Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. పూటకో మాట.. సరికొత్త ఆట!
ADVERTISEMENT 

పూటకో మాట.. సరికొత్త ఆట!

Politics Sakshi User Sakshi Sakshi Time Apr 5, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
569.jpg

అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమన్న ఆది

పార్లమెంటుకు పోటీ చేస్తానని చెప్పుకొచ్చిన వైనం

కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యుల్ని శాంతింపజేసే ఎత్తుగడ

అనుకున్నట్లుగా సక్సెస్‌ అయిన జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి

నేడు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల సమావేశం

సాక్షి ప్రతినిధి, కడప: మాటల గారడీతో నేతల్ని బురిడీ కొట్టించే ఎత్తుగడల్లో ఆయన దిట్ట. కలిసివస్తే తన ప్రతిభ.. లేదంటే ఎదుటోళ్ల తప్పుగా వర్ణించే నేర్పరితనం ఆయనది. అనుకున్నట్లుగా అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అన్న కుటుంబానికి నాడు–నేడు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేశారని సోదరులంతా పసిగట్టారు. అవకాశవాదానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన చతురత ప్రదర్శించారు. ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఆది మైండ్‌ గేమ్‌తో అటు అబ్బాయ్‌.. ఇటు సోదరులను శాంతింపజేశారు. ఈ నాటకానికి కథ, స్క్రీన్‌ ప్లే మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కాగా, తారా గణం ఆయన కుటుంబ సభ్యులు కావడం విశేషం.

► జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలకు నాలుగున్నరేళ్లుగా మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దూరంగా ఉన్నారు. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటం చేసిన దాఖలాలే లేవు. తనకు అధికారం అండ లేకపోతే, రాజకీయ మనుగడ కష్టమని భావించి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతోనే బీజేపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఉనికి చాటుకునే చర్యలు మినహా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష పోరాటం చేసింది లేదు. తెలుగుదేశం పార్టీకి దిక్కు దిశా లేని సమయంలో మాజీ జెడ్పీటీసీ భూపేష్‌రెడ్డి రంగప్రవేశం చేశారు. టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి ఆ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించారు. అనుచరులను చేరదీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని తలచిన నేపథ్యంలో తనను కాదని టికెట్‌ తెచ్చుకోగలరా? అంటూ ఆదినారాయణరెడ్డి సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అనుకున్నట్లుగా టీడీపీ టికెట్‌ భూపేష్‌కు దక్కకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి దక్కేలా తెరవెనుక పావులు కదిపి సక్సెస్‌ అయ్యా రని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు

తన సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌కు టీడీపీ టికెట్‌ దక్కకుండా బీజేపీకి దక్కేలా ఆదినారాయణరెడ్డి చేపట్టిన పైరవీలను పసిగట్టిన కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారని సమాచారం. అందుకు కారణం 2004లో వర్గ రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చిన నారాయణరెడ్డికి సీటు లేకుండా అడ్డుతగిలిన వైనం, తాజాగా భూపేష్‌కు ఎమ్మెల్యే టికెట్‌ దక్కకుండా వ్యవహరించిన తీరుతో దేవగుడి సోదరులంతా ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డికి వ్యతిరేకంగా పయనించేందుకు అందరూ సిద్ధమయ్యారు.

ఈ విషయాన్ని పసిగట్టిన ఆయన బీజేపీ అభ్యర్థిత్వం దక్కినా స్వగ్రామంలో అడుగు పెట్టకుండా ఉండిపోయారు. ఈలోపు భూపేష్‌కు టీడీపీ ఎంపీ టికెట్‌ దక్కింది. ఆ వెనువెంటనే జమ్మలమడుగు చేరుకున్న ఆది తాను ఎంపీకి, మావాడు భూపేష్‌ ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తాం. అదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం, పరిశీలనలో ఉందని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగానే అటు అబ్బాయ్‌.. ఇటు సోదరులు శాంతించినట్లు సమాచారం. ఆది మైండ్‌ గేమ్‌కు మొత్తం కుటుంబం ఫ్లాట్‌ అయినట్లు తెలుస్తోంది.

నేడు ఉమ్మడిగా సమావేశం..

బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి ఇరువురు శుక్రవారం జమ్మలమడుగులో ఉమ్మడిగా కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జనసేన కార్యకర్తలు సైతం హాజరుకానున్నారు. ఇప్పటి వరకూ బాబాయ్‌...అబ్బాయ్‌ ఎవరికి వారు రాజకీయాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇకపై ఉమ్మడిగా రానున్నారు. వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న జమ్మలమడుగులో అవకాశవాద రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఇందుకు దేవగుడి కుటుంబమే ప్రధాన కారణమైంది. ఇలాంటి రాజకీయాలకు ఓటర్లు చెక్‌ పెట్టాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
YSR District News
YSR District Latest News
TDP
adinarayana reddy
AP Politics
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు

అన్నదమ్ములను బలిగొన్న ఇసుకాసురులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.