Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఆ తీర్పు నా ఒక్కడిది కాదు 
ADVERTISEMENT 

ఆ తీర్పు నా ఒక్కడిది కాదు 

National Sakshi User Sakshi Sakshi Time Aug 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bsu.jpg

సుప్రీం కోర్టు ‘సల్వాజుడుం’తీర్పు విషయంలో అమిత్‌షాతో వాదించబోను 

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి స్పష్టీకరణ 

న్యూఢిల్లీ: సాయుధ సల్వాజుడుం వ్యవస్థను సుప్రీంకోర్టు వ్యతిరేకించడం వల్లే నక్సలిజం ఇంకా ఉనికిలో ఉందని, దీనికి పరోక్షంగా సుదర్శన్‌రెడ్డి కారణమని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా చేసిన విమర్శలపై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విభేదించారు. శనివారం పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి మాట్లాడారు. 

‘‘సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలందరి ప్రాణాలు, ఆస్తులు కాపాడే హోం మంత్రి అమిత్‌ షాతో నేరుగా వాగ్వాదం పెట్టుకోదల్చుకోలేదు. 2011 డిసెంబర్‌లో సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని నేనే రాశాను. కానీ ఆ అభిప్రాయం నాది కాదు. అది సుప్రీంకోర్టు అభిప్రాయం. తీర్పు పూర్తిపాఠం అమిత్‌ షా చదవి ఉండకపోవచ్చు. అందుకే ఆయన నన్ను విమర్శిస్తున్నారు. 40 పేజీల ఆ తీర్పు మొత్తాన్నీ చదివితే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఆయనకు ఖచ్చితంగా అవగతమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పదల్చుకోలేదు.

 ఇంతటితో ఈ అంశంపై చర్చ ముగిస్తే బాగుంటుంది’’అని సుదర్శన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. నక్సలిజాన్ని అంతంచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం గిరిజన యువతకు తుపాకులిచ్చి సల్వా జుడుం(కోయ కమెండోలు) పేరితో సాయుధ వ్యవస్థను అమలుచేయగా, ఇది చట్టవిరుద్ధమని ఈ సాయుధ పౌర మిలటరీ వ్యవస్థను వెంటనే నిర్విర్యంచేయాలని సుప్రీంకోర్టు ఆనాడు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఉన్నారు. దీంతో నక్సలిజం పట్ల సుదర్శన్‌ రెడ్డికి సానుభూతి ఉందని, అందుకే అలా తీర్పిచ్చారని అమిత్‌ షా శుక్రవారం ఆరోపించడం తెల్సిందే. 

ప్రజాస్వామ్యంలో లోటు 
‘‘రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. సవాళ్లతో సతమతమవుతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా. పార్లమెంట్‌లో సభ్యుల నిరసన కారణంగా సభా కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలగడం సహజం. నిరసన అనేది అత్యావశ్యకం. కానీ అదే పనిగా నిరసన తెలపడం అనేది సమస్యాత్మకంగా మారుతుంది. గతంలో వాణిజ్యలోటు గురించి జనం మాట్లాడుకునేవాళ్లు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో సైతం లోటు కన్పిస్తోంది. మొదట్నుంచీ భారత్‌ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంగా పరిఢవిల్లినప్పటికీ నేడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. 

ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగంపై దాడి అనే అంశంపై ఖచ్చితంగా చర్చించాల్సిందే. ప్రజాస్వామ్యం అంటే వ్యక్తుల మధ్య పోటీ కాదు. సిద్ధాంతాల మధ్య పోటీ మాత్రమే. ఎప్పుడైనా సరే ప్రభుత్వం, విపక్షం మధ్య సఖ్యత చెడిపోకూడదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా అది చాలా ముఖ్యం. విపక్షాలు ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి అభ్యరి్థని ఎన్నుకోవడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ఎంపిక అనేది మూడు అంశాలను స్పష్టంచేస్తుంది. ఒకటి వైవిధ్యం. విపక్షంలోని వివిధ పారీ్టలు నన్ను ఎన్నుకున్నాయి. రెండో ఏకగ్రీవ ఎన్నిక. ఇక మూడోది దీటైన ఓటింగ్‌ సామర్థ్యం. 

ఒకరంగా విశ్లేషిస్తే దేశ జనాభాలో దాదాపు 63 శాతం జనాభాకు ఈ పారీ్టలు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. ఇంతకుమించిన గౌరవం ఏముంటుంది’’అని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘ఉపరాష్ట్రపతి పదవికి దేశంలో ఎలాంటి పోటీ లేకుండా ఎకగ్రీవంగా ఎన్నిక పూర్తవ్వాలి. కానీ రాజకీయాల్లో విబేధాలు సహజం. అందుకే అధికార, విపక్షాల మధ్య ఇలా పోటీ అనివార్యమైంది’’అని అన్నారు. ‘‘కులగణనకు మద్దతిస్తా. ఎందుకంటే ఎవరైతే వెనుకబడ్డారో, అభ్యున్నతికి నోచుకోలేదో వాళ్లను గుర్తించి ఎదిగేందుకు సాయపడాలంటే కులగణన చేయాల్సిందే’’అని ఆయన వ్యాఖ్యానించారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Supreme court of India
naxalism
Amit Shah
criticisms
vice president
Sudarshan reddy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.