ఓ ఎద్దు.. తాపీగా బ్యాంకులోకి నడుచుకుంటూ వచ్చింది. ఆ దృశ్యం చూసి బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు జడుసుకుని ఓ మూలకు వెళ్లారు. అయినా అది బెదరకుండా ముందుకు వెళ్లపోయింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు లాఠీతో దానిని వెనక నుంచి బయటకు తోలేసే యత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది.
ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లా షాగంజ్ ఎస్బీఐ బ్యాంకులో బుధవారం ఈ చిత్రం జరిగింది. అంతకు ముందు బ్యాంక్ బయట అది మరో ఎద్దుతో పోట్లాడిందట. ఈ క్రమంలోనే ఆ ఎద్దు బ్యాంక్ ఎంట్రెన్స్ డోర్ తెరిచి ఉండడంతో లోపలికి వచ్చేసిందని సెక్యూరిటీ గార్డు చెబుతున్నాడు. ఆ సమయంలో కస్టమర్లు పెద్ద సంఖ్యలో లేకపోవడంతో ప్రమాదం తప్పిందని మేనేజర్ అంటున్నారు.
Bull Steals the Spotlight: Unlikely Visitor Creates Stir at SBI Bank in Unnao, Uttar Pradesh. 😂 🐂
Watch the viral video 📽️#SBI #Unnao #UttarPradesh #ViralVideo pic.twitter.com/lzonqeuXw9— Lokmat Times (@lokmattimeseng) January 11, 2024
VIDEO CREDITS: Lokmat Times
కిందటి ఏడాది ఏమో అనుకుంటాం.. అసోం దుభ్రిలో ఓ ఎద్దు షాపింగ్‌మాల్ మొత్తం కలియదిరిగి తెగ వైరల్ అయిపోయింది.
