Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. కస్టడీలో ఉంచి ఏం సాధిస్తారు?
ADVERTISEMENT 

కస్టడీలో ఉంచి ఏం సాధిస్తారు?

National Sakshi User Sakshi Sakshi Time Nov 27, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sc.jpg

మద్యంపై అక్రమ కేసులో బాబు సర్కార్‌కు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న  

ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు లొంగుబాటు నుంచి మినహాయింపు

ట్రయల్‌ కోర్టు విధించిన షరతులకు లోబడి బెయిల్‌పై కొనసాగుతారని వెల్లడి

26వ తేదీలోపు లొంగిపోవాలంటూ హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులపై స్టే 

200 మంది సాక్షులుంటే... విచారణకు ఎంత సమయం పడుతుందో..అంతకాలం వీరిని జైల్లో ఉంచడం సరికాదు

సిట్‌ ఆందోళనకు అరెస్ట్‌ పరిష్కారం కాదు 

కౌంటర్‌ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం, సిట్‌కు సుప్రీం నోటీసులు 

తదుపరి విచారణ డిసెంబర్‌ 15కు వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్‌ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీ­ంకోర్టులో బుధవారం ఊరట లభించింది. ఏపీ హై­కోర్టు ఆదేశాల మేరకు బుధవారం (నవంబర్‌ 26న) వారు సరెండర్‌ కావాల్సిన అవసరం లేదని సర్వోన్న­త న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘వారిని కస్టడీ­లో ఉంచితే దానితో ఏ ప్రయోజనం ఒనగూరుతుందో మీరు చెప్పాలి. వారిలో ఒకరు సీనియర్‌ అధి­కా­రి అని మాకు తెలుసు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మీరు భావిస్తే దా­ని­కి తగిన షరతులు విధించవచ్చు. 

అంతేకానీ అరెస్ట్‌ పరిష్కారం కాబోదు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘200 మంది సాక్షులను విచారించాలని మీరు (సిట్, ప్రభు­త్వం) చెబుతున్నారు. కనీనం 100 మంది సాక్షులు ఉన్నారనుకుందాం. అలాంటప్పుడు విచా­­రణ పూ­ర్త­య్యేం­దుకు మీరు ఎంతకాలం తీసు­కుంటారు?’ అని ప్రశ్నించింది. 

తదనంతరం సరెండర్‌ నుంచి పిటి­షనర్లకు మినహాయింపునిస్తూ సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్‌ కోర్టు విధించిన షరతులకు లోబడి వారు డిఫాల్ట్‌ బెయిల్‌పై కొన­సాగుతారని స్పష్టం చేసింది. ఏపీ ప్ర­భు­త్వం 10రోజుల్లో కౌం­టర్‌ దాఖలు చేయా­లని ఆదేశించింది. రిజాయిండర్‌కు పిటిషనర్లకు మరో 5రోజులు గడువు మంజూరు చేస్తూ విచార­ణను  డిసెంబర్‌ 15వ తేదీకి వాయిదా వేసింది.

అకడమిక్‌ చర్చల్లోకి వెళ్లాలనుకోవడం లేదు
బెయిల్‌ మంజూరు సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వం, సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూ­థ్రా, ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ అగర్వాల్‌ చేసిన వాదన­­లతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఈ కేసు­లో దా­దా­పు 400 మంది సాక్షులు ఉన్నారని, ఇప్పటికి ఇంకా 200 మందికి పైగా సాక్షులను విచారించాల్సి ఉందన్నారు. 

‘మొదట ట్రయల్‌ కోర్టు మా చార్జ్‌ షీట్‌ను విస్మ­రించింది. ఇప్పుడు చార్జ్‌ షీట్‌ను తగిన విధ­ంగా సమర్పించాం. ట్రయల్‌ను వీలైనంత త్వర­గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూ­థ్రా నివేదించగా, దీనిపై చీఫ్‌ జస్టిస్‌ జోక్య­ం చేసుకుంటూ, ‘కోర్టు సమయం వృథా అయ్యే అకడమిక్‌ చర్చల్లోకి వెళ్లాలనుకోవడం లేదు’ అని వ్యాఖ్యా­ని­ంచారు.

