Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. సుప్రీంకోర్టే సర్వోన్నతం!
ADVERTISEMENT 

సుప్రీంకోర్టే సర్వోన్నతం!

National Sakshi User Sakshi Sakshi Time Sep 3, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
SUPREME-COURT-BUILDING-2s.jpg

రాష్ట్రపతితో రగడపై సీజేఐ ధర్మాసనం 

న్యాయం కోసం ఏ ఆదేశాలైనా ఇస్తాం 

అవసరమైతే చట్టాలనూ పక్కన పెడతాం 

రాష్ట్రపతి లేఖ ఫక్తు ‘రాజకీయ’ వివాదమే 

అయినా సమాధానమిచ్చి తీరతాం: సీజేఐ 

న్యాయసమీక్ష ‘మౌలిక నిర్మాణం’లో భాగం 

ఆర్టీకల్‌ 142 కట్టబెట్టిన అసాధారణ అధికారం 

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై జస్టిస్‌ గవాయ్‌ 

బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు తొక్కిపట్టజాలరు 

తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాల సీనియర్‌ న్యాయవాదులు సిబల్, సింఘ్వీ 

కేంద్రం తరఫున ఎస్‌జీ మెహతా తీవ్ర అభ్యంతరం

న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, సుప్రీంకోర్టుల్లో ఎవరు సుప్రీం అన్న అత్యంత కీలకమైన అంశంపై ఆ రెండు వ్యవస్థల నడుమ కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న పెను వివాదం ముదురుపాకాన పడింది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ కేసులోనైనా సరే, సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు అవసరమైన అన్ని రకాల ఆదేశాలూ ఇచ్చి తీరతామని కుండబద్దలు కొట్టింది.

‘‘అందుకోసం అవసరమతే ప్రస్తుత చట్టాల్లోని లోపాలను బేఖాతరు చేయాల్సి వచి్చనా ఏ మాత్రమూ వెనకాడబోం. ఎందుకంటే ఆర్టీకల్‌ 142 కింద సుప్రీంకోర్టుకు స్వయానా రాజ్యాంగమే కట్టబెట్టిన అసాధారణమైన విచక్షణాధికారమది’’ అని కుండబద్దలు కొట్టింది. అంతేగాక, అత్యున్నత న్యాయస్థానానికి దఖలు పడ్డ న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని చరిత్రాత్మకమైన మినర్వా మిల్స్‌ కేసును ఉటంకిస్తూ గుర్తు చేసింది. తద్వారా, సుప్రీంకోర్టు అధికార పరిధికి అంతిమంగా రాష్ట్రపతి కూడా లోబడాల్సిందేనని చెప్పకనే చెప్పింది.

అసెంబ్లీలు ఆమోదించే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్లతో పాటు ఏకంగా రాష్ట్రపతికి కూడా 3 నెలల గడువు విధిస్తూ సీజేఐ ధర్మాసనం ఇటీవల వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనం  సృష్టించడం తెలిసిందే. దానిపై కీలక రాజ్యాంగపరమైన సందేహాలు లేవనెత్తుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేరుగా సుప్రీంకోర్టుకే లేఖ రాయడం మరింత సంచలనంగా మారింది. దానిపై సీజేఐ ధర్మాసనం ఎదుట మంగళవారం ఆరో రోజు కూడా విచారణ కొనసాగింది. రాజ్యాంగపరమైనవంటూ ఈ విషయమై రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలు వాస్తవానికి రాజకీయపరమైనవవేనని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చేసింది.

అయినా సరే, రాష్ట్రపతి లేవనెత్తిన ‘రాజ్యాంగపరమైన’ ప్రశ్నలకు సమాధానం నిరాకరించజాలమని పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధిస్తూ ఆదేశాలిచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందో లేదో తేల్చాలంటూ ఆర్టీకల్‌ 143(1) కింద దఖలు పడ్డ విచక్షణాధికారాలను వాడుకుంటూ ద్రౌపదీ ముర్ము గత మే నెలలో సీజేఐకి లేఖ రాసింది.  

వారికి ఆ అధికారాల్లేవ్‌! 
గవర్నర్లు బిల్లులకు ఆమోదం తెలపకుండా తొక్కిపెట్టడం ప్రజాభీష్టాన్ని కాదనడమేనని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ చరిత్రలోనే మొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. ‘‘ఒక వ్యవస్థ మరో వ్యవస్థకు అవరోధంగా మారేందుకు రాజ్యాంగంలోని ఏ సూత్రమూ అనుమతించదు. అసలు విచక్షణ అనే భావనే ఆర్టీకల్‌ 200కు ఫక్తు విరుద్ధం.

గవర్నర్‌ నిర్వర్తించేది రాజ్యాంగ విధి, అంతే తప్ప స్వేచ్ఛాయుత ఎంపిక కాదు‘ అని వాదించారు. రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలు రాజ్యాంగ సమీక్షకు అతీతమని కేంద్రం భావిస్తోందంటూ తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి మండిపడ్డారు. అలా బిల్లులను ఆపేసేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు ఎలాంటి స్వతంత్ర అధికారాలూ లేవని వాదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో తలెత్తిన న్యాయ వివాదాలను సింఘ్వీ తన వాదనకు మద్దతుగా ప్రస్తావించారు. దాన్ని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తీవ్రంగా తప్పుబట్టారు.

‘‘అలాంటి కేసులనే వాదనలకు ఆధారంగా చూపదలిస్తే మేం (కేంద్రం) కూడా లిఖితపూర్వకంగా సమాధానం సమరి్పంచాల్సి వస్తుంది. స్వతంత్రం వచి్చన నాటినుంచీ కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని అడ్డంగా తుంగలో తొక్కుతూ వచ్చారు. ఆ మురికమయమైన గతాన్ని తవి్వపోయాలనే మీరు భావిస్తుంటే అందుకు సంబంధించిన పూర్తి రికార్డులను మేం కోర్టు ముందుంచుతాం’’ అని సింఘ్వీ, సిబల్‌లను ఉద్దేశించి స్పష్టం చేశారు. సీజేఐ కల్పించుకుని వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ కావచ్చు, తెలంగాణ, కర్నాటక కావచ్చు, మేం కేవలం రాజ్యాంగంలోని నిబంధనలకు నిర్వచిస్తామంతే. అంతకంటే మరేమీ లేదు’’ అంటూ వాదనలను రాజ్యాంగపరమైన అంశాలపైకి మళ్లించారు. విచారణ బుధవారం కూడా కొనసాగనుంది. 

మినర్వా కేసు.. మైలురాయి! 
న్యాయసమీక్ష రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమంటూ ధర్మాసనం ఉటంకించిన మినర్వా మిల్స్‌ కేసును భారత న్యాయచరిత్రలోనే అతి కీలక మైలురాయిగా పేర్కొంటారు. ఏ విషయంపై అయినా నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతమే సర్వోన్నతమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పుకు మినర్వా కేసే నిమిత్తంగా నిలిచింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Supreme Court
presidential
bills
CJI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నీట్ రీ-ఎగ్జామ్ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్

నీట్ రీ-ఎగ్జామ్ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ విచారణ జూలైకి వాయిదా!

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ విచారణ జూలైకి వాయిదా!

సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్‌కు ఊరట

సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్‌కు ఊరట

‘వాళ్లంతా పరాన్నజీవులు..’

‘వాళ్లంతా పరాన్నజీవులు..’

ఆర్టీఐ ముసుగులో వ్యాపారం!

ఆర్టీఐ ముసుగులో వ్యాపారం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.