Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. నువ్వే కావాలి జగన్‌ 
ADVERTISEMENT 

నువ్వే కావాలి జగన్‌ 

Politics Sakshi User Sakshi Sakshi Time Apr 7, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nuvvekavali.jpg

9వ రోజు మేమంతా సిద్దం బస్సు యాత్రలో నినదించిన సింహపురి ప్రజానీకం 

నెల్లూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథ పట్టిన జనవాహిని 

(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి)సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  కుల మతాలకు అతీతంగా తమకు మేలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ను దగ్గరి నుంచి చూడాలని, వీలైతే మాట్లాడాలని ఊరూ వాడల్లోని చిన్నా, పెద్దా తరలివచ్చి శనివారం 9వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘మళ్లీ నువ్వే కావాలి జగన్‌’ అంటూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.

కావలి బహిరంగ సభ జన సంద్రాన్ని తలపించింది. చింతారెడ్డిపాలెంలోని రాత్రి బస నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ యాత్ర ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అంతకు ముందు తనను కలిసిన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఎన్నికల కార్యాచరణపై సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారు.

ఈ క్రమంలో చింతారెడ్డిపాలెం రోడ్‌షోలో ఓ మహిళ తన బిడ్డ అనారోగ్య బాధను చెప్పుకునేందుకు ఎదురు చూస్తుండడాన్ని గమనించిన సీఎం.. దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భగత్‌సింగ్‌ కాలనీకి చేరుకునే సరికి జాతీయ రహదారిపై భారీగా హాజరైన మహిళలు ఘన స్వాగతం పలికారు. 



అడుగడుగునా ఘన స్వాగతం

కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో పలువురు మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి సీఎం విజయాన్ని కాంక్షించారు. బుల్లితెర నటుడు రియాజ్‌ సైతం సీఎంను కలిసి బస్సు యాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం సున్నబట్టి, తిప్ప మీదుగా సీఎం రోడ్‌ షో నిర్వహించారు.

మధ్యాహ్నం 12 గంటలకు రాజుపాళ్యంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎదురు చూస్తున్న అక్కచెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. చింతరెడ్డిపాలెం నుంచి సింగరాయకొండ వరకు చెన్నై–కోల్‌కతా జా­తీయ రహదారిపై ప్రజాభిమానం వెల్లువెత్తింది. బస్సు దిగి సీఎం జగన్‌ మహిళలు, వృద్ధులను పలుకరించారు.   



ఎండను లెక్క చేయని అభిమానం 

ఐదేళ్ల పాలనలో తాము ఆర్థికంగా నిలదొక్కుకుని, ఆత్మగౌరవంతో జీవించడానికి చేదోడుగా నిలిచిన సీఎం జగన్‌ను ఒక్కసారైనా చూడాలన్న ప్రజల కోరిక ముందు భగభగమండే సూరీడు సైతం చిన్నబోయాడు. మిట్ట మధ్యాహ్నం 41 డిగ్రీలకు పైగా ఉన్న ఎండను సైతం లెక్క చేయకుండా తిప్ప, గౌరవరం, కావలి బైపాస్‌లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, చంటిబిడ్డ తల్లులు రోడ్లపై బారులు తీరి జననేతను  చూడటానికి పోటీపడ్డారు.

మార్గం మధ్యలో భారీ గజమాలతో సత్కరించారు. సీఎం జగన్‌ 4.30 గంటలకు రోడ్‌షో ద్వారా కావలిలోని సభా స్థలికి చేరుకున్నారు. సభ అనంతరం సీఎం బస్సు యాత్ర ఏలూరుపాడు, ఉలవపాడు మీదుగా 7 గంటలకు సింగరాయకొండ క్రాస్‌కు చేరుకుంది. ఉదయం నుంచి సీఎం రాక కోసం ఎదురు చూస్తున్న ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు.

అనంతరం ఓగురు మీదుగా 8 గంటలకు కందుకూరుకు చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్రపై బంతిపూల వర్షం కురిసింది.పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా ప్రకాశం జిల్లాలోని జువ్విగుంట క్రాస్‌ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకున్నారు.

 

జనసంద్రమైన కావలి 

పెద్ద ఎత్తున కదలివచ్చిన జనం వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వానికి మద్దతుగా కావలిలో నినాదాలు హోరెత్తించారు. జాతీయ రహదారి జనాలతో  కిక్కిరిసిపోయింది. సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసానికి జనసంద్రమే ప్రతీక అని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  

ఆ బిడ్డను చూడకపోతే ఎలా?

సూరీడు నడినెత్తిపైకి వచ్చాడు.. ఎండ వేడికి రోడ్డు సెగలు పుట్టిస్తోంది.. చెట్టు నీడలోనూ చెమట చుక్క ఆరట్లేదు.. ఇంతలో నెత్తిపై తుండు గుడ్డతో బక్కపల్చని శరీరంతో 70 ఏళ్ల వృద్ధురాలు కావలి పట్టణ శివారులో కనిపించింది. ఎవరి కోసమో ఎదురు చూస్తోంది. ‘ఏం అవ్వా.. మండుటెండలో ఇక్కడేం చేస్తున్నావు’ అని అడిగితే.. ‘జగన్‌ బాబు ఇంకా రాలేదా.. ఎంత దూరంలో ఉన్నాడు..’ అని ఎదురు ప్రశ్నించింది.

‘ఈ వయసులో ఒక పక్క గస పోస్తూ ఎందుకీ తిప్పలు’ అంటే.. ఒకింత కోపంతో చూసింది. నాలాంటోళ్లు ఎందరికో ఆయన ఎంతో మేలు చేశాడు. ‘అలాంటి బిడ్డ మా ఊరికి వచ్చినప్పుడు చూడకపోతే ఎలా? నా పేరు శాంతమ్మ. నాకు ముగ్గురు ఆడ బిడ్డలు. పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటారు.

కానీ.. జగన్‌ బాబు నా బాగు కోసం ప్రతి నెలా 1వ తేదీనే ఇంటికి పింఛన్‌ పంపించాడు. అది ఇప్పుడు ఇంటికి రాకుండా వాళ్లు (టీడీపీ)ఆపేశారు. అందుకే జగన్‌బాబు ఏం చేబితే అది చేద్దామని ఇక్కడికి వచ్చాను’ అని చెప్పింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో శాంతమ్మలాంటి ఎంతో మంది అవ్వాతాతలు కనిపించారు.

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
road show
YS Jagan Mohan Reddy
bus yatra
Nellore
AP Politics
AP 175
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.