Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. సైకిల్‌ సతమతం 
ADVERTISEMENT 

సైకిల్‌ సతమతం 

Politics Sakshi User Sakshi Sakshi Time Feb 26, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pk.jpg

సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌:  పొత్తు ప్రకంపనలు టీడీపీలో కొనసాగుతూనే ఉన్నాయి. సీట్లు దక్కని నేతలతోపాటు పొత్తులతో అవకాశం కోల్పోయిన అసంతృప్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని నిరసనలతో హోరెత్తిస్తున్నారు. జనసేనతో కలిసి 99 మంది ఉమ్మడి అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పలు చోట్ల నేతలు భగ్గుమంటున్నారు.   



♦ విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీ టికెట్‌ను తన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాస్‌కి కేటాయించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆదివారం గజపతినగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడాన్ని నిరసిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శనలు జరిగాయి.  

♦   టీడీపీ బలోపేతం కోసం కష్టపడ్డ తనను అవమానించారని, ఇండిపెండెంట్‌గా ఎన్నికల బరిలోకి దిగుతానని ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ప్రకటించారు. చంద్రబాబు తనకు కనీస గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజుకు సహకరించేది లేదన్నారు.  



♦  శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సీటును సవితకు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గం నిరసనలతో హోరెత్తిస్తోంది. ఆదివారం పెనుకొండలో పార్థసారథి అనుచరులు భారీ బైక్‌ ర్యాలీతో బల ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ వెళ్లి చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటానని పార్ధసారథి ప్రకటించారు. కనీసం సంప్రదించకుండా అభ్యర్థిని ఎంపిక చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అస­హ­నం వ్యక్తం చేశారు. త్వరలో కార్యాచరణ ప్రకటి­స్తామని కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు. 



♦  అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌యాదవ్‌కి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బి.కొత్తకోటలో నిరసన నిర్వహించారు.   



♦  నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌ బరిలోకి దిగ­డం దాదాపుగా ఖరారైంది. దీనిపై నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతోపాటు కుందుల సత్యనారాయణ వర్గా­లు మండిపడుతున్నాయి. వారంతా టీడీపీకి మూకు­మ్మడి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

 

చిత్తూరులో బీసీలు భగ్గు 


టీడీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రిజర్వుడు స్థానాలను మినహాయించి చిత్తూరు (కమ్మ), కుప్పం (కమ్మ), నగరి (కమ్మ), తంబళ్లపల్లె (రెడ్డి), పలమనేరు (రెడ్డి) స్థానాలను ఓసీలకు కేటాయించడంపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన బీసీ నేత సీఆర్‌ రాజన్‌కు టీడీపీ మొండి చేయి చూపడంపై ఆయన సామాజిక వర్గం మండిపడుతోంది.

శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు బస్సు యాత్ర నిర్వహించి బీసీలను చైతన్యం చేయాలని నిర్ణయించింది. బెంగళూరు నుంచి దిగు­మతి చేసుకున్న గురజాల జగన్‌మోహన్‌ నాయు­డుకు చిత్తూరు టికెట్‌ ఇవ్వడంపై కాపు నేతలు ఆగ్ర­హం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన కాపు నేతలు కటారి హేమలత, ఆదికేశవులు కుమార్తె తేజస్విని, మనవరాలు చైతన్య, కాజూరు బాలాజీ తదితరులు టీడీపీ టికెట్‌ ఆశించి భంగపడ్డారు.  

జనసేనలోనూ మంటలు... 

♦   తణుకు జనసేన టికెట్‌ ఆశించి భంగపడ్డ విడివాడ రామచంద్రరావు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన అరిమిల్లి రాధాకృష్ణపై నిప్పులు కక్కుతున్నారు. తన ఇంటికి రావద్దంటూ అరిమిల్లిపై మండిపడ్డారు. విడివాడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి యోచనలో ఉన్నారు. 



♦   కాకినాడ జిల్లా జగ్గంపేట టికెట్‌ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించడాన్ని నిర­సిస్తూ జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ఆలయాల్లో పూజలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 48 గంటల్లో అధినేత స్పందించకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ గోకవరం మండలాధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం చెప్పారు. 



♦   బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరులోని జనసేన కార్యాలయం వద్ద పార్టీ నాయకులు చల్లా బాబీ, గుత్తుల నాగేశ్వరరావు, బి.రాంబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు పవన్‌ కళ్యాణ్‌ ఫ్లెక్సీలను చించి రోడ్డుపై వేసి నిప్పంటించారు. అతి తక్కువ సీట్లకు ఒప్పందం కుదుర్చుకుని పవన్‌ కళ్యాణ్‌ పార్టీ శ్రేణులకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. కొత్తపేట నియోజకవర్గాన్ని టీడీపీకి కట్టబెట్టడం దారుణమన్నారు. పదేళ్లుగా అహర్నిశలూ శ్రమిస్తే  పార్టీని టీడీపీకి అప్పగించి తమను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. 



♦   కాకినాడ జిల్లా పెద్దాపురం సీటును టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించటాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నేతలు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తుమ్మల బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.  



♦   పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పెడన ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించకపోవడంతో ఆ పార్టీ కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టి»ొమ్మను కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో ఆ పార్టీ నాయకుడు సమ్మెట బాబు విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ను గుడ్డిగా నమ్మామని అన్నారు. గౌరవప్రదమైన పొత్తుకు విఘాతం కలిగినట్టుగా జనసైనికులు భావిస్తున్నారని తెలిపారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TDP
alliance
Chandrababu Naidu
Jana Sena
list of candidates
AP Politics
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.