AP Elections Political Latest Updates Telugu..
08:15 PM, Jan 15, 2024
చంద్రబాబుపై బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సెటైర్లు..
- చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించాలి.
- అనైతిక పొత్తులతో కుట్రలు చేస్తున్నారు.
- సీఎం జగన్‌పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలకు అసూయ ఉన్నాయి
- రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు లేదు
- రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యేందుకు చంద్రబాబుకు నలుగురు ష్యూరిటీ ఇచ్చారు
- టీడీపీ బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు హాస్యాస్పదం
06:30 PM, Jan 15, 2024
ఎన్నికల వేళ పచ్చ బ్యాచ్‌తో జాగ్రత్త..
- టీడీపీ పెయిడ్ బ్యాచ్ దిగింది.
- ప్రజలారా అప్రమత్తంగా ఉండండి.
- ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం
- మౌత్ పబ్లిసిటీ కోసం టీడీపీ దొంగదారులు.
టీడీపీ పెయిడ్ బ్యాచ్ దిగింది.. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి..!
ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో @JaiTDP
మౌత్ పబ్లిసిటీ కోసం టీడీపీ దొంగదారులు#TDPFakePropaganda #EndOfTDP pic.twitter.com/hrm8bw775f— YSR Congress Party (@YSRCParty) January 15, 2024
04:40 PM, Jan 15, 2024
ప్రజాక్షేత్రంలోకి సీఎం జగన్
- ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి సన్నద్ధమవుతున్న సీఎం వైఎస్ జగన్
- 2024 ఎన్నికల సాంగ్‌ను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా
- సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా పాట
- మాట ఇస్తే దాని కోసం ఎంత వరకైనా పోరాడే వ్యక్తే జగన్ అని పాటలో వివరణ
04:40 PM, Jan 15, 2024
ఆక్ పాక్ కరివేపాక్.. టీడీపీలో ఆ ఐదుగురికి చెక్
- రఘురామరాజు, కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి, శ్రీదేవి టికెట్లపై టీడీపీలో చర్చ
- వీళ్లను భరించడం కష్టమని పార్టీ సీనియర్ల టాక్
- ఒకవేళ టికెట్ ఇచ్చి గెలిచినా.. ఎన్నాళ్లుంటారో తెలియని పరిస్థితి అంటున్న సీనియర్లు
- టీడీపీలో సుదీర్ఘకాలం నుంచి ఉంటున్న నాయకులకే టికెట్లు ఇవ్వాలని పెరుగుతున్న డిమాండ్
- అధికార పార్టీ తరిమేసిన వాళ్లకు మనం ఎందుకు టికెట్లు ఇవ్వడం అంటూ అభ్యంతరాలు
- గద్దె రామ్మోహన్ రావు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి అయితే మంచిదంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులు
- అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలంటున్న టీడీపీ సీనియర్లు
04:00 PM, Jan 15, 2024
టీడీపీ పచ్చ కామెర్లకు మందు లేదు..
- పచ్చ కామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.
- ప్రతీ విషయాన్ని తప్పుగా చూపే ప్రయత్ని టీడీపీది.
- పరనిందతో పగ్గం గుడుపుకునే పచ్చ బ్యాచ్ మరోసారి ఓవరాక్షన్
- షూస్ వేసుకుని టెంకాయ కొట్టే వ్యక్తి చంద్రబాబు హిందూ సంప్రదాయం గురించి చెబుతున్నారు.

03:45 PM, Jan 15, 2024
టాప్‌లో నిలిచిన ఏపీ
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన ఏపీ
- వరుసగా మూడో ఏడాది టాప్‌లో ఏపీ
- కార్యరూపం దాల్చుతున్న గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒప్పందాలు
- జీఎస్డీపీ వృద్ధిరేటులోనూ మనేమే టాప్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో వరుసగా మూడో ఏడాది టాప్‌లో నిలిచిన ఏపీ
కార్యరూపం దాల్చుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒప్పందాలు
జీఎస్డీపీ వృద్ధిరేటులోనూ మనమే టాప్..!#YSJaganDevelopsAP#YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/DIiH3U1Pe4— YSR Congress Party (@YSRCParty) January 15, 2024
03:00 PM, Jan 15, 2024
ఊరు మారింది.. సామాన్యుడి కామెంట్స్
- చంద్రబాబు హయాంలో పేదవాడిని పట్టించుకున్న నాథుడే లేడు
- పేదవాళ్ల కోసమే పనిచేస్తున్న సీఎం జగన్
- నేడు కార్పోరేట్ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం.
