Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. NRI
  3. మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
ADVERTISEMENT 

మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ

NRI Sakshi User Sakshi Sakshi Time Jun 17, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Sai_20Karthik_20Varma_20Datla.jpg

వాషింగ్టన్‌: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్  దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అమెరికాలోని మిస్సోరి (Missouri) రాష్ట్రంలో స్కైడైవింగ్ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సాయి కార్తీక్ వర్మ దాట్ల  కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన మొత్తం 12 మందిలో ఆయన ఒక్కరే భారతీయుడు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి' నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కాన్సాస్ సిటీలో హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో కాప్‌జెమినీ (Capgemini) లో పనిచేసిన ఆయన, ప్రస్తుతం అడ్వెంట్‌హెల్త్ (AdventHealth) సంస్థలో క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు.  

ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌ వార్నింగ్‌

కాన్సాస్ సిటీకి దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ మెమోరియల్ ఎయిర్‌పోర్ట్ నుండి ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయ్యింది. పైలట్‌తో పాటు 11 మంది స్కైడైవర్లతో ప్రయాణిస్తున్న 'పసిఫిక్ ఏరోస్పేస్ 750XL' విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానం భూమికి దాదాపు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎడమవైపునకు తిరిగి, పొలాల్లో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. విమానంలో ఇంజన్ పవర్ తగ్గిపోవడం వల్లే పైలట్ హైవేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని ఎయిర్‌పోర్ట్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. దీంతో విమానంలోవారందరూ ప్రాణాలు కోల్పోయారు.  వీరిలో అమెరికా పారాచూట్ అసోసియేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జెన్ షార్ప్ కూడా ఉన్నారు.

ఇదీ చదవండి: ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి 20 లక్షలు : ఎలా?

సాధారణ కమర్షియల్ విమానాల్లో ఉండేలాంటి 'బ్లాక్ బాక్స్' (డేటా రికార్డర్) ఈ చిన్న విమానంలో లభ్యం కాలేదు. దీంతో ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఇతర డిజిటల్ పరికరాలు, సాక్షుల ప్రకటనలు, వీడియోలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన పసిఫిక్ ఏరోస్పేస్ 750XL అనేది సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం. ఇది స్కైడైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ విమానం ప్రమాదానికి ముందు కూడా తొమ్మిదిసార్లు విజయవంతంగా ప్రయాణించిందని విమాన ట్రాకింగ్ సంస్థ తెలిపింది.

ఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
NRI
NRI News
missorie
plane crash
Indian origin
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

డాలర్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

డాలర్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

గల్ఫ్‌లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత

గల్ఫ్‌లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత

పోలీసులకు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోవడం లేదంటూ

పోలీసులకు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోవడం లేదంటూ

వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్‌ తీసుకోవచ్చా?

వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్‌ తీసుకోవచ్చా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.