‘కస్టడీ’పై సీజేఐ కీలక ప్రశ్నలు
» 200 మంది సాక్షులను విచారించాలని మీరు (సిట్, ప్రభుత్వం) చెబుతున్నారు.  కనీనం 100 మంది సాక్షులు ఉన్నారనుకుందాంం. అలాంటప్పుడు విచారణ పూర్తయ్యేందుకు మీరు ఎంతకాలం తీసుకుంటారు?
»  పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాలన్న కారణంతో ఒక వ్యక్తిని చాలా కాలం జైలులో ఉంచడం సరైంది కాదు.  
» హైకోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసిన పిటిషన్ల విచా­రణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్య­కాంత్‌ రాష్ట్ర ప్రభుత్వ (సిట్‌) తీరుపై పలు కీలక ప్రశ్నలు సంధించారు. కీలక వ్యాఖ్యలు, సూచనలు చేశారు.  
» నిందితులను ఇప్పుడు కస్టడీలో ఉంచడం వల్ల కొత్తగా సాధించేదేముంది?
» రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ ఆధారంగానే నిందితునికి బెయిల్‌ రావాలని భావించడం వల్ల  (న్యాయమైన విచారణకు భంగం లేకుండా నిందితుడికి స్వేచ్ఛ ఇవ్వవచ్చని కోర్టు భావించేంతవరకూ) డిఫాల్ట్‌ బెయిల్‌ విషయంలో అనేక పిటిషన్లు చివరకు నిరర్థకంగా మారుతున్నాయి.  
»   సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఆందోళన ఉంటే, కఠినమైన షరతులు విధించి బెయిల్‌ ఇవ్వవచ్చు. 
»   అంతేకానీ అరెస్ట్‌ పరిష్కారం కాదు.

దర్యాప్తులో లోపాలకు నిందితులను బలి చేయకూడదు
పిటిషనర్ల వాదనలు
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు సి. ఆర్య­మ సుందరం, నిరంజన్‌ రెడ్డి, సిద్ధార్థ దవేలు బల­మైన వాదనలు వినిపించారు. దర్యాప్తులో లోపాలకు నిందితులను బలి చేయకూడదన్న పిటిషనర్ల వాదనలపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. వాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.  దర్యాప్తు పూర్తయ్యాక అరెస్ట్‌ చేయడం అన్యాయం.  హైకోర్టు ఆదేశాల ప్రకారం పిటిషనర్లు బుధవారం సరెండర్‌ కావాల్సి ఉంది. ఈ కేసు విచారణ అత్యవసరం. నిందితులు ఇప్పటికే 108 రోజు­లు కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్‌ నుంచి బెయిల్‌పై బయ­ట ఉన్నారు.  ఇప్పుడు మళ్లీ అరెస్ట్‌ చేయడం అన్యాయం. 


దర్యాప్తు సంస్థ గడువులోగా పూర్తి చార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు. సాంకేతిక కారణా­లతో బెయిల్‌ రద్దు చేయడం సరికాదు. దర్యాప్తులో లోపా­లకు నిందితులను బలి చేయకూడదు. అసంపూర్ణ చార్జ్‌­షీట్‌ దాఖలైనప్పుడు నిందితులకు డిఫాల్ట్‌ బెయిల్‌ హక్కు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై సుప్రీంకోర్టులోనే భిన్న తీర్పులు ఉన్నాయి. రీతు ఛబ్రియా కేసులో దర్యాప్తు పూర్తి కాకుండా కేవలం చార్జ్‌ షీట్‌ వేసినంత మాత్రాన నిందితుడు డిఫాల్ట్‌ బెయిల్‌ హక్కు కోల్పోడని తీర్పు ఉంది. 

కపిల్‌ వాధ్వాన్‌ కేసులో చార్జ్‌ షీట్‌ వేసి, కోర్టు కాగ్నిజెన్స్‌ తీసుకుంటే ఇక డిఫాల్ట్‌ బెయిల్‌ రాదని పేర్కొన్నారు. ఈ న్యాయపరమైన వైరుధ్యంపై స్పష్టత కోసం ’మన్‌ప్రీత్‌ తల్వార్‌’ కేసును ఇప్పటికే ముగ్గురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేశారు. ఆ కేసులో తీర్పు వచ్చేంతవరకు, లేదా ఈ కేసులో తదుపరి విచారణ జరి­గేంతవరకు నిందితుల స్వేచ్ఛను హరించడం సరికాదు.

అసలేం జరిగింది? 
నిర్దేశిత గడువులోగా చార్జ్‌ షీట్‌ దాఖ­లు కానందున ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, బాలాజీ గోవిందప్పకు గతంలో ట్రయల్‌ కోర్టు ‘డీఫాల్ట్‌ బెయిల్‌’ మంజూరు చేసింది. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకో­ర్టు వారి డీఫాల్ట్‌ బెయిల్‌ను రద్దు చేసింది. నవంబర్‌ 26లోగా ట్రయ­ల్‌ కోర్టులో లొంగిపోవాలని, రెగ్యు­లర్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. హైకో­ర్టు తీర్పును సవాలు చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
illegal liquor case
Dhanunjaya Reddy
krishnamohan reddy
govindappa
Supreme court of India
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.