Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. డ్రగ్స్‌ వ్యసనాన్ని దూరం చేసే యోగా.. తాజా పరిశోధనల్లో అద్భుత ఫలితాలు
ADVERTISEMENT 

డ్రగ్స్‌ వ్యసనాన్ని దూరం చేసే యోగా.. తాజా పరిశోధనల్లో అద్భుత ఫలితాలు

National Sakshi User Sakshi Sakshi Time Jan 10, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Withdrawal-Time.jpg

మత్తు పదార్థాల వ్యసనం అనేది త్వరగా వదిలించుకోలేని దురలవాటు అని చెబుతుంటారు. ఈ  ఊబిలో చిక్కుకున్న వారు దానిని వదిలించుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే బెంగళూరులోని నిమ్హాన్స్ (NIMHANS) శాస్త్రవేత్తలు డ్రగ్‌ అడిక్ట్స్‌కు ఉపకరించే పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ప్రాచీన భారతీయ విద్య యోగాను ఆధునిక వైద్యానికి మేళవించి, చికిత్స అందించడం ద్వారా, డ్రగ్స్ బానిసలు అతి స్వల్ప కాలంలోనే వ్యసనాల నుంచి విముక్తులవుతున్నట్లు వారి తాజా పరిశోధనల్లో తేలింది.

సాధారణంగా డ్రగ్స్ మానేసే సమయంలో తలెత్తే బాధాకరమైన లక్షణాల నుండి కోలుకునేందుకు బాధితులు వరుసగా కొన్ని రోజుల పాటు ఔషధాలు వాడాల్సి ఉంటుంది. అప్పుడే వారికి ఉపశమనం లభిస్తుంది. అయితే నిమ్హాన్స్ పరిశోధకులు.. మందులతో పాటు యోగాను జోడించి, బాధితులు కేవలం ఐదు రోజుల్లోనే కోలుకునేలా చేయగలిగారు. అంటే బాధితులు కోలుకునే సమయం దాదాపు సగానికి తగ్గింది. ఈ పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ వైద్య పత్రిక ‘జామా సైకియాట్రీ’లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా యోగా గొప్పదనాన్ని తెలియజేశాయి.

ఈ చికిత్స కోసం పరిశోధకులు ప్రత్యేక రీతిలో 45 నిమిషాల యోగా విధానాన్ని రూపొందించారు. ఇందులో బాధితులు పడుకుని చేసే విశ్రాంతి భంగిమలు (Supine relaxation), ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించే శ్వాస ప్రక్రియలు, ఎడమ ముక్కు ద్వారా శ్వాస పీల్చడం, భ్రామరి ప్రాణాయామం  మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రక్రియలు డ్రగ్స్ మానేసే సమయంలో రోగికి కలిగే తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేశాయి.

డ్రగ్స్ మానేసే క్రమంలో బాధితులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్యలు నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, ఒంటి నొప్పులు. యోగా చికిత్స పొందిన బాధితులలో నిద్రపోయే సమయం (Sleep Latency) సగటున ఒక గంట మేరకు మెరుగుపడింది. అలాగే మందులతో తగ్గని మానసిక ఆందోళన (Anxiety) కూడా యోగా వల్ల త్వరగా అదుపులోకి వచ్చినట్లు డాక్టర్ భరత్ హోల్లా వెల్లడించారు.

ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు.. బాధితుల గుండె స్పందనల వేరియబిలిటీ (హెచ్‌ఆర్‌ఏ)ని కూడా లెక్కించారు. యోగా చేయడం వల్ల శరీరంలోని పారాసింపథెటిక్ వ్యవస్థ ఉత్తేజితమై, ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ప్రభావం తగ్గుతున్నట్లు వారు గుర్తించారు. ఈ శారీరక మార్పుల  కారణంగానే బాధితులు 25 శాతం మేరకు వేగంగా కోలుకుంటున్నారని డేటా విశ్లేషణలో స్పష్టమైంది.

కాగా కర్ణాటకలో యువతలో పెరుగుతున్న మత్తు అలవాట్లపై ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం యువత ‘టాపెంటాడాల్’ అనే సింథటిక్ డ్రగ్స్‌కు ఎక్కువగా బానిసలవుతున్నారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది 20 ఏళ్ల వయసున్న యువకులే కావడం గమనార్హం. వీరిలో ఎక్కువమంది కర్ణాటకకు చెందిన వారు కాగా, పశ్చిమ బెంగాల్,  మణిపూర్ రాష్ట్రాల వారు కూడా ఉన్నారని సెంటర్ హెడ్ డాక్టర్ ప్రభాత్ చంద్ తెలిపారు.

ఈ యోగా చికిత్సకు ఎటువంటి ఖరీదైన పరికరాలు లేదా ప్రత్యేక గదులు అవసరం లేదు. శిక్షణ పొందిన థెరపిస్టులు బాధితుని పడక వద్దే ఈ వ్యాయామాలను చేయించవచ్చు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన ప్రక్రియ. ఇప్పటికే ఉన్న వైద్య చికిత్సకు దీనిని అదనంగా చేర్చడం ద్వారా ప్రజారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని నిమ్హాన్స్ ప్రతినిధులు  చెబుతున్నారు. ప్రస్తుతం ఆరు నెలల పాటు డ్రగ్స్ మళ్లీ వాడకుండా ఉండే దశపై నిమ్హాన్స్ డైరెక్టర్ ప్రతిమ మూర్తి పర్యవేక్షణలో అధ్యయనం కొనసాగుతోంది. 

ఇది కూడా చదవండి: విద్యుత్‌ విప్లవం: వేలాడే వైర్లు.. భయపెట్టే ట్రాన్స్‌మీటర్లు కనుమరుగు

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Yoga
Withdrawal
Time
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

యోగాతో ప్రపంచ శాంతి 

యోగాతో ప్రపంచ శాంతి 

యోగాసనం.. ఆరోగ్యశాసనం

యోగాసనం.. ఆరోగ్యశాసనం

ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది.. మోదీ

ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది.. మోదీ

పరేడ్‌ గ్రౌండ్స్‌లో యోగా డే వేడుకలు.. ప్రముఖుల ఆసనాలు (ఫొటోలు)

పరేడ్‌ గ్రౌండ్స్‌లో యోగా డే వేడుకలు.. ప్రముఖుల ఆసనాలు (ఫొటోలు)

బ్రెయిన్‌కు బూస్ట్‌.. ఇక ఆందోళనకు చెక్‌!

బ్రెయిన్‌కు బూస్ట్‌.. ఇక ఆందోళనకు చెక్‌!

గుప్పెళ్లతో మందులొద్దు.. యోగాతో రోగాలకు చెక్!

గుప్పెళ్లతో మందులొద్దు.. యోగాతో రోగాలకు చెక్!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.