Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. NRI
  3. డాలస్‌లో వైభవంగా కొసరాజు సాహిత్యావిష్కరణ
ADVERTISEMENT

డాలస్‌లో వైభవంగా కొసరాజు సాహిత్యావిష్కరణ

NRI Sakshi User Sakshi Sakshi Time Nov 2, 2026 08:55 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
dallas.jpg

డాలస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో మనసు ఫౌండేషన్ సహకారంతో కవిరత్న, జానపద కవిసార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య రచనలను ముద్రించి గత సంవత్సరం గుంటూరులో కొసరాజు కుటుంబసభ్యులు, సాహిత్యాభిమానుల మధ్య సహస్రావధాని పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు చేతులమీదుగా అత్యంత వైభవంగా ఆవిష్కరించడం జరిగింది. ఆదివారం ఈ సాహిత్య సంపుటాలను అమెరికాలో డాలస్ నగరంలో ఘనంగా ఆవిష్కరించారు.

‘తానా ప్రపంచసాహిత్యవేదిక’, ‘కళావాహిని’ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సహకారంతో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా కళావాహిని వ్యవస్థాపకులు అనంత్ మల్లవరపు స్వాగతోపన్యాసంతో కొసరాజు చిత్రపటానికి అతిథులందరూ పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.    
      
తానా పూర్వాధ్యక్షులు , తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర సభాధ్యక్షుడిగా వ్యవహరించిన ఈ సమవేశంలో  కొసరాజు సాహిత్యంపై పరిశోధనచేసి పి.హెచ్.డి పట్టా, స్వర్ణ పతకం పొందిన డా. నల్లూరి రామారావు మఖ్యఅతిథిగా, విశిష్టఅతిథిగా పాల్గొన్న ‘కొసరాజు సినీవ్యాస సంహిత’ రచయిత చంద్రహాస్ మద్దుకూరి ప్రబృతులు కొసరాజు వైభవాన్ని వివిధ కోణాలలో విశ్లేషించారు. ముఖ్యఅతిథి డా. నల్లూరి రామారావు చేతుల మీదుగా కొసరాజు సాహిత్య సంపుటాలను ఆవిష్కరించారు.  

డా. నల్లూరి మాట్లాడుతూ “కొసరాజు కలంనుండి వెలువడ్డ కవితలు, శతకాలు, కావ్యాలు, సినీ గీతాలు ఒక విశిష్ట శైలిలో సాగాయన్నారు. వీరి రచనలలో గండికోట యుద్ధం, కడగండ్లు, కొసరాజు విసుర్లు, కొండవీటి వైభవం, నవభారతం, భానుగీత మొదలైనవి ముఖ్యమైనవి. వీటిలో కొసరాజుకు కూడా బాగా నచ్చినది గండికోట యుద్ధం అంటూ అందరూ తప్పక చదవవలసిన కావ్యం అన్నారు. కొసరాజు పద నిఘంటువును రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.”

చంద్రహాస్ మద్దుకూరి మాట్లాడుతూ ” సినిమా గీతాలలో కొసరాజు వాడిన అచ్చతెలుగు పదాలు, గ్రామీణ ప్రాంతపు మాటలు, పదప్రయోగాలు బహుశా ఏ ఇతర సినీగీత రచయిత చేసి ఉండరు అన్నారు. కొసరాజు పాటలు సరళంగాఉండి పండిత పామర జనులను సమంగా ఆకర్షించాయన్నారు. ఆయన పాటలకు టోపీ, లారీ, సిగరెట్, పేకాట, పకోడీ మొదలైనవి అన్నీ వస్తువులే అంటూ అందుకే అవి ప్రజలమధ్య చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. 


డా. ప్రసాద్ తోటకూర తన అధ్యక్షోపన్యాసంలో “రైతు అన్నదాత, కవి జ్ఞానదాత. ఈ రెండూ కలిసిన కొసరాజు - సాహితీ చైతన్య ప్రదాత అన్నారు. కేవలం నాల్గో తరగతి వరకు మాత్రమే చదువుకున్న కొసరాజు జానపద గీతాలలోని లాలిత్యం, పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమా పాటకు సొగసులద్దారు అన్నారు. అచ్చతెలుగు అందాలు, జానపదుల సొగసులు, పల్లెపట్టు చమత్కారాలు, విరుపులు కొసరాజు పాటలలో కొట్టొచ్చినట్లు కన్పిస్తాయి. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల వారి పాటలు ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన కొసరాజు గీతాలు ప్రజల మధ్య కలకాలం నిలిచి ఉంటాయనేది నిత్యసత్యం అంటూ ఘన నివాళులర్పించారు.”