- పేదల ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు
- ఏపీలో పూర్తిగా మారిపోయిన స్కూల్స్
- పండుగకు ఇంటికి వచ్చి స్కూల్స్‌ను చూసి పాత విద్యార్థుల భావోద్వేగం
- ఇది కదా మార్పు అంటే అని సీఎం జగన్‌పై ప్రశంసలు
పేదవాడి నాడి పట్టిన నాయకుడు సీఎం వైయస్ జగన్
నాడు పేద ప్రజల ఆరోగ్యం కోసం పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. నేడు కార్పొరేట్ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పేద ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయి.#VooruMarindi pic.twitter.com/EPHgj9h9Yq— YSR Congress Party (@YSRCParty) January 15, 2024
సంక్రాంతి పండగ వేళ సొంతూరికి వెళ్లి.. మారిన స్కూల్‌ని చూసి అద్దంకిలో ఓల్డ్ స్టూడెంట్స్ భావోద్వేగం..!
ఇది కదా మార్పు అంటే..
ఇది కదా అభివృద్ధి అంటే..!#YSJaganDevelopsAP#VooruMarindi #AndhraPradesh pic.twitter.com/2cRxgO1sU7— YSR Congress Party (@YSRCParty) January 15, 2024
02:15 PM, Jan 15, 2024
గిడుగు రుద్రరాజు రాజీనామా
- ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు రాజీనామా
- కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖ పంపిన రుద్రరాజు
- త్వరలోనే ఏపీకి కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించనున్న ఏఐసీసీ
01:45PM, Jan 15, 2024
- పెనమలూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం:మంత్రి జోగిరమేష్
- పార్టీ విజయానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తా
- 90 శాతం ప్రజలు జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు
- 2024 ఎలక్షన్లో 150 పైగా సీట్లు గెలుస్తాం
- నియోజవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి అందరిని కలుస్తున్నా
- గతంలో కంటే అధిక మెజారిటీతో నియోజవర్గంలో గెలుస్తా
12:05AM, Jan 15, 2024
అందుకే పార్టీ పనులు చూసుకుంటున్నా: వైవీ సుబ్బారెడ్డి
- ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయనని సీఎం జగన్‌కు చాలాసార్లు చెప్పా
- పోటీ చేసేవాడినే అయితే 2019లోనే పోటీ చేసేవాడ్ని
- ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నా
- పోటీ విషయంలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
- సీనియర్ నేతలు పార్టీని వీడడానికి వాళ్ల వ్యక్తిగత కారణాలే
- సీట్ల మార్పు విషయంలో జగన్ స్పష్టంగా ఉన్నారు
- సిట్టింగ్‌లు అభ్యర్థులతో అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది
- త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి
- బీసీలకు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శ సరికాదు
- కాంగ్రెస్‌తో షర్మిల చేరితో మాకు ఎలాంటి నష్టం లేదు
- షర్మిలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేదేమీలేదు
10:50AM, Jan 15, 2024
టీడీపీ – సేనకు బై.. వైఎస్సార్ సీపీకి జై
- వైఎస్సార్సీపీలో చేరిన తూర్పు గోనగూడెంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు
- వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
- ఇతర పార్టీల నుంచి అనేక మంది వైఎస్సార్సీపీలోకి వస్తున్నారు: జక్కంపూడి రాజా
- ఎన్నికల తేదీ నాటికి నియోజకవర్గంలో ఈ చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయి
- ఆ రెండు పార్టీలూ దాదాపు ఖాళీ అయినా ఆశ్చర్యపడనవసరం లేదు
- నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,158 కోట్లతో అభివృద్ధి
- రాష్ట్రంలో కుల మత వర్గ రాజకీయాలతో సంబంధం లేకుండా, అర్హతే ప్రామాణికంగా సీఎం జగన్ ప్రభుత్వం సంక్షేమం
10:00AM, Jan 15, 2024
రాజకీయాల్లో రఘురామ పాత్ర ముగిసినట్లేనా?
- రఘురామను పట్టించుకోని జనం
- ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చిన రఘురామ
- ఆయనకోసం ఎక్కడా ఎదురు పడని క్యాడర్, అభిమానులు
- రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనా?
- టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారనే చర్చ.
- కనీసం ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదని నరసాపురం ప్రజల మాట
09:00AM, Jan 15, 2024
చంద్రగిరిలో ఓట్లపై అపోహలొద్దు:ఆర్డీవో నిషాంత్‌రెడ్డి
- 2019తో పోల్చుకుంటే ఐదేళ్లలో 17 వేల ఓట్లు పెరిగాయి
- ఓటర్ల జాబితాను వందశాతం పారదర్శకంగా రూపొందిస్తున్నాం
- చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకూ 105ఫిర్యాదులు
- వీటికి రాజకీయ నేతలతో చర్చించి పరిష్కరించాం
- ఓటర్ల జాబితాలో చిన్న పొరపాటు కూడా లేకుండా తనిఖీలు చేయడానికి 10 కమిటీలను ఏర్పాటు చేశాం
8:50AM, Jan 15, 2024
అమరావతిపై దత్తపుత్రుడి ప్రేమ!
