Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. పొత్తు.. పార్టీ చిత్తుకేనా?
ADVERTISEMENT

పొత్తు.. పార్టీ చిత్తుకేనా?

Politics Sakshi User Sakshi Sakshi Time Feb 26, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
TDP-14.jpg

అనకాపల్లి (యలమంచిలి రూరల్‌)/కశింకోట/ అనకాపల్లి: టీడీపీ–జనసేన పార్టీల తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితా అనకాపల్లి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి రగిల్చింది. పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను కాదని జనసేనకు టికెట్‌ కేటాయించడం గందరగోళానికి దారితీసింది. ఇప్పటి వరకూ చంద్రబాబే తమకు ఇంద్రుడు, చంద్రుడు అని మాట్లాడినవారు ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత వైఖరినే తప్పుబడుతున్నారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు పార్టీ టికెట్‌ వస్తుందని ఆయన అనుచరగణం, టీడీపీ శ్రేణులు భావించాయి.

కాని అనూహ్యంగా ఈ సీటును పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించడంతో ఆదివారం కశింకోట, అనకాపల్లి పట్టణాలలో తెలుగు తమ్ముళ్ల నిరసనలు పెల్లుబికాయి. చంద్రబాబు తీరుపై ఆ పార్టీ నేతలే తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. నెల రోజుల కిందట జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాలను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలపడం సరికాదంటున్నారు. ఈ మేరకు ఆదివారం కశింకోట మండల టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. తామంతా పీలా వెంటే ఉంటామని, ఆయనకు టికెట్‌ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని అధినేతకు హెచ్చరికలు పంపారు.

బాహాటంగానే విమర్శలు

అనకాపల్లిలో కూడా టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇలాంటి పొత్తుల వల్ల పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని, పార్టీకి అనుకూలంగా వున్న సీటును జనసేనకు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. నమ్మకాన్ని వమ్ము చేయడమే చంద్రబాబు నైజమని సొంత పార్టీ నేతలే విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహించడం, సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్టు చేయడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యాన్ని తెచ్చింది. చంద్రబాబుకు మాటపై నిలబడే తత్వం లేదని, ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని నియోజకవర్గ టీడీపీ ముఖ్యనాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు టీడీపీ టికెట్‌ ఇవ్వకుంటే మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కశింకోట మండల టీడీపీ శ్రేణులు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం కశింకోటలోని గౌరమ్మ ఆలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో తీవ్ర నిరసన తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కష్టపడి నియోజక వర్గంలో కార్యకర్తలను నిరంతరం ఉత్తేజపరిచి పార్టీని నిలబెట్టుకుంటూ పటిష్టవంతం చేసిన పీలా వంటి వ్యక్తికి సీటు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. పార్టీ శ్రేణులకు తెలియకుండా జనసేనకు టికెట్‌ కేటాయించడం శోచనీయమన్నారు. అధిష్టానం పునరాలోచించాలని కోరారు. పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు కేటాయిస్తే పనిచేస్తామన్నారు. అయితే ఎమ్మెల్యే సీటు మాత్రం పీలాకు ఇవ్వాలన్నారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పెంటకోట రాము, మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు వేగి గోపీకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్‌ సిదిరెడ్డి శ్రీనివాసరావు, కొత్తపల్లి మాజీ సర్పంచ్‌ బుదిరెడ్డి గంగయ్య పాల్గొన్నారు.

గెలవలేని పార్టీతో మనకెందుకు పొత్తు ?

గెలవలేని జనసేన పార్టీతో టీడీపీకి పొత్తు ఎందుకని, అన్ని స్థానాలకు టీడీపీ అభ్యర్థులను నిలబెట్టాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు బొద్దపు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. అనకాపల్లి గవరపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తు కారణంగా టీడీపీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని, అధిష్టానం పునరాలోచించాలని కోరారు. ఇలాంటి నిర్ణయాల వల్ల వైఎస్సార్‌సీపీకి విజయావకాశాలు పెరుగుతాయన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని, చంద్రబాబు, లోకేష్‌లు అనకాపల్లి వచ్చినప్పుడు పార్టీ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఇటీవల మునగపాక మండలం నాగులాపల్లిలో జరిగిన శంఖారావం సభలో అనకాపల్లి టికెట్‌ పీలాకే ఇస్తామని లోకేష్‌ పార్టీ శ్రేణులకు చెప్పిన విషయం గుర్తు చేశారు. తొలి నుంచి జనసేన నిర్మాణంలో పాల్గొన్న పరుచూరి భాస్కరరావుకు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన కొణతాలకు టికెట్‌ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. పార్టీ నేతలు మళ్ల సురేంద్ర, కాయల ప్రసన్నలక్ష్మి, అధికసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TDP
janaseena
Chandrababu Naidu
AP Politics
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.