Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘హిట్‌ అండ్‌ రన్‌’కు ఏ దేశంలో ఎటువంటి శిక్ష?
ADVERTISEMENT 

‘హిట్‌ అండ్‌ రన్‌’కు ఏ దేశంలో ఎటువంటి శిక్ష?

National Sakshi User Sakshi Sakshi Time Jan 31, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
run.jpg

కేంద్ర ప్రభుత్వం ‘హిట్ అండ్ రన్’ కేసులో కఠినమైన నిబంధనలను రూపొందించింది. పదేళ్ల  జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా విధించింది. దేశంలో చాలావరకూ రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. మనదేశాన్ని మినహాయించి ఇతర దేశాల్లో ‘హిట్ అండ్ రన్’ కేసులలో ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో వాహన చట్టం, 1927 ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత, పోలీసులు అక్కడికి వచ్చి చర్యలు చేపట్టే వరకు వాహనం డ్రైవర్ తన వాహనంతో పాటు అక్కడే ఉండాలి. బంగ్లాదేశ్‌లో హిట్ అండ్ రన్ లేదా ఏ వాహన సంబంధిత ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అందుకు కారకులైనవారు నేరస్తులవుతారు. ‘హిట్‌ అండ్‌ రన్‌’కేసులో మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంది.  ఇటువంటి కేసులో డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేస్తారు. అతనికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉండదు. 

చైనా

చైనాలో ‘హిట్ అండ్ రన్‌’లో  పెను ప్రమాదం జరిగితే నేరస్తుని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. జీవితకాల నిషేధం కూడా  ఉండవచ్చు. చైనా క్రిమినల్ కోడ్, ఆర్టికల్ 133 కింద హిట్ అండ్ రన్ కేసులో తీవ్రమైన శారీరక హాని లేదా మరణం సంభవించినట్లయితే, నేరస్తునికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 

బ్రిటన్

యూకేలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ తన పూర్తి పేరు, చిరునామాను పోలీసులకు తెలియజేయాలి. అలాంటి సందర్భాలలో నేరస్తునికి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష, ఐదు వేల పౌండ్ల జరిమానా కూడా ఉంటుంది. దీనితో పాటు అతను డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధిస్తారు.

అమెరికా

యునైటెడ్ స్టేట్స్‌లో ‘హిట్ అండ్ రన్‌’లో విధించే శిక్ష ప్రతీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. దీనిని థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. శిక్షాకాలం ఒకటి నుంచి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. 

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో హిట్‌ అండ్‌ రన్‌ ఉదంతంలో డ్రైవర్ ప్రమాద స్థలంలో వాహనాన్ని ఆపి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ నేరాల కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఉంది. ఇది ప్రతి రోడ్డు ప్రమాదంలో దాని తీరుతెన్నులను గమనించి డ్రైవర్‌కు ఒక పాయింట్‌ను ఇస్తుంది. దీని ప్రకారం డ్రైవర్‌కు జరిమానా విధించవచ్చు. లేదా అతని లైసెన్స్‌ను సస్పెండ్  లేదా రద్దు చేసే అవకాశం ఉంది. 

కెనడా

కెనడాలో క్రిమినల్ కోడ్ ప్రకారం ‘హిట్ అండ్ రన్’ను నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే అందుకు కారకులపై గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. 

దక్షిణ కొరియా

దక్షిణ కొరియాలో ‘హిట్ అండ్ రన్’ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి ప్రమాదంలో ఎవరైనా చనిపోయి, డ్రైవర్ పరారైతే అతనికి కనీసం ఐదేళ్ల జైలు లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. దీనితో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది. 

హాంకాంగ్‌

హాంకాంగ్‌లో ప్రమాదం జరిగిన తర్వాత, డ్రైవర్ వెంటనే వాహనం ఆపివేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరస్తుడు  హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదంలో బాధితులకు సహాయం చేయకపోతే, అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. 

న్యూజిలాండ్

న్యూజిలాండ్‌లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు వాహనాన్ని తప్పనిసరిగా ఆపాలి.  ఒకవేళ డ్రైవర్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోతే, అతనికి మూడు నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అతని డ్రైవింగ్ లైసెన్స్ కనీసం ఆరు నెలల పాటు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే అందుకు కారకులపై ఐదేళ్ల జైలు శిక్ష లేదా 20 వేల న్యూజిలాండ్ డాలర్లు జరిమానాగా విధించే అవకాశం ఉంది. అలాగే అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏడాది పాటు రద్దు చేసేందుకు అవకాశం ఉంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Hit and run case
India
goveranament
punishment
Accident
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టూరిస్టు బోటు బోల్తా.. 10 మందికి పైగా మృతి

టూరిస్టు బోటు బోల్తా.. 10 మందికి పైగా మృతి

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

అనకాపల్లి పరవాడ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం

అనకాపల్లి పరవాడ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.