Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఫైర్‌
ADVERTISEMENT 

బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఫైర్‌

National Sakshi User Sakshi Sakshi Time Apr 2, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Supreme-Court-Slams-Ramdev.jpg

పతంజలి ఉత్పత్తుల తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు

సుప్రీం కోర్టులో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ పిటిషన్‌పై విచారణ

మంగళవారం కోర్టుకు హాజరైన పతంజలి నిర్వాహకులు బాబా రాందేవ్‌, బాలకృష్ణ

భేషరతు క్షమాపణలను తోసిపుచ్చిన కోర్టు

చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ వ్యాఖ్య

ఏప్రిల్‌ 10కి విచారణ వాయిదా.. ఆరోజూ హాజరుకావాలంటూ ఆదేశాలు

పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తప్పుడు ప్రకటన కేసులో ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వెల్లగక్కింది. ఈసారి కోర్టుకు హాజరైన ఆయనపై నేరుగానే మండిపడింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ సందర్భంలో బేషరతుగా ఆయన చెప్పిన క్షమాపణలను సైతం కోర్టు తోసిపుచ్చింది.

పతంజలి కేసులో తమ ఆదేశాల్ని పాటించడం లేదంటూ రాందేవ్‌ బాబాతో పాటు ఆయన అనుచరుడు బాలకృష్ణపై కోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో మంగళవారం ఈ ఇద్దరు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘చర్యలకు సిద్ధంగా ఉండండి.. మరోసారి కోర్టుకు రండి’ అంటూ జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అషానుద్దీన్‌ అమానుల్లాలతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో కిందటి నెలలో పతంజలి తరఫున వాళ్లు చెప్పిన బేషరతు క్షమాణలను సైతం కోర్టు తోసిపుచ్చింది.

‘‘మీ వివరణతో మేం సంతృప్తి చెందలేదు. మీ క్షమాపణల్ని మేం అంగీకరించం’’ అని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే వ్యక్తిగతంగా ఆ ఇద్దరు కోర్టుకు హాజరయ్యారని.. ఇక్కడి నుంచే క్షమాపణలు చెబుతున్నారని.. కోర్టు ఏం ఆదేశిస్తే దానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని.. వాళ్ల తరఫు లాయర్‌ చేతులు జోడించి మరీ బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేస్తూ విచారణ ఏప్రిల్‌ 10వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. 

‘‘కోర్టు ఆదేశించినా కూడా మీరు అదే ప్రకటనలు ఇచ్చారంటే ఎంత ధైర్యం?. అసలు ఆ ప్రకటనల్లో శాశ్వత ఉపశమనం అన్నారు. అంటే దానర్థం ఏంటి?.. పూర్తిగా వ్యాధిని నయం చేస్తారనా?..’’ అని కోర్టు పతంజలి నిర్వాహకులిద్దరినీ ప్రశ్నించింది. అఫిడవిట్‌లో వీరు ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. వారం రోజుల్లోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది. 

మరోవైపు పతంజలి తప్పుడు ప్రకటనల వ్యవహారంలో కళ్లు మూసుకుని కూర్చుందంటూ గత విచారణలో(ఫిబ్రవరి 27న) కేంద్రంపైనా సుప్రీం కోర్టు మండిపడింది. బాబా

పతంజలి స్పందన లేకపోవడంతో..

రాందేవ్‌కు చెందిన ప‌తంజ‌లి ఆయుర్వేద సంస్థ‌కు గతంలోనే పలుమార్లు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హెర్బ‌ల్ ఉత్ప‌త్తుల‌పై మోస‌పూరిత ప్రక‌ట‌న‌లు చేస్తే ఒక్కొక్క ఉత్ప‌త్తిపై భారీ జ‌రిమానా త‌ప్ప‌ద‌ని తెలిపింది. కంపెనీ చేస్తున్న నిరాధారమైన, మోసపూరితమైన ప్రకటనలను ఆపివేయాల‌ని, లేక‌పోతే ఆ సంస్థ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయ‌ల‌ చొప్పున జరిమానా విధిస్తామ‌ని తీవ్రంగా హెచ్చరించింది. అంతేకాదు..ఆ యాడ్స్‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని ఆదేశించింది కూడా. ఈ క్రమంలో.. జారీ చేసినా నోటీసులకు పతంజలి స్పందించలేదు.

ఆపై విచారణలో.. ‘మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదు..?’ అని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దానిలో భాగంగా ఇటీవల పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని వ్యాఖ్యానిస్తూ.. క్షమాపణలు తెలియజేసింది. తాజాగా వారు కోర్టు ముందుకు వచ్చారు.

IMA పిటిషన్‌.. 

తమ ఉత్ప‌త్తుల వ‌ల్ల కొన్ని వ్యాధులు న‌యం అవుతాయంటూ ప‌తంజ‌లి కంపెనీ కొన్ని ప్రక‌ట‌నలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఈ పిటీషన్ పైనే ధర్మాసనం విచారణ జరిపింది. 

గత విచారణల్లో.. 

ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ‌ ఉత్పత్తుల‌ను, ఆ ఉత్ప‌త్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీం కోర్టు గత విచారణల్లో ఆదేశించింది. ప‌తంజ‌లి సంస్థ కూడా డాక్టర్లను కించపరిచేలా వ్యవహరించటం సరికాదని పేర్కొంది. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఇలాంటి ప్రకటనలు చేయవద్దని పతంజలి సంస్థ‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఆ ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Patanjali
Patanjali Advertisements
baba ramdev
Supreme court of India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.