Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మంత్రి పదవికంటే విలువైనదా? ఆ శాఖ కోసం ఎందుకింత పోటీ?
ADVERTISEMENT 

మంత్రి పదవికంటే విలువైనదా? ఆ శాఖ కోసం ఎందుకింత పోటీ?

National Sakshi User Sakshi Sakshi Time Jun 6, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
588.jpg

సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు లేదా శాఖల కేటాయింపు సమయంలో ఎప్పుడూ పదేపదే వినిపించే పేరు ‘బెంగళూరు నగరాభివృద్ధి శాఖ’. ఇప్పటివరకు ఈ శాఖను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే శివకుమార్‌ చూసుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్‌ కేబినెట్‌లో బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కోసం తీవ్ర పోటీ నెలకొంది. అవును.. కర్ణాటకలో డీకే శివకుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు రోజులైంది. శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖను కృష్ణభైరేగౌడకు డీకే శివకుమార్‌ అప్పగించారు. అయితే బెంగళూరు నగరాభివృద్ధి శాఖపై కొండంత ఆశతో ఉన్న రామలింగారెడ్డికి ఇది అసలు నచ్చలేదు.. తనకు ఆ శాఖ కేటాయించలేదనే కారణంతో అసంతృప్తికి లోనై మనస్తాపానికి గురై ఏకంగా మంత్రి పదవికే రామలింగారెడ్డి రాజీనామా చేశారు. అసలు ఆ బెంగళూరు నగరాభివృద్ధి శాఖలో ఏముంది ఇంతకీ? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.. ఎందుకింత పోటీ నెలకొంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి.  

ఆర్థిక ఇంజిన్‌గా బెంగళూరు 
బెంగళూరు అంటే కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు. ప్రపంచ స్థాయిలో ఐటీ హబ్‌గా పేరు గాంచింది. అధికారానికి అక్షయపాత్ర ఈ బెంగళూరు మహానగరం. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా బంగారు ఖనిజంగా చెప్పొచ్చు. కర్ణాటక రాష్ట్రం మొత్తానికి అత్యధిక రెవెన్యూ అందించే ఆర్థిక ఇంజిన్‌ ఈ బెంగళూరు నగరం. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ స్థాయిలో బ్రాండ్‌ బెంగళూరు ఇమేజ్‌పై ప్రభావం చూపుతాయి. ఈ శాఖ బాధ్యతలు నిర్వహించే నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో  ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నత స్థానం దక్కినట్లుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు అధిక డిమాండ్‌ ఏర్పడింది.  

బడ్జెట్‌లో అధిక కేటాయింపులు 
బెంగళూరు కేవలం రాజధాని మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక శక్తి కేంద్రం. దేశంలో సిలికాన్‌ వ్యాలీగా ప్రసిద్ధి పొందిన ఈ మహానగరం నుంచి ఒక్కసారి నాయకుడిగా ఎన్నికైతే ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు పొందవచ్చు. అత్యున్నత రాజకీయ గౌరవం, శక్తి లభిస్తుంది. అందుకే ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగా రాజకీయంగా క్రియాశీలకంగా మారే అవకాశాలు మెండుగా ఉంటాయని నాయకులు భావిస్తారు. అలాగే ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు లభించే బడ్జెట్‌ కూడా సామాన్యమైనది కాదు. వేలాది కోట్ల రూపాయల మేర భారీ బడ్జెట్‌ కేటాయింపులు ఈ శాఖకు దక్కుతాయి. అనేకానేక పథకాలు, ప్రాజెక్టులు ఈ శాఖకు బడ్జెట్‌లో లభిస్తాయి. నమ్మ మెట్రో విస్తరణ, ఫ్లై ఓవర్లు, సొరంగ మార్గాలు, రాజ కాలువలు, చెరువుల అభివృద్ధి, నగర ట్రాఫిక్‌ నిర్వహణ తదితర కోట్లాది రూపాయల ప్రాజెక్టుల పరిశీలన, బాధ్యత నేరుగా సంబంధిత శాఖ మంత్రిపై ఉంటాయి.  

స్థానిక ఎమ్మెల్యేలకే ప్రేమ ఎక్కువ.. 
వాస్తవానికి బెంగళూరు నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖపై కేవలం బెంగళూరు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కన్ను వేస్తుంటారు. ఉత్తర కర్ణాటక, మధ్య కర్ణాటక ఎమ్మెల్యేలు ఎవరూ ఈ శాఖను నిర్వహించేందుకు ఇష్టపడరు. ఈ శాఖ కేవలం బెంగళూరు నగరానికే పరిమితం కావడంతో వారు దీన్ని స్వీకరించేందుకు ముందుకు రారు. బెంగళూరు నగర ఎమ్మెల్యేలు ఎక్కువగా ఈ శాఖను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పటివరకు ఈ శాఖకు మంత్రులుగా చేసిన వారు కూడా చాలా మంది బెంగళూరు వాసులే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన అవసరం లేకపోవడం, సొంత నియోజకవర్గంలో ఉంటూ ఈ శాఖ బాధ్యతలు చూసుకునే వెసులుబాటు ఉండడంతో బెంగళూరు ఎమ్మెల్యేలు దీనికోసం పట్టుబడుతున్నారు. ఆఖరికి కొత్తగా ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కృష్ణబైరేగౌడ సైతం బెంగళూరు వాసి కావడం గమనార్హం.

ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడే.. 
బెంగళూరు అభివృద్ధిని, భవిష్యత్తును రూపొందించే, అత్యంత ప్రభావవంతమైన ప్రముఖ ప్రభుత్వ సంస్థలు కూడా ఈ శాఖ కిందకే వస్తాయి. బీడీఏ (బెంగళూరు అభివృద్ధి ప్రాధికార, బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ (బెంగళూరు జలమండలి), జీబీఏ (గ్రేటర్‌ బెంగళూరు అథారిటీ) తదితర ప్రభుత్వ రంగ పెద్ద సంస్థలు, వాటి కార్యాలయాలు బెంగళూరులోనే ఉంటాయి. ఆ సంస్థల నిర్ణయాలు, నియామకాలు మొత్తానికి పాలన పూర్తిగా బెంగళూరు నగరాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తాయి. బెంగళూరులో మౌలిక వసతుల పెంపుదల కోసం ఏటికేడాది ప్రభుత్వాలు కేటాయింపులను పెంచుతూ పోతున్నాయి. దీనికితోడు బెంగళూరులో వేగంగా విస్తరిస్తున్న రియల్‌ ఎస్టేట్, అనేక పరిశ్రమలు, పెట్టుబడులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఈ మహానగరం నిలుస్తోంది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
karnataka
Development
ministry
Congress Party
bengaluru
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!

ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!

పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్‌ ఎందుకు?

పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్‌ ఎందుకు?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!

భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.