- అమరావతి నుంచే పాలన అంటున్న చంద్రబాబు అండ్ పవన్
- సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న క్రమంలో వీరిద్దరి నోట.. అమరావతి మాట
- అమరావతిపై తమకు ఇంకా ‘మోజు’ తగ్గలేదనే సంకేతాలు
8:30AM, Jan 15, 2024
ఆ ఇద్దరిది అపవిత్ర కలయిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్
- చంద్రబాబు, పవన్‌ల కలయిక అత్యంత అపవిత్రమైనది
- బాబు, పవన్‌లు పండుగలను సైతం రాజకీయం చేస్తున్నారు
- 2014లో ఒక విధంగా వారు కలయిక జరిగితే, 2019లో కలిసి ఉండి మరో విధంగా విడిపోయారు
- 2024లో మళ్లీ కలిసి తేడా రాజకీయాలు చేస్తున్నారు
- 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు పాలన చూశాం
- 2019 నుంచి సీఎం జగన్ పాలన కూడా చూశాం
- ప్రజలు ఎవరిని తరిమేస్తారో 80 రోజుల్లోనే తేలనుంది
- ఈసారి టీడీపీ, జనసేనలను ప్రజలు భోగి మంటల్లో వేస్తారు
8:15AM, Jan 15, 2024
నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్‌దే బాధ్యత: రాయపాటి రంగారావు
- తనను కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ రూ.50 లక్షల చందాలు వసూలు చేసింది
- దీనిపై గుంటూరు ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశా
- ఈనెల 13న గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారు
- వైజాగ్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి , చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని బెదిరించారు
- లేకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పారు
7:52AM, Jan 15, 2024
రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే..
- ఏప్రిల్ 2తో పూర్తికానున్న టీడీపీ సభ్యుడు ‘కనకమేడల’ పదవీకాలం
- వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ల పదవీకాలం ముగిసేదీ అప్పుడే
- రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో ఎన్నికలు
- అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ మూడూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే
- దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్సీపీ పరం
- చివరికి రాజ్యసభలో ఉనికే లేకుండాపోనున్న టీడీపీ
- 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి
07:10AM, Jan 15, 2024
రేపు బాబుకి జడ్జిమెంట్ డే
- స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 16న సుప్రీం కోర్టు తీర్పు!
- స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజలు జైల్లో ఉన్న చంద్రబాబు
- మధ్యాహ్నాం ఒంటి గంటకు తీర్పు వెల్లడించిన ద్విసభ్య ధర్మాసనం
- 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన
- వర్తించదని ఏపీ సీఐడీ వాదనలు
- వాదనలు విని.. తీర్పు రిజర్వ్ చేసిన బెంబ్
07:05AM, Jan 15, 2024
ఇది కదా అసలైన అభివృద్ధి
- జగనన్న పాలనలో మన ఊరు మారింది..
- ఏపీ ప్రజల జీవితాలు మారాయి
- అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి
- ఊరు.. జిల్లా.. మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందింది
- ఇది కదా అసలైన అభివృద్ధి అంటే..!
07:00AM, Jan 15, 2024
బలం సరిపోవట్లేదు.. బీజేపీ కావాలి
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో ప్రధానంగా బీజేపీని ఒప్పించడంపై చర్చ
- ప్రస్తుతం తమకున్న బలం పూర్తిస్థాయిలో ఓట్లు కురిపించలేదని ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు-పవన్
- ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించే బాధ్యతను పవన్ కళ్యాణ్‌కు అప్పగించిన చంద్రబాబు
- అడిగినని ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పాలని సూచించిన చంద్రబాబు
- ఈసారి పొత్తు తర్వాత నమ్మకంగా ఉంటామని ఢిల్లీ పెద్దలకు హామీ ఇవ్వాలని సూచన
- ఉమ్మడి మేనిఫెస్టో కు సిద్ధమని అలాగే బిజెపి సూచించే అంశాలను కూడా అందులో పెట్టేందుకు రెడీ అని అంగీకారానికి వచ్చిన చంద్రబాబు
- పొత్తుకు బీజేపీ ఓకే అంటే మొదటి జాబితాలోనే బీజేపీ నేతల పేర్లు ప్రకటించేందుకు సిద్ధమంటున్న చంద్రబాబు
- ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే.. ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై చర్చ
- ఎన్నికల సమీపిస్తున్నాయి ఇక మ్యానిఫెస్టో తొందరగా విడుదల చేయాలని చర్చ
- ఈ నెలలోనే కనీసం మినీ మేనిఫెస్టో విడుదల చేయాలని లక్ష్యం
- వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై తెలుగుదేశం జనసేన మధ్య కొలిక్కిరాని చర్చలు