Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం
ADVERTISEMENT 

ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం

National Sakshi User Sakshi Sakshi Time May 16, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
three.jpg

48 గంటల్లో రెండో ఎన్‌కౌంటర్‌

ముగ్గురు ఉగ్రవాదులూ పుల్వామా వాసులే

లొంగిపోవాలని తల్లి వేడుకున్నా వినని ఉగ్రవాది

ముష్కరులు దాక్కున్న చోటు వీడియోలు వైరల్‌

త్రాల్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, త్రాల్‌ ప్రాంతంలోని నాదిర్‌ గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్‌ అహ్మద్‌ షేక్, అమీర్‌ నజీర్‌ వని, యావర్‌ అహ్మద్‌ భట్‌గా గుర్తించారు. వీరందరూ పుల్వామా జిల్లా వాసులే. 

ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్, సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఉగ్రవాదుల జాడ కోసం భద్రతాదళాలు డ్రోన్లను ఉపయోగించాయి. ఉగ్రవాదులను గుర్తించిన అనంతరం.. లొంగిపోవాలని కోరాయి. అయితే, భద్రతా సిబ్బందిని చూసిన వెంటనే, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూడు గంటల పాటు కాల్పులు జరిగాయి. 

ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉండొచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. దీంతో ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.  జమ్మూకశ్మీర్‌లో 48 గంటల్లో జరిగిన రెండో ఎన్‌కౌంటర్‌ ఇది. మంగళవారం షోపియాన్‌ జిల్లాలోని కెల్లర్‌ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయిన సంగతి తెలిసిందే.

లొంగిపోవాలని తల్లి వేడుకున్నా...
మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరైన అమీర్‌ నజీర్‌ ఎన్‌కౌంటర్‌కు ముందు తల్లితో మాట్లాడిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఎన్‌కౌంటర్‌కు ముందు చివరి క్షణాల్లో నజీర్‌ తను దాక్కున్న ప్రదేశం నుంచి తల్లికి వీడియో కాల్‌ చేశాడు. తన తల్లితో, సోదరితో మాట్లాడాడు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని, భద్రతాదళాలకు లొంగి పోవాలని నజీర్‌ను తల్లి వేడుకుంది. ఏకే 47 పట్టుకుని ఉన్న నజీర్‌ లొంగిపోవడానికి నిరాకరించాడు. ‘సైన్యాన్ని నా ముందుకు రానివ్వండి. అప్పుడు చూస్తా’ అని బదులిచ్చి కాల్‌ కట్‌ చేశాడు.  
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Jammu Kashmir
pulwama district
security forces Soldiers
Three Dead
Jaish-e-Mohammed terrorists
Encounter
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

పాక్‌ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్‌ అక్కడే!

పాక్‌ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్‌ అక్కడే!

ఒకే కశ్మీర్.. రెండు విభిన్న వాస్తవాలు!

ఒకే కశ్మీర్.. రెండు విభిన్న వాస్తవాలు!

నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌

నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌

దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

కశ్మీర్‌లో ఖమేనీ ఎఫెక్ట్‌.. ఎంపీ, మేయర్‌పై కేసు నమోదు

కశ్మీర్‌లో ఖమేనీ ఎఫెక్ట్‌.. ఎంపీ, మేయర్‌పై కేసు నమోదు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.