Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. NRI
  3. ఇంటర్నెట్‌ లేదు.. ఇరాన్‌లో ఇదీ పరిస్థితి
ADVERTISEMENT 

ఇంటర్నెట్‌ లేదు.. ఇరాన్‌లో ఇదీ పరిస్థితి

NRI Sakshi User Sakshi Sakshi Time Jan 17, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
delhiairport.jpg

ఇరాన్‌లో అల్లకల్లోల పరిస్థితుల వేళ.. భారతీయుల తరలింపును భారత ప్రభుత్వం చేపట్టింది. ఆ ఆపరేషన్‌లో భాగంగా పలువురితో బయల్దేరిన రెండు విమానాలు గత అర్ధరాత్రి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ విదేశీ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా వీళ్ల ద్వారా అక్కడి పరిస్థితులను లోకల్‌ మీడియా సంస్థలు అడిగి తెలుసుకుంటున్నాయి.

ఢిల్లీకి చేరుకున్నవాళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. తాము సురక్షితంగా రావడానికి కేంద్రం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని.. పలు సూచనలు జారీ చేస్తోందని వివరించారు. ఎంబీబీఎస్‌ చదువుతున్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘నిరసనల గురించి విన్నాను. కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఇంటర్నెట్‌ లేకపోవడం పెద్ద సమస్యగా అనిపించింది’’ అని తెలిపింది. మరో యువకుడు మాట్లాడుతూ.. ‘‘వీధుల్లోకి వెళ్తే నిరసనకారులు కార్లను అడ్డుకునేవారు. ఇంటర్నెట్‌ లేకపోవడంతో కుటుంబాలకు కూడా సమాచారం ఇవ్వలేకపోయాం. చాలా భయమేసింది’’ అని అన్నాడు. ఇక.. 

ఇరాన్‌లో ఉద్యోగం కోసం వెళ్లిన ఒక ఇంజనీర్‌ ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడిందని చెప్పాడు. ‘‘ఇరాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కానీ, పరిస్థితి మరీ ఘోరంగా ఏం లేదు. నెట్‌వర్క్‌ సమస్య తప్ప పెద్ద ఇబ్బందులేం లేవు’’ అని అన్నాడు. మరో యువతి మాట్లాడుతూ.. టెహహ్రాన్‌ నిరసనలు ప్రమాదకరంగానే సాగాయని, ఘర్షణల్లో పలు భవాలకు నిప్పు పెట్టారని.. ఆ పరిస్థితుల్లో భయంగా గడిపామని తెలిపింది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినవారు ఎక్కువగానే కనిపించారు అని వివరించింది. 

డిసెంబర్‌ చివరిలో అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఇరాన్‌లో మొదలైన భారీ నిరసనలు.. భద్రతా బలగాల ప్రతిఘటనలతో 3,000 మందిని బలిగొన్నాయి. ఇందులో సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేల మందిని అరెస్ట్‌ చేయించింది ఖమేనీ ప్రభుత్వం. ఒకానొక తరుణంలో.. నిరసనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం చేసుకోవడం, ఇరాన్‌ ఖండన, మాటల యుద్ధం.. సైనిక ఘర్షణకు దారి తీయొచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సమయంలో భారత ప్రభుత్వం తన పౌరులకు ఇరాన్‌ ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా అదే సమయంలో.. 

జనవరి 15న ఇరాన్‌ గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో కొన్ని భారతీయ విమానాలు ప్రభావితమయ్యాయి. అయితే గల్ఫ్‌ దేశాల మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం పరిస్థితి కొంత చల్లారింది. అయినప్పటికీ భారతీయులు స్వదేశానికే వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. 

ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు

ఇరాన్‌లో సుమారు 10 వేలమంది భారతీయులు(విద్యార్థులు, ఉద్యోగులు, భారత మూలాలు ఉన్నవాళ్లు) ఉన్నట్లు విదేశాంగ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్ని తీసుకొచ్చిన రెండు విమానాలు కమర్షియల్‌ ప్లైట్సే. అయితే ఇవి రెగ్యులర్‌ విమానాలేనని.. ఎలాంటి ప్రత్యేక తరలింపు కాదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ తరలింపును నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
iran
Indians
evacuation
Indian students
NRI
NRI News
Delhi
MEA
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

 కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.