ఉండదు.. మళ్ళీ మరో పెళ్ళి.. పిల్లల్ని కంటాడు.. భార్యతో విభేదిస్తాడు. సంసారం చేస్తూనే మరో స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. ఆ స్త్రీ నన్ను పెళ్లిచేసుకుంటావా లేదా అంటే మొదటి భార్యతో సెటిల్‌ చేసుకుని రెండో భార్యను పెళ్లిచేసుకుంటాడు. ఇంతటితో ఆగదు..రెండో భార్యకూ అదే జరుగుతుంది. రెండో భార్యకు ఏం జరిగిందో మూడో భార్యకూ అదే జరుగుతుంది. మూడో భార్యకు ఏం జరుగుతుందో.. నాలుగో భార్యకూ అదే జరుగుతుంది. బయటకు మాత్రం అద్భుతమైన మేకప్‌తో సంఘసంస్కర్తలా ఫోజులు పెడుతుంటాడు. క్లైమాక్స్‌లో అందరు పిల్లలు, అందరు భార్యలు కలిసి మహిళా లోకం మెచ్చుకునేలా అతడికి తగిన గుణపాఠం నేర్పుతారు.

ఈ కథపై సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నాం. ఒకరు నిత్య పెళ్లి కొడుకు అని సూచించారు.. మరొకరు పెళ్లిళ్లు–పెటాకులు సూచించారు. తాళి–ఎగతాళి అనేది కూడా పరిశీలనలో ఉంది. మూడు ముళ్లు...ఆరు పెళ్లిళ్లు కూడా పరిశీలిస్తున్నాం. బ్రో లా మ్రో(మ్యారేజెస్‌– రిలేషన్స్‌–అఫెండర్‌ పేరును పరిశీలిస్తున్నాం)

ఆఖరుగా అయిన పెళ్లిళ్లు ఎన్నో...పోయిన చెప్పులెన్నో...అనే టైటిల్‌  కూడా పరిశీలిస్తున్నాం. పేర్లు, కథలో మార్పులు ఏమైనా ఉన్నా, సలహాలు సూచనలు ఎవరైనా చేయవచ్చు.. ఎందుకంటే.. బ్రోలా అట్టర్‌ ప్లాప్‌ అయితే కష్టం. 

శ్యాంబాబు ఎందుకు...నేరుగా రాంబాబు అనే పెట్టుకో:

కథ సారాంశం ఏంటంటే సినిమాల్లో ఎవరిని పడితే వారిని గోకితే సినిమాలు సక్సెస్‌ కావని నిర్మాతలు, నటులు తెలుసుకోవాలి. దమ్ముంటే పూర్తి పొలిటికల్‌ సినిమాలు తీసుకోవచ్చు..శ్యాంబాబు ఎందుకు..రాంబాబే అని నేరుగా పెట్టుకోవచ్చు. నా డ్యాన్స్‌ సింక్‌ కాలేదంటున్నారు. నేనేమన్నా డాన్స్‌ మాస్టర్‌నా.. మా అన్నయ్య డాన్స్‌లో ప్రావీణ్యుడా..?  ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి..అనవసరంగా ఎవరిని పడితే వారిని కెలకడం సమంజసం కాదని తెలుగు చలనచిత్రసీమలో ఉన్న నిర్మాతలు, నటులు, దర్శకులు, త్రివిక్రమ్‌లాంటి రచయితలకు చెప్తున్నా. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ambati Rambabu
Pawan Kalyan
BRO Movie
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 అన్నదాతల మీదికి బుల్డోజర్లా? ఇదేం సంస్కృతి.. అంబటి రాంబాబు

అన్నదాతల మీదికి బుల్డోజర్లా? ఇదేం సంస్కృతి.. అంబటి రాంబాబు

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే: అంబటి

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే: అంబటి

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.