Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. NRI
  3. తానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం విజయవంతం
ADVERTISEMENT

తానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం విజయవంతం

NRI Sakshi User Sakshi Sakshi Time Nov 2, 2026 10:45 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
video1.jpg

డాలస్, టెక్సస్: తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరున్నర సంవత్సరాలగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. 97 వ అంతర్జాల సమావేశం సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమై విజయవంతంగా ముగిసింది.

ప్రత్యేకఅతిథిగా పాల్గొన్న గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్ మాట్లాడుతూ “అవధాన రంగంలో సుప్రసిద్ధులైన వారిలో ఆరుగురు అవధానులు ఒకే వేదికపై పాల్గొని తమను అవధానులుగా తీర్చిదిద్దిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఇదే తొలిసారి అని, ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారంచుట్టిన తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర వారి బృందం అభినందనీయులు అన్నారు. తెలుగు వారికే సొంతమైన ఈ అవధాన ప్రక్రియను పరిరక్షిస్తున్న ఈ అవధానులకు ఆశీస్సులు, వీరిని స్పూర్తిగా తీసుకుని మరింతమంది అవధానులు తయారుకావాలని ఆకాంక్షించారు”.


డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – “ఏకాగ్రతకు ప్రతీకలై, జ్ఞాపకశక్తికి నిలువెత్తు నిదర్శనాలై, ఆశుకవిత్వానికి అపూర్వమైన వైభవంతో, ప్రశ్నకు పద్యంతో, సమస్యకు సమయస్ఫూర్తితో, సవాలుకు సృజనాత్మకతతో సమాధానమిచ్చే అష్టావధాన, శతావధాన, సహస్రావధాన సంప్రదాయాలను పరిరక్షించి అవధాన విద్యను మనకు వారసత్వంగా అందించిన, అందిస్తున్న సాహితీమూర్తులకు, అవధాన గురువులందరికీ శతకోటి వందనాలు అన్నారు”.  

ఈ అవధాన గురువందనం కార్యక్రమంలో ఈ క్రింది అవధానులు పాల్గొని వారి వారి అవధాన గురువుల పాండిత్య ప్రతిభ, క్రమశిక్షణ, శిక్షణా విధానం, శిష్యులపై వారు చూపిన అభిమానం,  వాత్సల్యం, సహనం వల్లనే అవధాన రంగంలో నేడు తాము అవధానులుగా కొనసాగగల్గుతున్నామని,  అందుకు ఏమిఇచ్చినా తమ గురువుల ఋణం తీర్చుకోలేమని వారికి వినమ్ర ప్రణామాలను తెలియజేశారు.

●    సహస్రావధాని కోట వేంకట లక్ష్మీనరసింహం - వారి గురువు గురుసహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్ గారి గురించి 
●    శతావధాని డా. ఆముదాల మురళి – వారి గురువు శతావధాని, కవి, పండితులు, పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు గారి గురించి    
●    ద్విశతావధానిని డా. బులుసు అపర్ణ - వారి గురువు అవధాన ప్రాచార్యులు డా. ధూళిపాళ మహాదేవమణి గారి గురించి  
●    పద్యకోకిల, అష్టావధాని డా. బోచ్కర్ ఓమ్ప్రకాశ్ – వారి గురువులు డా. అవధానం రంగనాథ వాచస్పతి; డా. ఆయాచితం నటేశ్వర శర్మ , శతావధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గార్ల గురించి      
●    శతావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్ – వారి గురువులు శతావధాని పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు; ప్రముఖ కవి, అన్నమరాజు ప్రభాకరరావు; అచ్చతెనుగు శతావధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, శతావధాని డా. ఆముదాల మురళి గార్ల గురించి  
●    గీతావధాని, అష్టావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు - వారి తొలి గురువు సద్గురు డా. ఉమర్ ఆలీషా , ఏ. సచ్చిదానందమూర్తి గార్ల ప్రతిభాపాటవాలను ప్రస్తుతించారు.

పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును
https://youtube.com/live/-3ohiLhpKNs

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Dallas
TANA
Literature News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

డాలస్‌లో వైభవంగా కొసరాజు సాహిత్యావిష్కరణ

డాలస్‌లో వైభవంగా కొసరాజు సాహిత్యావిష్కరణ

అమెరికాలో కాల్పుల ఘటనలు 

అమెరికాలో కాల్పుల ఘటనలు 

యువత గొంతును విందాం!

యువత గొంతును విందాం!

డల్లాస్‌లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం..!

డల్లాస్‌లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం..!

కవిత్వం నుంచి రాజ్యసభ వరకు.. శంకర కురుప్‌ అరుదైన ప్రస్థానం!

కవిత్వం నుంచి రాజ్యసభ వరకు.. శంకర కురుప్‌ అరుదైన ప్రస్థానం!

'నోబెల్‌' బెట్టింగుల్లో డేంజర్‌ బెల్స్‌!

'నోబెల్‌' బెట్టింగుల్లో డేంజర్‌ బెల్స్‌!

మరిన్ని వార్తలు

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీంకోర్టు షాక్‌...

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీంకోర్టు షాక్‌...

డాలస్‌లో వైభవంగా కొసరాజు సాహిత్యావిష్కరణ

డాలస్‌లో వైభవంగా కొసరాజు సాహిత్యావిష్కరణ

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో  రక్తదాన శిబిరం!

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం!

TAJ ఆధ్వర్యంలో టోక్యో ఓజిమాలో ఘనంగా దసరా వేడుకలు

TAJ ఆధ్వర్యంలో టోక్యో ఓజిమాలో ఘనంగా దసరా వేడుకలు

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

షాంఘైలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

షాంఘైలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft