Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. NRI
  3. దుబాయ్‌లో ఘనంగా 16వ బతుకమ్మ సంబరాలు
ADVERTISEMENT

దుబాయ్‌లో ఘనంగా 16వ బతుకమ్మ సంబరాలు

NRI Sakshi User Sakshi Sakshi Time Oct 13, 2026 02:39 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
dubai.jpg

ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న దుబాయ్‌లోని షబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్‌లో 16వ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సుమారు 6వేల మందికి పైగా తెలంగాణ ప్రవాసులు పాల్గొని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ఘనంగా చాటారు.

ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథులుగా, దుబాయ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, గణేష్ బిగాల, షకీల్ అమీర్, సురేందర్ జాజల, బీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తదితర ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.

మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, కోలాటాలు, నృత్యాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..” అంటూ మహిళలు ఆలపించిన పాటలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.

ప్రముఖ సినీ, జానపద గాయని మధుప్రియ తన ప్రత్యేక ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. మాట్ల తిరుపతి, డాక్టర్ కోకిల నాగరాజు, అంజలి పులింతి తదితరుల ఆటపాటలు వేడుకలకు మరింత వైభవాన్ని తీసుకువచ్చాయి. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు విశేషంగా ఆకట్టుకోగా, బీఆర్‌ఎస్‌ నాయకుల ఆటపాటలు వచ్చిన జనాలను ఉర్రూత ఊగించాయి. హాజరైన వారందరికీ నిర్వాహకులు ఉచిత భోజనం అందించారు.

ఈ సంద‌ర్భంగా ETCA వ్యవస్థాపకులు పీచర కిరణ్ కుమార్, అధ్యక్షుడు చీటీ జగదీశ్ రావు మాట్లాడుతూ.. యుఏఈలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు, ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలంగాణ వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు ఆపదలో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలకు అండగా నిలవడం త‌మ‌ ప్రధాన లక్ష్యం అని అన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా చేనేత కళాఖండం
తెలంగాణ చేనేత కళా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే ప్రత్యేక కళాఖండం ఈ వేడుకల్లో మరో విశేషంగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వెండి పట్టు దారాలతో ముగ్గురు పాలకుల ముఖచిత్రాలను చేనేత వస్త్రంపై అద్భుతంగా రూపొందించారు.

ఇదీ చ‌ద‌వండి: అడిలైడ్‌లో బతుకమ్మ వేడుకలు అద‌ర‌హో

సుమారు రెండు మీటర్ల పొడవున్న ఈ కళాఖండం తయారీలో 26 గ్రాముల వెండిని వినియోగించారు. ఈ ప్రత్యేక డిజైన్ రూపకల్పనకు సుమారు 15 రోజులు పట్టగా, మగ్గంపై నేయడానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టిందని హరిప్రసాద్ తెలిపారు. ఈ కళాఖండాన్ని ETCA ప్రతినిధులు దుబాయ్ కాన్సుల్ జనరల్ విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా దుబాయ్ పాలక కుటుంబానికి అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో ETCA కార్యవర్గ సభ్యులు పీచర కిరణ్ కుమార్, చీటీ జగదీశ్ రావు, రాణి కోట్ల, అలిగేటి శ్రీనివాస్, గుండవేని శేఖర్, తిరుమల రావు బీరెల్లి, రాధారపు సత్యం, మామిడి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సాయి చందర్, సురేష్ రెడ్డి, రఘు అలిగేటి, వినోద్ ఆచార్యులు, ఎస్.పీ. కస్తూరి, సంతోష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సారిక, మమత, సరోజ, రణీశ, మౌనిక, రాజేష్, కార్తీక్ రెడ్డి, రమణ, మధు కుమార్, రణధీర్, రవి చంద్ర కొక్కొండ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: డాలస్‌లో ఘనంగా శంకర నేత్రాలయం సాంస్కృతిక కార్యక్రమం

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Dubai
NRI
batukamma festival celebrations
batukamma celebrations
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో  రక్తదాన శిబిరం!

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం!

60 పుస్తకాలు చదివి కోట్లు గడించిన చిన్నారి!

60 పుస్తకాలు చదివి కోట్లు గడించిన చిన్నారి!

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్..! వీడియో వైరల్

ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్..! వీడియో వైరల్

బాస్ సర్‌ప్రైజ్‌.. ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్!

బాస్ సర్‌ప్రైజ్‌.. ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్!

రూ. 4 కోట్ల సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌

రూ. 4 కోట్ల సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌

మరిన్ని వార్తలు

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీంకోర్టు షాక్‌...

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీంకోర్టు షాక్‌...

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో  రక్తదాన శిబిరం!

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం!

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

షాంఘైలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

షాంఘైలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

డల్లాస్‌లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం..!

డల్లాస్‌లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం..!

కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులకు శంకరరత్న పురస్కారం

కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులకు శంకరరత్న పురస్కారం

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft