Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. బాబు, రఘురామలకు ఝలక్‌
ADVERTISEMENT 

బాబు, రఘురామలకు ఝలక్‌

Politics Sakshi User Sakshi Sakshi Time Apr 9, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CBN_BJP_Raghurama.jpg

ఎన్టీఆర్‌, సాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజులకు బీజేపీ ఝలక్‌ ఇచ్చింది. కూటమి తరఫున సీట్ల మార్పునకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను బీజేపీ తిరస్కరించింది. దీంతో.. నరసాపురం ఎంపీ టికెట్‌పై రఘురామ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి.

పొత్తులో భాగంగా టీడీపీ, జనసేనలకు సీట్ల పంపంకంతో పాటు బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో.. బీజేపీ ఇదివరకే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే ఆ జాబితాలో మార్పుల కోసం చంద్రబాబు బీజేపీతో మంతనాలు మొదలుపెట్టారు.  నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లతో పాటు 20 సీట్ల దాకా మార్చుకుందామంటూ బీజేపీ ముందర ప్రతిపాదన పెట్టారు.

అయితే.. ‘‘నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ. ఆయన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేశారు. అతని తరఫునే మేం ప్రచారం చేయబోతున్నాం’ అని ఏపీ బీజేపీ ఎన్నిలక ఇంఛార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ తాజాగా ప్రకటించారు. దీంతో.. చంద్రబాబు ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించిందనేది స్పష్టమవుతోంది.  

ఉండి కూడా ఫసకే?

ఇదిలా ఉంటే.. నరసాపురం ఎంపీ సీటు కోసం రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా యత్నించారు. చంద్రబాబుతోనూ సంప్రదింపులు జరిపారు. చివరకు ఉండి అసెంబ్లీ సీటు మాట దక్కించుకుని, టీడీపీలో చేరారు. అయితే పాలకొల్లు టీడీపీ భేటీలో చంద్రబాబు రఘురామ కృష్ణంరాజును ఉండి అభ్యర్థిగా ప్రకటించగానే.. అక్కడి టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అప్పటికే టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, మరో టీడీపీ నేత కలవపూడి శివరామరాజు మధ్య ఉండి టికెట్‌ కోసం కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. ఈ మధ్యలో చంద్రబాబు రఘురామ పేరును ప్రస్తావనకు తేవడాన్ని టీడీపీ శ్రేణులు భరించలేకపోయాయి. 

ఉండిలో 2019 ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వేటుకూరి శివ‌రామ‌రాజు (క‌ల‌వ‌పూడి శివ‌)ను న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్థిగా నిలిపి, ఆయ‌న అనుచ‌రుడు రామ‌రాజుకు ఉండి టికెట్ ఇచ్చింది టీడీపీ.

ఉండి సీటుకు రఘురామ కృష్ణంరాజు పేరుతో టీడీపీ శ్రేణులు భగ్గుమనడంతో చంద్రబాబు కాస్త మెత్తబడ్డారు. అదే సమయంలో ఉండి సీటు నిర్ణయం ఇంకా జరగలేదంటూ రఘురామ సన్నాయి నొక్కులు నొక్కారు.  ఈలోపు రఘురామకు నర్సాపురం ఎంపీ సీటు కోసం చంద్రబాబు ప్రయత్నాలు కొనసాగిస్తూనే  వచ్చారు. చివరకు.. బీజేపీ ఆ సీటను వదులుకునేందుకు నో చెప్పేసింది. దీంతో ఇటు నరసాపురం, అటు ఉండి రెండూ రఘురామకు కాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. 

మరోవైపు.. ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా బీజేపీ, టీడీపీ అధినేతకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో.. అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత నెలకొంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
AP Politics
raghurama krishnam raju
AP Elections 2024
AP Assembly Elections 2024
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

పవన్‌ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు..

పవన్‌ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.