కొసరాజు ప్రత్యేక సంగీత విభావరిలో – స్థానిక గాయనీ గాయకులు అభినుత మద్దుకూరి, అనంత్ మల్లవరపు, భారతి అంగలకుదిటి, చంద్రహాస్ మద్దుకూరి, మహిత మద్దుకూరి, పూజిత కడ్మిసెట్టి, ప్రభాకర్ కోట, రాజశేఖర్ సూరిభొట్ల, రామన్ వీరంరాజు, సాహితి కోటంరాజు, సాంబ కర్నాటి, శారద షణ్ముఖిలు హృద్యంగా గానం చేసిన - నిలువవే వాలు కనులదానా; ముద్దబంతి పూలు బెట్టీ మొగిలి రేకులు జడనుజుట్టి; మొగలిరేకుల సిగదానా, మురిడీ గొలుసుల పిలదానా; సరిగంచు చీరగట్టి బొమ్మంచు రైక తొడిగి; చిలకన్న చిలకవే బంగారు గిలకవే; నందామయా గురుడ నందామయా; కళ్లు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా; మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా; ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలుపేమున్నది; తింటానికి కూడు చాలదే జాంగిరీ - టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ; ఏడనున్నాడో, ఎక్కడున్నాడో నా చుక్కలరేడు; రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి; ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న; చెంగు చెంగునా గంతులు వేయండి; సై సై జోడెడ్లాబండీ బండి, షోకైనా దొరలాబండీ; అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే; బలే చాన్సులే బలే చాన్సులే...ఇల్లరికంలో ఉన్న మజా; సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరలు తాగు బల్ సిగిరెట్టు; నీ సోకు జూడకుండ నవనీతమ్మా, నే నిముసమైన బతకలేనె ముద్దులగుమ్మ; మా వూళ్ళో ఒక పడుచుందీ దయ్యమంటె భయమన్నది; రావే రావే బాలా హల్లో మై డియర్ లీల మొదలైన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

సాయి నృత్య అకాడమీ నాట్యగురు యడ్లపాటి శ్రీదేవి నిర్వహణలో – శ్రేష్ట వేముల, మనస్విని రెడ్డి పెంతాల, అనుప వేముల, పల్లవి తుమ్మలూరు ‘ఏరువాక సాగారోరన్న’, ‘కళ్ళు తెరిచి కనరా’, ‘సరిగంచు చీర కట్టి’ మొదలైన పాటలకు చేసిన నృత్యాలు కార్యక్రమంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిల్చాయి.

ఈ సంగీత విభావరికి ముందు మనసు ఫౌండేషన్ అధినేత మన్నం రాయుడు పంపిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. ఈ సాహిత్య సంపుటాలను ముద్రించడంలో ప్రముఖ పాత్ర వహించిన మనసు ఫౌండేషన్ సభ్యుడు పారా అశోక్ కుమార్‌ను డా. ప్రసాద్ తోటకూర ప్రశంసించి సాహిత్య పోషకులుగా సహకరించిన మురళి వెన్నం, చంద్రహాస్ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, ముఖ్యఅతిథి డా. నల్లూరి రామారావులను ఘనంగా సత్కరించారు.

సంగీత విభావరిలో పాల్గొన్న గాయనీ గాయకులను, నృత్య కళాకారులను డా. కృష్ణబాబు చుండూరి, డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ, గోపాల్ పోనంగి, మురళి వెన్నం, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, రాజారెడ్డి, చినసత్యం వీర్నపు, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, చంద్రశేఖర్ కన్నెగంటి, సురేష్ కాజ, అనంత్ మల్లవరపు, డా. రమణ జువ్వాడి, డా. నీలిమ మద్దుకూరి, డా. శ్రీదేవి జువ్వాడి, విజయమోహన్ కాకర్ల సన్మాన జ్ఞాపికలు అందచేసి దుశ్శాలువలతో ఘనంగా సత్కరించి అభినందించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Dallas
TANA
Literature News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం విజయవంతం

తానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం విజయవంతం

అమెరికాలో కాల్పుల ఘటనలు 

అమెరికాలో కాల్పుల ఘటనలు 

యువత గొంతును విందాం!

యువత గొంతును విందాం!

డల్లాస్‌లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం..!

డల్లాస్‌లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం..!

కవిత్వం నుంచి రాజ్యసభ వరకు.. శంకర కురుప్‌ అరుదైన ప్రస్థానం!

కవిత్వం నుంచి రాజ్యసభ వరకు.. శంకర కురుప్‌ అరుదైన ప్రస్థానం!

'నోబెల్‌' బెట్టింగుల్లో డేంజర్‌ బెల్స్‌!

'నోబెల్‌' బెట్టింగుల్లో డేంజర్‌ బెల్స్‌!

మరిన్ని వార్తలు

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీంకోర్టు షాక్‌...

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీంకోర్టు షాక్‌...

తానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం విజయవంతం

తానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం విజయవంతం

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో  రక్తదాన శిబిరం!

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం!

TAJ ఆధ్వర్యంలో టోక్యో ఓజిమాలో ఘనంగా దసరా వేడుకలు

TAJ ఆధ్వర్యంలో టోక్యో ఓజిమాలో ఘనంగా దసరా వేడుకలు

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

షాంఘైలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

షాంఘైలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft