Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. పుట్టినరోజు నాడే.. విజయ్‌ నుంచి బిగ్‌ లాంచ్‌?
ADVERTISEMENT 

పుట్టినరోజు నాడే.. విజయ్‌ నుంచి బిగ్‌ లాంచ్‌?

National Sakshi User Sakshi Sakshi Time Jun 13, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Vijay_TVK_Channel.jpg

రాజకీయాల్లో గెలవాలంటే కేవలం ప్రజాబలం మాత్రమే కాదు.. తమ మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లే ‘బలం’ కూడా అవసరమే. అందుకే డిజిటల్‌ యుగంలో సోషల్‌ మీడియాను అన్‌లిమిటెడ్‌గా వాడేసుకుంటున్నాయి పార్టీలు. అలాగే.. పార్టీలకు అనుకూలంగా పేపర్లు, టీవీ చానెల్స్‌ ఉండటం కొత్త విషయం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్‌ విజయ్‌ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ టీవీకే పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే ఆ గెలుపులో మీడియా కంటే.. సోషల్‌ మీడియానే అధిక పాత్ర పోషించింది. అందుకు కారణం.. అప్పటి అధికార, ప్రతిపక్షాల చేతుల్లోనే మీడియా చానెల్స్‌, పేపర్లు మొత్తం ఉండడం. ఆ సమయంలో ఆయన ఈ పరిస్థితిని పార్టీ మీటింగ్‌లోనూ ప్రస్తావించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు తన టీవీకే పార్టీ తరఫున కొత్త వార్తా చానెల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. 

జూన్‌ 22న ‘వెట్రి న్యూస్‌’ అనే న్యూస్‌ చానెల్‌ సీఎం విజయ్‌ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోందట. అదే రోజు ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. తమిళగ వెట్రి కగళం అంటే తమిళ విక్టరీ క్లబ్‌ అని అర్థం. విజయ్‌ తన పేరులోని విజయాన్ని పార్టీకి పెట్టారు. ఇప్పుడు చానెల్‌కు కూడా వెట్రి(విజయం) అనే ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ప్రముఖ ఇన్‌ఫ్లున్సెయర్‌, పొలిటికల్‌ అనలిస్ట్‌గా పేరుగాంచిన మణికందన్‌ భాస్కరన్‌ తన bbtrackermanix ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయం ప్రకటించారు. దీంతో టీవీకే వర్గాలు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి.    

రాజకీయ పార్టీలు, మీడియా మధ్య ఉన్న అనుబంధం దేశంలో.. తమిళనాడులో కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా రాజకీయాలు, మీడియా రంగం పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీలు మీడియా వేదికలను వినియోగించుకోవడం సాధారణంగా మారిపోయింది.

తమిళనాడులో అధికార డీఎంకేకు మద్దతుగా భావించే మీడియా సంస్థల్లో ప్రముఖంగా సన్‌ టీవీ గ్రూప్‌ పేరు వినిపిస్తుంది. డీఎంకే తొలి కుటుంబంతో సన్‌ గ్రూప్‌కు ఉన్న సాన్నిహిత్యం బహిరంగ రహస్యమే. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అనుబంధంగా జయ టీవీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. పార్టీ కార్యక్రమాలు, నాయకత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ఛానెల్‌ కీలక పాత్ర పోషించింది. అలాగే విజయ్‌కాంత్‌ పార్టీ కోసం కెప్టెన్‌ అనే ఓ చానెల్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతెందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (AMMK) నేత టీవీవీ దినకరన్‌కు అనుకూలంగా జయా న్యూస్‌, ఇతర మీడియా వేదికలు పనిచేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అధికారాన్ని అందుకున్న విజయ్‌ ఇప్పుడు మీడియా రంగంలో కూడా తన ముద్ర వేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ సందేశాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘వెట్రి న్యూస్‌’ వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఛానెల్‌ పూర్తిస్థాయి వార్తా సంస్థగా పనిచేస్తుందా? లేదంటే పార్టీ అనుకూల వేదికగా నిలుస్తుందా? అన్నది ప్రారంభం తర్వాతే స్పష్టత రానుంది. 

వెట్రి న్యూస్‌ చానెల్‌ యాజమాని ఎవరు?.. దాని వెనుక ఏ సంస్థ అయినా స్పాన్సర్‌షిప్‌ ఉండనుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. విజయ్‌కు అత్యంత ఆప్తుడైన ఓ వ్యాపారవేత్త ఈ చానెల్‌ను టేకప్‌ చేస్తారని.. డీఎంకే హయాంలో వివాదాస్పదుడిగా పేరుగాంచిన ఓ ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆ చానెల్‌ను హ్యాండిల్‌ చేయబోతున్నారని ప్రచారం మాత్రం జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే శాటిలైట్‌, డిజిటల్‌ విభాగాల కోసం జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు, జిల్లా రిపోర్టర్లు, న్యూస్‌ ఎడిటర్లు తదితర పోస్టులకు నియామక ప్రకటనలు కూడా వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ఇటు ఛానెల్‌ ప్రారంభంపై తమిళగ వెట్రి కళగం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
tamil nadu
TVK Vijay
Vijay
tv channel
news channel
Tamilaga Vettri Kazhagam
Tamil Nadu politics
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

విజయ్‌ ఆకస్మిక తనిఖీ.. ఉలిక్కిపడ్డ అధికారులు!

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్‌లోనే అరుదైన ఘటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.